వీవెనుడి టెక్కునిక్కులు

వెబ్, కంప్యూటర్లు, తెలుగు, ఇతరత్రా…

Archive for the ‘వ్యక్తిగతం’ Category

స్వచ్ఛమైన నీరు-ఆరోగ్యమైన మీరు

with 5 comments

పట్టణాల్లో ఉంటున్నమనం త్రాగేనీటిపై తగిన శ్రద్ధ వహించాలికదా. మేము మా ఇంట్లో త్రాగేనీటి కోసం కాచి వడపోసిన నీటిని ఉపయోగిస్తాం. స్వచ్ఛమైన నీటికోసం మరింత సులభమైన పద్ధతులు, సాధనాలు ఉండిఉంటాయి. వాటర్ ఫిల్టర్, ఆక్వాగార్డు, తదితరాలు.

నేను హిందూస్థాన్ లీవర్ వారి ప్యూరిట్‌ని కొందామని అనుకుంటున్నాను. మీలో ఎవరైనా దానిని ఉపయోగించిఉంటే చెప్పండి, మీరు దానితో సంతృప్తికరంగా ఉన్నారా? నేను ప్యూరిట్‌నే ఎంచుకోవాలా? లేదా మరేమైనా ఉత్తమ ఫలితాలు చూపే చౌక సాధనాలు ఉన్నాయా? ఒక రూపాయితో అత్యధిక ప్రయోజనం ప్యూరిట్ అందిస్తుందని హిందూస్థాన్ లీవర్ వారు చెప్తున్నారు. మీ సలహాలు, అభిప్రాయాలు తెలియజేయండి.

Written by వీవెన్

మే 2, 2007 at 5:50 అపరాహ్నం

ఐఐఐటి హైదరాబాదుకి నా సందర్శన

with 9 comments

పప్పు నాగరాజు గారు నాకు ఐఐఐటి ప్రొఫెసర్ వాసుదేవ వర్మ గారిని పరిచయం చేసారు. వాసుగారు శోధన మరియు సమాచార వెలికితీతల ప్రయోగశాల (Search and Information Extraction Lab, SIEL) కి నాయకత్వం వహిస్తున్నారు. ఐఐఐటిలో ఇది భాషా సాంకేతికతల పరిశోధనా కేంద్రం (Language Technologies Research Centre, LTRC) లో భాగం. వారి ఆహ్వానంతో లాబ్ సందర్శనకు నేను వెళ్ళా.

SIELలో విద్యార్థులు మరియు పరిశోధకులు (మన తోటి తెలుగుబ్లాగరు సౌమ్య కూడా ఈ విభాగంలోనే) పనిచేస్తున్న ప్రాజెక్టులని చూసా. వీరి ప్రణాళికల్లో బొమ్మల్లో ఉన్న వచనాన్ని శోధించడం (results from scanned images) కూడా ఉంది. ఇది వీలుపడితే, తిరుగేలేదు. ఎందుకంటే చాలా వరకు భారతీయభాషల్లోని సాంఖ్యాసమాచారం (digital content) ఇమేజిల రూపంలో ఉంది. జయధీర్ తిరుమలరావుగారి ప్రాజెక్టు (పోయినసారి e-తెలుగు సంఘ సమావేశ విశేషాల్లో వీరిగురించి చూడండి.) కి దీన్ని అనుసంధానిస్తే పురాతన విషయ సమాచారాన్ని శోధించే వీలు చిక్కుతుంది.

SIEL ప్రాజెక్టులలో కొన్నింటిని మనం వెబ్‌లో ప్రయత్నించవచ్చుకూడా. ఇవన్నీ గొప్ప ప్రాజెక్టులు. కీలకమైన అంశమేంమంటే, వీటిని సాధారణ వాడకానికి అనుగుణంగా తీర్చిదిద్దవలసిఉంది. వీటిని జనబాహుళ్యంలోనికి తీసుకురావడానికి నావంతు సహకారం అందిస్తానని చెప్పాను. ఈ ప్రాజెక్టులలో మీరు ఏయే మార్పులని ఆశిస్తున్నారు? అసలు వీటికి సంబంధంలేకుండా, మీ సమాచార ఆవశ్యకాలేంటి? బ్లాగర్లుగా సమాచార వినియోగంలో మనం ముందుంటాం. వీరినుండి మనమేం ఆశించవచ్చు? మీ ఆలోచనలని ఇక్కడ తెలియజేయండి. వీటిపై వారు దృష్టి కేంద్రీకరించే అవకాశం ఉంది.

నేను పనిచేసిన, చేస్తున్నవాటిగురించి వారికొక ప్రదర్శన (presentation) ఇచ్చా. అంతా మీకుతెలిసిందే, నా సొడబ్బా. కాకపోతే మీరిది చూడలనుకోవడాని ఓ కారణముంది: బహుశా ఇది యూనికోడ్ తెలుగులో తొలి ప్రెజెంటేషన్ కావచ్చు.

Written by వీవెన్

ఏప్రియల్ 22, 2007 at 6:34 పూర్వాహ్నం

2006

with 5 comments

నా జీవితంలో ఇప్పటివరకు 2006 అత్యంత ముఖ్యమైన సంవత్సరం. వ్యక్తిగతంగా (వివాహం), వృత్తిపరంగా (రెండుసార్లు పదోన్నతి), మరియు సాంఘికంగా (లేఖిని మరియు కూడలి) ఈ సంవత్సరం నాక్కొంత ప్రత్యేకత, గుర్తింపుని తెచ్చిపెట్టింది. ఇవీ ఈ సంవత్సరంలోని విశేషాలు:

Written by వీవెన్

డిసెంబరు 30, 2006 at 3:04 పూర్వాహ్నం

వ్యక్తిగతం లో రాసారు

Tagged with

ఇన్ స్క్రిప్ట్ వైపు పయనం

with 2 comments

సి-డాక్ వారి సీడీలో తెలుగు ఇన్ స్క్రిప్ట్ టైపింగు ట్యూటర్ ఉంది. దానితోతెలుగు టైపింగు నేర్చుకోవడం మొదలుపెట్టా. త్వరగానే నేర్చుకోగలుగుతున్నాను. అనుకున్నంత కష్టంగా ఏమీలేదు. ఈ టపాని ఇన్ స్క్రిప్టులోనే టైపు చేస్తున్నాను. ఇక నాకు లేఖినితో అవసరం తీరిపోయినట్టే!

Written by వీవెన్

డిసెంబరు 4, 2006 at 12:53 అపరాహ్నం

నా చేతిరాత

with 9 comments

Written by వీవెన్

ఆగష్టు 21, 2006 at 9:44 పూర్వాహ్నం

Veevenia

with 2 comments

My name is a unique one. I made it up by combining first three letters of first two words of my full name. Veera Venkata Chowdary → Veeven. In my childhood, I was called Chowdary. Old friends and relatives still call me so. As I grow older and explore the world, it turned out that both parts of my name are either prefix or suffix. “Chowdary” is the last name (and surname) in some communities. So if I say my name is “Chowdary”, people would ask me “which Chowdary?”. And, “Veera Venkata” is a pre-fixture in some communities. So, I need to invent something that refers only me and nothing else. So, “Veeven”. (But later I found pastries on that name. :-) That’s a different issue.) I use my full name for official purposes.

I continue to have trouble to get “Veeven” across to people. People would ask me again what was it just I said. People still do not get my name in the first instance. (Well, initially, it sounded new to even me.) Now, most people I knew would call me Veeven.

The uniqueness (and newness) of my name has its own disadvantages (and advantages). Some people have problem spelling my name correctly. There are so many incorrect spellings of my name around the web: Veevan, Viven, Viveen, Veevin, etc.

(ఇంగ్లీష్‌లో బ్లాగు టపా రాసి చాలా రోజులయ్యింది.)

Written by వీవెన్

ఆగష్టు 17, 2006 at 3:16 అపరాహ్నం

వ్యక్తిగతం లో రాసారు

Tagged with ,

పునఃస్వాగతం

with 6 comments

ఒక వారం రోజుల తర్వాత గాని మలేరియా తెరపినివ్వలేదు. ఇప్పుడు ఓకే! :-) మల్లీ మిథ్యా ప్రపంచం (virtual world) లోకి వచ్చేసా. చదవాల్సిన మెయిల్స్ చాలా ఉన్నయి. చెయ్యాల్సిన పనులు కూడా!

Written by వీవెన్

ఆగష్టు 12, 2006 at 9:10 పూర్వాహ్నం

వ్యక్తిగతం లో రాసారు

తెలివిజన్ నుండి అ(తి)తెలివిజన్ వరకు

with 8 comments

పరిణామక్రమం

  • మొదటి తరం
    • కార్యక్రమానికి కార్యక్రమానికీ మధ్యలో ప్రకటనలు
    • ఒకే ఛానలు
    • కాశీమజిలీ కథలు లాంటి సీరియళ్ళకోసం ఎంతో ఎదురుచూసేవాళ్ళం
  • రెండవ తరం
    • కార్యక్రమాల మధ్యలో ప్రకటనలు
    • మరిన్ని ఛానల్లు
  • మూడవ మరియు నేటి తరం
    • ప్రకటనల మధ్యలో కార్యక్రమాలు
    • లెక్కకు మిక్కిలి ఛానల్లు

Written by వీవెన్

మే 27, 2006 at 5:01 పూర్వాహ్నం

Hello World!

with 2 comments

I’ve just joined the flock with Flock.

Written by వీవెన్

అక్టోబర్ 30, 2005 at 2:09 అపరాహ్నం