వీవెనుడి టెక్కునిక్కులు

వెబ్, కంప్యూటర్లు, తెలుగు, ఇతరత్రా…

Archive for the ‘ఫైర్‌ఫాక్స్’ Category

హైదరాబాదులో ఫైర్‌ఫాక్స్ 3.5 సంబరాలకు ఆహ్వానం!

with 2 comments

నా అభిమాన విహారిణి ఫైర్‌ఫాక్స్ యొక్క సరికొత్త కూర్పు 3.5 ఈ మధ్యే విడుదలయ్యింది. (మీకు ఈపాటికి తెలిసే ఉంటుంది.) ఫైర్‌ఫాక్స్ 3.5 లోని కొత్త సౌలభ్యాల గురించి చాలా వ్యాసాలు ఇప్పటికే జాలంలో తేలియాడుతున్నాయి చూడండి.

మొజిల్లా.కామ్ మొదటి పేజీ తెలుగులో!
మొజిల్లా.కామ్ మొదటి పేజీ తెలుగులో!

ప్రపంచవ్యాప్తంగా ఫైర్‌ఫాక్స్ 3.5 దింపుకోళ్ళు ఎలా జరుగుతున్నాయో చూడండి. అలానే ఫైర్‌ఫాక్స్ తాజా మార్కెట్ వాటా శాతాన్ని కూడా చూడండి.

హైదరాబాదులో సంబరాలు

గత ఏడాది లానే ఈ సారి కూడా ఫైర్‌ఫాక్స్ విడుదల సందర్భంగా హైదరాబాదులో ఫైర్‌ఫాక్స్ అభిమానులం కలుద్దాం రండి. ఆ వివరాలు:

తేదీ మరియు సమయం: ఆదివారం, జూలై 19, 2009 సాయంత్రం 3 గంటల నుండి 5 వరకు.

వేదిక: కృష్ణకాంత్ ఉద్యానవం, యూసఫ్ గూడ బస్తీ, హైదరాబాద్. (పటం)

ఏం చేస్తాం:

  • ఫైర్‌ఫాక్స్ 3.5 లోని కొత్త సౌలభ్యాల గురించి మాట్లాడుకుందాం
  • మీ మీ లాప్‌టాపులు (అంకోపరులు) తెస్తే, దానిలో మంటనక్క 3.5 ని స్థాపించి విశేషాలను అక్కడికక్కడే ప్రదర్శించవచ్చు.
  • మీ లాప్‌టాప్ మరియు మొబైల్ ఫోన్ల కోసం స్టిక్కర్లు, మీ కోసం ఫైర్‌ఫాక్స్ 3.5 బాడ్జీలు కూడా ఇస్తాం

మీరు ఫైర్‌ఫాక్స్ అభిమానులై, హైదరాబాదులో ఉంటే ఈ సంబరాలకి తప్పకుండా రండి.

ఆనంద జాలా జ్వాలనం!

Written by వీవెన్

జులై 13, 2009 at 4:31 అపరాహ్నం

హైదరాబాదులో ఫైర్‌ఫాక్స్ 3 పార్టీ నివేదిక

with 11 comments

హైదరాబాదులో నిన్న (ఆదివారం, జూన్ 22) ఫైర్‌ఫాక్స్ 3 పార్టీ విజయవంతంగా జరిగింది. మొత్తం 25గురు  ఫైర్‌ఫాక్స్ అభిమానులు హాజరయ్యారు. వయస్సుతో నిమిత్తం లేకుండా 15 సంవత్సరాల నుండి 70 పైబడిన వారి వరకూ వీరిలో ఉన్నారు. మీడియా నుండి సాక్షి విలేఖరి దీప వచ్చారు.

మొదటగా పరిచయాలతో (పేరు తదితర వివరాలతో బాటు, మంటనక్కతో అనుబంధం ఎలా, ఎప్పటినుండి అన్న వివరం కూడా) ప్రారంభించాం. తర్వాత నేను సీడీలు పంచి దానిలోని ఉపకరణాల గురించి క్లుప్తంగా వివరించాను. పవన్ అవసరమైన చోట వివరాలను జోడిస్తూ అందరికీ అర్థమయ్యేట్టు చెప్పారు. ఫైర్‌ఫాక్స్ 3లోని విశేషాల గురించి మొదలు పెడుతూ పెర్ఫామెన్స్ పరంగా ఈ వెర్షను చాలా మెరుగైనట్టు గమనించానని శ్రీధర్ వివరించారు.  ఆపై ఫైర్‌ఫాక్స్ 3లోని విశేషాలని నేను, శ్రీధర్, పవన్ లు వివరించాం. వెర్షన్ 3లో మెరుగైన విశేషాలు వేగం (improved performance), చిరునామా పట్టీ (location bar), దిగుమతులు నిర్వహణ (download manager), ఒకే నొక్కు బుక్‌మార్కింగ్, font and text rendering, SVG తోడ్పాటు అలానే కొత్త సౌలభ్యాలైన పూర్తి పేజీ జూమ్, విస్టా థీము, ఇంకా అనేకాల గురించి మాట్లాడుకున్నాం. ఫైర్‌ఫాక్సులో తమకు నచ్చే విషయాల గురించి కూడా అందరూ చెప్పారు.

కొత్త విశేషాలపై వివరణలకోసం Field Guide to Firefox 3 చూడమని సూచించాం.

అందరి సందేహాలకు శ్రీధర్ మరియు పవన్ సూక్ష్మ వివరాలతో సహా సమాధానాలు ఇచ్చారు. ఇక పొడగింతల గురించి ప్రస్తావల రాకుంటా ఎలా ఉంటుంది. ఆడ్ బ్లాక్ ప్లస్, హిట్-ఎ-హింట్, డెలీషియస్, గ్రీస్ మంకీ, బెటర్ జీమెయిల్, FireFTP లాంటి పొడగింతల గురించి చెప్పుకున్నాం. కొన్ని ముఖ్యమైన కీబోర్డు షార్టుకట్లను తెలుపమని రావుగారు అడుగగా కొన్నింటిని చెప్పాం.

మనకి ఏ కంప్యూటర్లో నైనా అందుబాటులో ఉండేట్టుగా మన బుక్‌మార్కులు (పేజీకలు), సంకేతపదాలు (passwords) లాంటివి అంతర్జాలంలో దాచుకోలేమా అన్న ప్రశ్నకి గూగుల్ సింక్రనైజర్ ఉందని అలానే మొజిల్లా ప్రయోగశాల నుండి వీవ్ అనే కొత్త పొడగింత రాబోతుంది అని నేను చెప్పా.

ఫైర్‌ఫాక్స్  యొక్క హైదరాబాదు వాడుకరుల కోసం ఓ గూగుల్ గుంపు ఉన్నట్టు అందరికీ తెలియదని రావుగారన్నారు.

ఇతరత్రా విశేషాలు: కట్టా విజయ్ ఉబుంటు సీడీలను పంచారు. కందర్ప కృష్ణమోహన్ తన మార్కు చిట్టికాజాలను తెచ్చి అందరి నోళ్ళను తీపిచేసారు.

హైదరాబాదులో ఫైర్‌ఫాక్స్ 3 పార్టీ గ్రూప్ ఫొటో (ఫొటో: సీబీరావు)

చివరిగా గ్రూప్ ఫొటో దిగి, అటునుండి క్యాంటీనుకి వెళ్ళి టీ తాగి, సెలవు తీసుకున్నాం.

ఈ పార్టీ విజయవంతంగా జరగడంలో చాలా మంది సహకారం ఉంది. ముఖ్యంగా నల్లమోతు శ్రీధర్, కట్టా విజయ్, పవన్, సీబీరావు మరియు కృష్ణమోహన్. మీకు నెనర్లు. వచ్చిన వారందరికీ నా కృతజ్ఞతలు!

Written by వీవెన్

జూన్ 23, 2008 at 6:54 పూర్వాహ్నం

ఫైర్‌ఫాక్స్ లో రాసారు

ఫైర్‌ఫాక్స్ 3 ప్రపంచరికార్డులో మీరు పాల్గొనాలంటే…

with 7 comments

(భారత కాలమానం ప్రకారం) ఈరోజు రాత్రి 10:30 నుండి రేపు రాత్రి 10:30 లోపు ఫైర్‌ఫాక్స్ 3ని దిగుమతి చేసుకోండి.

అప్పటి వరకు ఫైర్‌ఫాక్స్ 3 లోని విశేషాల గురించి తెలుసుకోండి.

మీరు ఇతర దేశాలలో ఉన్నట్లయితే, దిగుమతి చేసుకోవాల్సిన సమయం సుమారుగా 17:00 UTC (మీ నగరంలో ఆ సమయం). ఆ సమయం నుండి 24 గంటలలోపు దిగుమతి చేసుకోవచ్చు.

ఆనంద జాలా జ్వాలనం!

తాజా సమాచారం: మీ ప్రదేశం ప్రకారం ఏ సమయమో చూపే పటం (Digital Inspiration నుండి):

Firefox 3 Download Day Start

Written by వీవెన్

జూన్ 17, 2008 at 12:48 అపరాహ్నం

హైదరాబాదులో ఫైర్‌ఫాక్స్ 3 సంబరాలకు ఆహ్వానం!

with 14 comments

మీ అభిమాన విహారిణి మంటనక్క యొక్క సరికొత్త వెర్షన్ (మంటనక్క ౩) ఈ నెల 17వ తేదీన విడుదలవ్వబోతుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా మొజిల్లా పార్టీలు జరుగుతాయి.  హైదరాబాదులో ఓ పార్టీని నేను (స్నేహితుల సహాయంతో) నిర్వహిస్తున్నాను. హైదరాబాదులోని వారికి ఇదే మా ఆహ్వానం!

ముఖ్యమైన వివరాలు

తేదీ మరియు సమయం: ఆదివారం, జూన్ 22, 2008 సాయంత్రం 4 గంటలనుండి 6 వరకు

వేదిక: కృష్ణకాంత్ ఉద్యానవం, యూసఫ్ గూడ బస్తీ, హైదరాబాద్. (పటం)

ఏం చేస్తాం

  • మంటనక్క 3 మరియు ఇతర స్వేచ్ఛా మృదుపరికరాల సీడీలు ఇస్తాం.
  • మీ మీ అంకోపరులు (ఉంటే) తెస్తే, దానిలో మంటనక్క 3 ని స్థాపిస్తాం
  • మంటనక్క 3 విశేషాలని వివరిస్తాం.

మీ ఉపాయాలు మరియు సూచనలు ఇక్కడ పంచుకోండి. మీరు హైదరాబాదులో ఉంటే తప్పకరండి.

అన్నట్టు, విడుదల రోజునే అత్యధిక దిగుమతులు జరుపుకున్న ప్రపంచ రికార్డు ఉపకరణంగా మంటనక్కని నిలపడం కోసం మొజిల్లా మరియు దాని అభిమానులు సంకల్పించారు. మీరూ పాల్గొంటున్నారా? జూన్ 17న సిద్ధంగా ఉండండి.

తాజాకలం: సంబరాలు విజయవంతంగా జరిగాయి. పార్టీ నివేదికని చదివి విశేషాలు తెలుసుకోండి.

Written by వీవెన్

జూన్ 12, 2008 at 10:10 పూర్వాహ్నం

నేటి లింకు: Help Firefox set a World Record

without comments

Written by వీవెన్

మే 29, 2008 at 12:38 అపరాహ్నం

నేటి లింకు: ఆసం పట్టీ

with 2 comments

మంటనక్క 3 లో చిరునామా పట్టీ మరింత ఆసం (awesome) గా ఉండబోతుంది. (బీటా 4 మహా అయితే ఇంకో రెండు వారాల్లో వస్తుంది)

Written by వీవెన్

మార్చి 4, 2008 at 9:54 పూర్వాహ్నం

[ఫైర్‌ఫాక్స్ ఎందుకు?] పేజీలో వెతకడం సులువు

with 8 comments

నేను ఫైర్‌ఫాక్స్‌నే నా ప్రధాన వెబ్ విహరిణిగా ఎంచుకోవడానికి ఒక కారణం: ‘పేజీలో పాఠ్యాన్ని వెతకడానికి పనికొచ్చే సౌలభ్యాలు’. ఇవి మన పనిని సులభతరం మరియు వేగవంతం చేస్తాయి. ఈ మెళకువలు తెలుసుకోండి మరి.
ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »

Written by వీవెన్

ఆగష్టు 22, 2007 at 5:45 అపరాహ్నం

IE7.com

with one comment

Written by వీవెన్

జులై 24, 2007 at 4:11 పూర్వాహ్నం

ఫైర్‌ఫాక్స్ లో రాసారు

Tagged with

ఫైర్‌ఫాక్స్‌లో విహరణ చరిత్ర సైడుపట్టీని వాడుకోవడం

with 2 comments

మీరు కొన్ని రోజుల క్రితం కూడలిలో ఓ టపా చూసారు. లేదా మరే సైటులోనో మరో సమాచారం చూసారు. చదివారు, ఆనందించారు, మర్చిపోయారు. బావుంది. కానీ, ఈ రోజు ఆ టపా మళ్ళీ కావలిసి వచ్చింది. అయితే మీరు ఆ టపాని పేజీక (bookmark) గా భద్రపరచుకోలేదు. కూడలిలో నుండి ఈసరికే వెళ్ళిపోయింది. ఆ వేరే వెబ్ సైటేదో మీకు గుర్తులేదు. ఇప్పుడు దాన్ని పట్టుకోవడం ఎలా? గూగుల్ బాబాయిని ఆశ్రయించేముందు, వెబ్ విహరిణుల (web browsers) లో ఉండే చరిత్రని ఓసారి చూడడం ఉత్తమం.

మీ విహరణ చరిత్ర (browsing history) ని మీరు వాడే వెబ్ విహరిణి గుర్తుపెట్టుకుంటుంది. మీరు చూసిన సైటు మీ విహరణ చరిత్రలో ఉండేఉంటుంది. ఈ విహరణ చరిత్రని ఫైర్‌ఫాక్స్‌లో ఎలా వాడుకోవచ్చో చూద్దాం.
ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »

Written by వీవెన్

జూన్ 27, 2007 at 4:51 పూర్వాహ్నం

ఫైర్‌ఫాక్స్‌౩ లో తెలుగు సరిగ్గా రాబోతుంది!

with 14 comments

ఫైర్‌ఫాక్స్‌ ప్రియులకు శుభవార్త: ఫైర్‌ఫాక్స్‌౩ లో తెలుగు సరిగ్గా రాబోతుంది! ఫైర్‌ఫాక్స్‌౩ లో అమలు చేస్తున్న కొత్త టెక్స్టుఫ్రేమ్ వల్ల ఈ బగ్గు ఫిక్సయ్యింది. అయితే మనకేంటి? మనకేంటంటే, తెలుగు ఇక ఫైర్‌ఫాక్స్‌ ౩ నుండి చక్కగా కనిపిస్తుంది. తెలుగొక్కటేకాదు, ఇతర భారతీయ భాషలుకూడా చక్కగా కనిపిస్తాయి. అవును, XPలో ప్రాంతీయ మరియు భాషా ఎంపికల (Regional and Language Options) లో సంక్లిష్ట లిపులకొరకు ప్రత్యేక తోడ్పాటుని వ్యవస్థాపితం చేయపోయినా సరే ఫైర్‌ఫాక్స్‌౩ నుండి తెలుగు తెలుగులా కనిపిస్తుంది. ఇకనుండి నా Unjustify! అవసరముండదు. మీకోసం కొన్ని తెరచాపలు (screenshots): ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »

Written by వీవెన్

జూన్ 24, 2007 at 8:29 పూర్వాహ్నం