Posts Tagged ‘ఇన్‌స్క్రిప్ట్’
ఇన్‌స్క్రిప్ట్+ పూర్తిస్థాయి తెలుగు కీబోర్డు లేయవుటు
ప్రపంచవ్యాప్తంగా ఉన్న లిపులన్నింటినీ కంప్యూటర్లలో ఉపయోగించుకునేందుకు వీలుగా యూనికోడ్ కన్సార్టియమ్ అన్ని అక్షరాలకూ స్థిరమైన సంకేతబిందువులను కేటాయిస్తుంది. వీటిల్లో ప్రస్తుతం వాడుకలో ఉన్న అక్షరాలే కాకుండా, కాలగతిలో కలిసిపోయిన అక్షరాలు కూడా ఉంటాయి. పురాతన గ్రంథాలను సాంఖ్యీకరించడానికి ప్రాచీన అక్షరాల/గుర్తుల అవసరం ఉంటుంది కదా. ఇవన్నీ యూనికోడ్ ప్రమాణంలో ఉన్నంత మాత్రన అంతిమ వాడుకరులకు అందుబాటులో ఉండకపోవచ్చు. ఎందుకంటే, వాటిని టైపు చెయ్యడానికి ఒక పద్ధతో పరికరమో కావాలి కదా!
భారతీయ భాషలకు సంబంధించి యూనికోడ్ 6.0 ప్రమాణంలో ఉన్న అన్ని అక్షరాలను టైపు చెయ్యగలిగే విధంగా, C-DAC వారు గతంలో రూపొందించిన ఇన్‌స్క్రిప్ట్ కీబోర్డు అమరికను మెరుగుపరిచి నిరుడు విస్తృత ఇన్‌స్క్రిప్ట్ కీబోర్డు అమరికను ప్రతిపాదించారు. (ఈ పేజీలో “Enhanced INSCRIPT standard (Proposed)” అన్న లంకె నుండి వారి ప్రతిపాదనను దించుకోవచ్చు.)
ఈ ప్రతిపాదన అధారంగా నేను ఇన్‌స్క్రిప్ట్+ అని తెలుగు కీబోర్డు అమరికను తయారుచేసాను. ఇలా ఉంటుందది:

ఇన్‌స్క్రిప్ట్, ఆపిల్ కీబోర్డు లేయవుట్లు
ఈ టపా కార్తిక్ వ్రాసిన ఇన్‌స్క్రిప్ట్ గొప్పదా లేక ఆపిల్ కీబోర్డు గొప్పదా అన్న టపా లోని కొన్ని విషయాలపై నా స్పందన. ఆ టపాపై అక్కడే వ్యాఖ్య రాస్తే, బ్లాగర్ ఏదో తిట్టి నా వ్యాఖ్యని మింగేసింది. ఫార్మాటింగు, లంకెలతో ఒక టపాగా వ్రాస్తే మంచిదని ఇలా ఇక్కడ.
ఏది గొప్పది అని నిర్ణయించను గానీ, నేను మాత్రం ఇన్‌స్క్రిప్ట్ కీబోర్డు లేయవుటుని సిఫారసు చేస్తాను.
- ఇన్‌స్క్రిప్ట్ మరియు అనూ: బయట మార్కెట్లో డీటీపీ చెయ్యడానికి ఎక్కువగా అనూ స్క్రిప్ట్ మేనేజరుని (దానిలో ఆపిల్ కీబోర్డు లేయవుటుని) ఉపయోగిస్తారు. కానీ, అనూ ఉపయోగించడానికి ఆపిల్ కీబోర్డు లేయవుటు రావాల్సిన పనిలేదు. అనూలో కూడా ఇన్‌స్క్రిప్ట్ లేయవుట్ ఉంది. దీన్ని DOE అని పిలుస్తారు. (అనూ 7 సంగతి నాకు తెలియదు మరి.)
- యూనికోడ్ టైపు చెయ్యడానికి ఆపిల్ లేయవుటు పరికరం: ఆ పరికరాన్ని నేను కేవలం ఇప్పటికే ఆపిల్ లేయవుటు తెలిసివున్న వారు బ్లాగుల్లోనూ గట్రా (మరో లేయవుటో, లిప్యంతరీకరణో నేర్చుకోనవసరం లేకుండా) యూనికోడ్ తెలుగు టైపు చెయ్యడానికి ఉపయోగపడుతుందని మాత్రమే తయారుచేసాను. ఆ లేయవుటు విశ్వవిజేత అవ్వాలని కాదు. కనుక “వీవెన్ గారు ఆపిల్ ను డెవలప్ చేయడం స్టాండర్డ్స్ కి మొదటి మెట్టు” … అన్న ఆయన వ్యాఖ్యతో నేను ఏకీభవించలేను.
- రివర్స్ టైపింగ్:
మనం పుస్తకంలో రాసే తెలుగు భాషకు ఇక్కడ రివర్సులో టైపు చేయాలి. (మార్గాలు అని రాయాలంటే మా తరువాత “ర + గ వత్తు +దీర్గం”) మమూలుగా అయితే “ర + దీర్గం+ గ వత్తు” అంటే ముందు ఈ రివర్సు కు అలవాటు పడాలి. (వీవెన్ గారి ఆపిల్ లో కూడా ఇదే ఇబ్బంది.)
ఈ సమస్య అనూకి లేదా ఇతర సాంప్రదాయ పద్ధతులకి అలవాటు పడినవారికే అనుకుంటాను. ఇన్‌స్క్రిప్ట్, ఆపిల్ మాత్రమే కాకుండా యూనికోడ్లో ఏ రకంగా వ్రాసినా ఈ రివర్స్ పద్ధతే. ఇది మనం పలికే విధానానికి దగ్గరగా ఉంటుంది. మార్గాలు అన్న పదాన్ని ఎలా పలుకుతాం. కాస్త నెమ్మదిగా పలికి చూడండి… మా ర్ గా లు. ఇలా అయితే మన మెదడుకి చేతివేళ్ళకి సిక్రనింగు బాగా ఉంటుందనిపిస్తుంది.
- ఇంగ్లీషు – తెలుగుల మధ్య మారడం: Alt + Shift మీటలు కష్టమైతే, వీటిని మనకిష్టమైన మీటకి మార్చుకోవచ్చు కూడా. నేను Caps Lockని మార్పిడి మీటగా ఉపయోగించి అలవాటుని మార్చుకోలేక తిరిగి Alt + Shiftకి మళ్ళాను.
- ఇన్‌స్క్రిప్ట్ లేయవుటుకి తాజాకరణలు: 2010లో C-DAC వాళ్ళు ఇన్‌స్రిప్ట్ కీబోర్డుని మెరుగుపరుస్తూ—యూనికోడ్ ప్రమాణం లోని అన్ని తెలుగు అక్షరాలను మరియు తెలుగుకి అవసరముండే భారతీయ సంజ్ఞలనూ టైపు చెయ్యగలిగేలా విస్తరిస్తూ—విస్తరిత ఇన్‌స్క్రిప్ట్ కీబోర్డ్ లేయవుట్ 5.2 అని రూపొందించారు. (ఈ పుట లోని మొదటి లంకె ద్వారా ప్రతిపాదిత లేయవుటుని దించుకోవచ్చు.) ఈ విస్తరిత లేయవుటుని లినక్సులో ఉపయోగించుకొనే విధంగా m17n కొరకు ఇన్‌పుట్ పద్ధతిని నేను తయారు చేసాను. (
దీని గురించి వివరంగా మరోసారి వ్రాస్తాను.వ్రాసాను, చూడండి.)
ఇంతే సంగతులు!
గణతంత్ర దినోత్సవ కానుక: ఇన్‌స్క్రిప్ట్ లేఖిని
ఇప్పుడు లేఖినిలో ఇన్‌స్క్రిప్టుని టైపు చేసుకోవచ్చు మరియు నేర్చుకోవచ్చు: lekhini.org/inscript
ఇన్‌స్క్రిప్ట్ నేర్చుకునే వారికి ఉపయోగంగా ఉండాలన్న ప్రధాన ఉద్దేశం తోనూ, ఎప్పుడైనా ఇతరుల కంప్యూటర్లో త్వరగా టైపు చెయ్యాల్సి/చేసుకోవాల్సి వచ్చినప్పుడు (ఇన్‌స్క్రిప్ట్ స్థాపించే సమయం తీరికా లేనప్పుడు టైపు చేసుకోడానికి) వీలుగా ఉండాలన్న అనుబంధ ఉద్దేశంతోనూ దీన్ని తయారు చేసాను.
ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »
అనుపమ టైపింగ్ ట్యూటర్ పరిచయం
అనుపమ టైపింగ్ ట్యూటర్ అనేది మొదటి పూర్తిస్థాయి తెలుగు టైపింగ్ ట్యూటరుగా చెప్పుకోవచ్చు. దీన్ని వాడి మనం ఇన్‌స్క్రిప్ట్ కీబోర్డు లేయవుటుని నేర్చుకోవచ్చు. ఇందుకోసం ఇంగ్లీషు, మరియు ఇంగ్లీషు టైపింగు తెలియాల్సిన పనిలేదు. అసలు అనుపమ ట్యూటర్ ప్రత్యేకత ఏమిటంటే, అనుపమ అనే చిన్న అమ్మాయి తన మాటలతో సూచనలు ఇస్తూ ఉంటుంది. అనుపమ టైపింగ్ ట్యూటర్ నడుస్తున్నంతసేపూ మంద్రమైన తెలుగు సంగీతం వినిపిస్తుంది. అసలు అలసటే లేకుండా టైపింగు నేర్చుకోవచ్చు. క్రింద కొన్ని తెరపట్టులు మీకోసం.
ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »
అనుపమ తెలుగు టైపింగ్ ట్యూటర్ విడుదలయ్యిందా?
అనుపమ తెలుగు టైపింగ్ ట్యూటర్ జనవరి 14న వస్తుందని వారి వెబ్ సైట్లో చెప్పారు. ఇది విడుదలయ్యిందా? ఎవరికైనా తెలుసా? (తాజా సమాచారం: ఇది ఫిబ్రవరి 2008లో విడదలైంది.)
వారి సైట్లో చెప్తున్నదాన్నిబట్టి చూస్తే, ఇన్‌స్క్రిప్ట్ నేర్చుకోవాలనుకునే వారికి ఇదో మంచి పరికరం కాగలదు.


