లేఖిని ఇప్పుడు మరింత సౌకర్యవంతం.సరికొత్త హంగులివే:
- అక్షర పట్టికని తొలగించుకోవచ్చు, తిరిగి తెప్పించుకోవచ్చు. ఒక్క మూషికపు నొక్కుతో! (పట్టిక కుడివైపు పైన X)
- Input మరియు output పెట్టెల పొడవుని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. (input box కుడివైపు క్రింద చూడండి.)
- చిన్న కంప్యూటర్ తెర ఉన్నవారు ఎక్కువ స్థలంకోసం గులాబీ రంగు శీర్షికని కూడా తొలగించుకోవచ్చు. (దాని మీద ఒక క్లిక్కివ్వండి చాలు.) ఆ గులాబీ రంగుని ఎక్కువసేపు చూడలేనివారికి కూడా ఉపయోగమే!
- ప్రశ్నార్థకం (?) మరియు ఆశ్చర్యార్థకం (!) ఇప్పుడు on-the-jump మీటల జాబితాలోకి చేరాయి.
- మీ బ్లాగు లేదా వెబ్‌సైట్ నుండి లేఖినికి లంకె వెయ్యడానికో రెండు చిన్న బటన్లు.
- ఇకనుంచి, veeven.com/lekhini కూడా పనిచేస్తుంది.
ఇంకెందుకాలస్యం, ఇప్పుడే వెళ్ళి చూడండి.
చాలా మంచి ప్రయత్నం వీవెన్ . ముందు ముందు కూదా ఇలాంటివి చాలా ఆశిస్తున్నాను
ఇట్లు,
కిరణ్
వీవెన్! లేఖిని తెలుగు వ్రాయాలనే అందరికీ నిజంగానే సార్థకనామధేయురాలయ్యింది.
పై పెట్టెలో వ్రాసుకుంటూపోతున్నప్పుడు కింది పెట్టె పూర్తిగా నిండాక ఇక తర్వాతి అనువాదం చూడాలంటే fOcus మార్చి, కిందికి scroll చేయాల్సి వస్తోంది. అలా కాకుండా మనం పైన టైప్ చేస్తూవుంటే క్రింది పెట్టె నిండాక auto scroll చేయడం సాధ్యమా!
ఇంకో విషయం ఏంటంటే పెద్ద పెద్ద వ్యాసాలు వ్రాసేప్పుడు content ఎక్కువయ్యే కొద్దీ అనువాదపు సమయం ఎక్కువవుతూ ఉంది. “.,?! space” లాంటి ప్రతి అక్షరానికీ content మొత్తాన్నీ తర్జుమా చేయకుండా ప్రస్తుత అక్షరం నుండీ దానికి వెంటనే ముందున్న “.,?! space” అక్షరం వరకూ తర్జుమా చేస్తే సరిపోతుందేమొ! ఈ విధంగా ప్రతిసారీ మొత్తాన్ని చేసే బదులు చివరి వాక్యాన్ని మాత్రమే చేస్తాము. దీని వల్ల ఒక వాక్యం కంటే వెనక్కి వెళ్ళి తప్పు సరిచేయాలంటే కష్టం కావచ్చు.
మీ “లేఖిని సహాయం”లో అరసున్న ( ఁ ) ఎలా వ్రాయాలో చెప్పలేదు. లేఖినిలో # special character కావటం వల్ల ఁ అని వ్రాయటానికి కూడా వీలులేదు! :(
లేఖిని అమూల్యమయిందే! మరిన్ని వజ్రాలను పొదుగుతారని ఆశిస్తూ!
— ప్రసాద్
ప్రసాద్ గారూ, మంచి సూచనలు. తప్పకుండా వాటిని అమలుచేయడానికి ప్రయత్నిస్తా.
అరసున్నా ఎలా వస్తుందో చెప్పగలరు.
అరసున్నా కావలసిన చోట @m అని టైపు చెయ్యండి.
ధన్య వాదములు. అరసున్నని వాడుతున్న ఒక యూజర్ సహాయం పొంది యున్నాను. మీ స్పందనకు విశేష కృతజ్ఞతలు.
దు:ఖం లో కోలన్ పెడుతున్నాను ఎలా వ్రాయాలి ?
రాం లో సున్నా లాగా కాకుండా మ ఎలా వ్రాయాలి ?
నీహారిక గారూ, వాటిని ఇలా టైపు చెయ్యవచ్చు:
దుఃఖం = du@hkham
రామ్ = raam&^