Posts Tagged ‘Telugu’
మొబైళ్ళలో తెలుగు → తెలుగులో మొబైళ్ళు
టూకీగా…
ముందుగా తెలుగు మొబైళ్ళ కోసం నేను మొదలుపెట్టిన పిటిషనుకు స్పందించి దానిపై సంతకం చేసి, దాన్ని తమ మిత్రులతో పంచుకున్న వారందరికీ కృతజ్ఞతలు! మీ అందరివల్లా మొదటి వారంలోనే 200 సంతకాలు దాటాయి. ఇక దీన్ని మరింత మందికి చేర్చే ప్రయత్నం చేద్దాం.
ఈ విన్నపంపై మీరింకా సంతకం చేసివుండకపోతే, ఇప్పుడే వెళ్ళి సంతకం చేయండి. దీన్ని మీ మిత్రులతోనూ, మీకు తెలిసిన మొబైల్ కంపెనీల సిబ్బంది తోనూ పంచుకోండి. చేతిఫోన్లను తెలుగులో ఉపయోగించుకోవడంలో ఇబ్బందులుంటే, ఆయా కంపెనీలకు నివేదించండి.
ఇన్‌స్క్రిప్ట్+ పూర్తిస్థాయి తెలుగు కీబోర్డు లేయవుటు
ప్రపంచవ్యాప్తంగా ఉన్న లిపులన్నింటినీ కంప్యూటర్లలో ఉపయోగించుకునేందుకు వీలుగా యూనికోడ్ కన్సార్టియమ్ అన్ని అక్షరాలకూ స్థిరమైన సంకేతబిందువులను కేటాయిస్తుంది. వీటిల్లో ప్రస్తుతం వాడుకలో ఉన్న అక్షరాలే కాకుండా, కాలగతిలో కలిసిపోయిన అక్షరాలు కూడా ఉంటాయి. పురాతన గ్రంథాలను సాంఖ్యీకరించడానికి ప్రాచీన అక్షరాల/గుర్తుల అవసరం ఉంటుంది కదా. ఇవన్నీ యూనికోడ్ ప్రమాణంలో ఉన్నంత మాత్రన అంతిమ వాడుకరులకు అందుబాటులో ఉండకపోవచ్చు. ఎందుకంటే, వాటిని టైపు చెయ్యడానికి ఒక పద్ధతో పరికరమో కావాలి కదా!
భారతీయ భాషలకు సంబంధించి యూనికోడ్ 6.0 ప్రమాణంలో ఉన్న అన్ని అక్షరాలను టైపు చెయ్యగలిగే విధంగా, C-DAC వారు గతంలో రూపొందించిన ఇన్‌స్క్రిప్ట్ కీబోర్డు అమరికను మెరుగుపరిచి నిరుడు విస్తృత ఇన్‌స్క్రిప్ట్ కీబోర్డు అమరికను ప్రతిపాదించారు. (ఈ పేజీలో “Enhanced INSCRIPT standard (Proposed)” అన్న లంకె నుండి వారి ప్రతిపాదనను దించుకోవచ్చు.)
ఈ ప్రతిపాదన అధారంగా నేను ఇన్‌స్క్రిప్ట్+ అని తెలుగు కీబోర్డు అమరికను తయారుచేసాను. ఇలా ఉంటుందది:

తెలుగు అంతర్జాల సదస్సుపై నా నివేదిక
ఈ శనివారం హైదరాబాదు లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (MCRHRD) లో జరిగిన తెలుగు అంతర్జాల సదస్సు గురించి మీకు ఇప్పటికే తెలిసివుంటుంది. ఆ సదస్సుపై నా నివేదిక ఇది. ఇది అసంపూర్ణమే. ఆ ఆనందోత్సాహలూ ప్రేరణా ఈ టపాలో ప్రతిబింబించకపోవచ్చు.
ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »
గణతంత్ర దినోత్సవ కానుక: ఇన్‌స్క్రిప్ట్ లేఖిని
ఇప్పుడు లేఖినిలో ఇన్‌స్క్రిప్టుని టైపు చేసుకోవచ్చు మరియు నేర్చుకోవచ్చు: lekhini.org/inscript
ఇన్‌స్క్రిప్ట్ నేర్చుకునే వారికి ఉపయోగంగా ఉండాలన్న ప్రధాన ఉద్దేశం తోనూ, ఎప్పుడైనా ఇతరుల కంప్యూటర్లో త్వరగా టైపు చెయ్యాల్సి/చేసుకోవాల్సి వచ్చినప్పుడు (ఇన్‌స్క్రిప్ట్ స్థాపించే సమయం తీరికా లేనప్పుడు టైపు చేసుకోడానికి) వీలుగా ఉండాలన్న అనుబంధ ఉద్దేశంతోనూ దీన్ని తయారు చేసాను.
ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »
తెలుగు వికీపీడియా అకాడమీ (జాలంలో)
వికీపీడియా అకాడమీ గురించి ఇటీవలే అర్జున రావు ఓ టపా రాసారు. ఆయన మాటల్లోనే:
వికీపీడియాని చాలా మంది చదవడానికి మాత్రమే వాడుతున్నారు. దానిలో ఎవరైనా సమాచారం చేర్చవచ్చని ఎంతమందికి తెలుసు. తెలిసినా ఎంతమంది చేస్తున్నారు.తెలుగు మరి ఇతర భారతీయ భాషలలో వ్యాసాలు తక్కువగా వుండటానికి చాలా అటంకాలు ఉన్నప్పటికి, వికీపీడియా గురించి, దానిలో సమాచారం ఎలా చేర్చవచ్చో తెలియక పోవడమే పెద్ద ఆటంకం. దానిని తొలగించటానికి ఉద్దేశించిందే వికీపీడియా అకాడమీ.
ఈ విధమైన వికీపీడియా అకాడమీ సెషన్‌ని జాలంలో ఒకదాన్ని నిర్వహించాలని నేను అనుకుంటున్నాను. ఇవీ వివరాలు:
- వేదిక: chat.etelugu.org
- సమయం: సెప్టెంబర్ 19, 2009 శనివారం ఉదయం 10:00 నుండి 11:00 వరకు
మీకు తెలుగు వికీపీడియాకి తోడ్పడాలని ఉన్నా లేదా అందులోని సమాచారాన్ని వాడుకోవాలని ఉన్నా (వికీపీడియాని వాడటం, ఉదాహరణకి వ్యాసం రాసేప్పుడు ఫార్మాటింగు గట్రా, తెలియకపోయినా) లేదా వికీకి సంబంధించిన ఇతర విషయాలపై సందేహాలు ఉన్నా ఈ అకాడమీ సెషనుకి రండి. మీ సందేహాలకు సమాధానాలిచ్చేందుకు, తెవికీ నిర్వాహకులు మరియు క్రియాశీల సభ్యులు ఈ సెషనులో పాల్గొంటారు.
కొన్ని ఉపయోగపడే లింకులు:
- ఐదు నిమిషాల్లో వికీపీడియా
- ఏది వికీపీడియా కాదు
- ఐదు మూలస్థంభాలు
- వికీపీడియా – స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం (పొద్దు)
- తెలుగులో విజ్ఞానసర్వస్వాలు – వికీ ప్రాజెక్టులు (పొద్దు)
ఈ సెషనులో పాల్గొని, ప్రేరణ పొంది తెవికీని మెరుగుపరచడానికి ముందుకొస్తారని ఆశిస్తున్నాను. (ఒకవేళ మీరు ఈ సెషనులో పాల్గొనలేక పోతే, మీ సందేహాలను ఇక్కడ వ్యాఖ్యలుగానైనా లేదా తెవికీలో అయినా అడగండి.)
డాట్‌క్లియర్ (ఒక బ్లాగింగ్ ఉపకరణం) ఇప్పుడు తెలుగులో!
డాట్‌క్లియర్ అనేది ఒక బ్లాగింగ్ ఉపకరణం. ఇది బహిరంగాకరం (open source). మన స్వంత గూళ్ళలో దీన్ని స్థాపించుకోవచ్చు. దీనిలోని ప్రత్యేక సౌలభ్యాలు నాకు తెలిసినవి (ఓ రెండు గంటల ఉపయోగం తర్వాత) ఇవీ:
- ఒకే స్థాపనలో బహుళ బ్లాగులని సృష్టించుకోవచ్చు.
- టపాలను వికీ చంధస్సు (syntax) లో కూడా (WYSIWYG లేదా (X)HTML పద్ధతులతో పాటుగా) వ్రాసుకోవచ్చు.
దీన్ని తయారీదార్లు ఫ్రెంచి వాళ్ళు. దీన్ని తెలుగులోనికి నేను అనువదిస్తున్నాను (ఫ్రెంచి నుండి కాదు). తెలుగులో పరీక్షా బ్లాగుని చూడండి (దీని ప్రస్తుత తెలుగు అనువాద స్థితిని అక్కడ చూడవచ్చు).
మీ కోసం కొన్ని తెరపట్టులు.
ఆనంద స్థానికీకరణం!
ఓపెరా విహారిణి, ఇప్పుడు తెలుగులో కూడా!
ఈ రోజే (అక్టోబర్ 8న) ఓపెరా తన విహారిణి యొక్క 9.60 కూర్పుతో బాటుగా తెలుగు పాఠాంతరాన్ని కూడా విడుదల చేసింది. ఇది నిజంగా బ్రహ్మాండమైన వార్త! ఓపెరా జిందాబాద్!! ఓపెరా వారికి భారత దేశపు సైటు కూడా ఉంది, కానీ అది హిందీలో మాత్రమే లభ్యమవుతున్నట్టుంది.
దిగుమతి లింకు: opera.com/download (అక్కడ Telugu భాషని ఎంచుకోండి)
స్థాపన ప్రక్రియ అంతా కూడా ఆంగ్లంలోనే ఉంది. ఒక్కసారి స్థాపనమైన తర్వాత తెలుగందుకుంటుంది. అయితే చాలా వరకు తెలుగు పదాలు మనమనుకున్నవి లేవు. కానీ మంచి ప్రారంభం. మీకోసం కొన్ని తెరపట్టులు మరియు ఇతర వివరాలు.
ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »





