Archive for the ‘తెలుగు బ్లాగులు’ Category
మీ బ్లాగుకి వచ్చే అన్వేషణల్లో తెలుగు కీలకపదాల శాతం ఎంత?
ఇటీవల గూగుల్ ట్రెండ్స్‌లో ‘telugu’ మరియు ‘తెలుగు’ ల అన్వేషణల ధోరణి చూసాను. (క్రింది చార్టు చూడండి.) ఇక్కడ మనం చెప్పుకోబోతున్నది తెలుగు అక్షరాలలో అన్వేషణ గురించి. గత సంవత్సర కాలంగా చెప్పుకోదగ్గ (అంటే గూగుల్ వాడు గుర్తించి ట్రెండ్స్‌లో చేర్చదగినన్ని) అన్వేషణలు జరుగుతున్నాయన్న మాట. 2009 ఏప్రిల్ తర్వాత ఎర్రగీత కొంచెం పైకి చూస్తుంది కదూ. లేక నాకే అలా అనిపిస్తుందేమో
. తెలుగు అక్షరాలలో ప్రస్తుతం వెతకగలుగుతునప్పటికీ, వెతుకుతున్నవారు తక్కువేనేమో.
తెలుగు బ్లాగుల్లో స్థానిక వాణి: ఓ మంచి ధోరణి
గమనిక: ఈ టపా నా డ్రాఫ్టులలో సంవత్సరం పైనుండే ఉంది. దీన్ని పూర్తిచేయలేక ఇలానే ప్రచురించేస్తున్నాను. ఈ జాబితా పాక్షికం!
ఈ మధ్య తెలుగు బ్లాగుల్లో స్థానికాంశాల గురించి అక్కడి సమస్యల గురించి రాయడం పెరుగుతూంది. ఇదో మంచి పరిణామం. నాకు తటస్థించిన అటువంటి కొన్ని బ్లాగులు:
- కరీంనగర్ బ్లాగర్ల ప్రపంచం
- పోలేపల్లి (జడ్చర్ల) సెజ్ దుర్మార్గం
- గుండె చప్పుడు బ్లాగులో తరచూ స్థానికాంశాల గురించి టపాలు వస్తుంటాయి.
- గిద్దలూరు
- అ-భాగ్యనగరమ్ (మూగబోయింది. సమస్యలన్నీ తీరిపోయాయా? )
- ఆంధ్ర ప్రగతి (ఆగిపోయినట్టేనా?)
బ్లాగోగులు
గమనిక: చాలా రాద్దామనుకునే దీన్ని మొదలు పెట్టాను. కానీ దీనిపై సమయం వెచ్చించలేకపోతున్నాను. మొదలు పెట్టిన ఈ టపాని ఇలాగే ప్రచురించేస్తున్నాను. కానీ నేనిచ్చిన లింకులు మంచి సమాచారాన్ని అందిస్తాయి.

- శోధన సుధాకర్ తెలుగీకరించిన బ్లాగర్ల ప్రవర్తనా నియమావళిని చూడండి.
- బ్లాగుల్లో స్పందనలపై రానారె క్షణికమ్
- Core Rules of Netiquette
- New Game, Old Rules
- కొత్తపాళీ బాగా చెప్పారు:
బ్లాగడం మనందరికీ ఒక గొప్ప శక్తినిస్తోంది. ఒక వేదికనీ ఆ వేదిక మీద మాట్లాడేందుకు గొంతునీ ఇస్తోంది. ఆ శక్తి సామాన్యమైనది కాదు. గొంతులు నొక్కి వెయ్యబడే ఉక్కు పిడికిళ్ళ రాజ్యాల్లో సమయం గడిపి వచ్చిన వారిని అడగండి ఇది ఎంత అపురూపమైన శక్తో! దాన్ని సద్వినియోగం చేసుకుందాం. చర్చ ముఖ్యం .. ఆలోచనలు పంచుకోవడం ముఖ్యం. విభిన్నమైన ఆలోచనలు బయటికి రావడం, నిర్భయంగా స్వేఛ్ఛగా వ్యక్తీకరించ బడటం ముఖ్యం. ఆలోచనల్తో విభేదించడం తప్పు కాదు. అవసరమైతే విమర్శించడం కూడా మంచిదే. కానీ మన మాటలు ఒకరిని కించ పరచరాదు. జుగుప్సా కరమైన భాషా, వ్యక్తీగతమైన దాడులూ, అశ్లీలపు రాతలూ ఎవరికీ ఉపయోగం కావు. పూని ఏదైన ఒక్క మేల్ కూర్చి జనులకు చూపవోయ్ అన్న మహాకవి బోధని మనసులో పెట్టుకుందాం. ఏదన్నా పనికొచ్చే పని చేద్దాం.
ఆనంద బ్లాగాయనం!
డిసెంబర్ రెండవ ఆదివారం — తెలుగు బ్లాగుల దినోత్సవం!
అంటే, ఈ సంవత్సరం ఈ నెల 14వ తేదీన. మీ ఊళ్ళో/నగరంలో/పట్టణంలో ఆ రోజు తెలుగు బ్లాగరుల సమావేశాన్ని నిర్వహించండి. మీరు హైదరాబాదులో ఉంటున్నట్లయితే, మాతో కలవండి.
ఏమేంచెయ్యొచ్చు:
- అందరూ కలిసి ఏదైనా సామాజిక ప్రయోజనమున్న పని చేయవచ్చు.
- బ్లాగింగులోని సాంకేతిక లేదా ఇతర సమస్యలని ఇతరులని అడిగి ఎలా పరిష్కరించుకోవాలో తెలుసుకోవచ్చు.
- అందరూ కలిసి కాసేపు సరదాగా కబుర్లు చెప్పుకోవచ్చు.
- లేదా, జాలంలో తెలుగుకై మరింత గంభీరమైన పనులూ చెయ్యవచ్చు:
- ఇప్పుడు కంప్యూటర్లలో తెలుగు చూడవచ్చు, టైపు చెయ్యవచ్చు అని మీ ప్రాతంలోని ప్రజలకి తెలియజేయండి.
- తెలుగు వికీపీడియాలో మీ ఊరి గురించిన సమాచారం చేర్చండి.
- ఏదైనా కంప్యూటర్ ఉపకరణాన్ని తెలుగులోకి అనువదించండి.
- వందల్లో ఉన్న తెలుగు బ్లాగరులని వేలల్లోకి, వేలల్లో ఉన్న బ్లాగుల సందర్శకులని లక్షల్లోకి పెంచడమెలాగో ఆలోచించండి.
ఎలా:
- మీ ప్రాంతంలో ఉంటున్న బ్లాగరులెవరో తెలుసుకోండి. లేదా మీ ఊళ్ళో సమావేశం నిర్వహిద్దామనుకుంటున్నట్టు, తెలుగు బ్లాగు గుంపులోనూ, మీ బ్లాగులోనూ ప్రకటించండి. స్థలం మరియు సమయం నిర్ణయించి తెలియజేయండి.
- మిమ్మల్ని సంప్రదించగలిగే సమాచారం (ఫోను నంబరు, ఈ-మెయిలు చిరునామా, గట్రా) తెలియజేయండి.
- ఆ రోజు అనుకున్న స్థలంలో అనుకున్న సమయానికి అందుబాటులో ఉండండి.
- సమావేశం తర్వాత సమావేశం ఎలా జరిగిందీ వివరాలతో మీ బ్లాగులో టపా వ్రాయండి.
డిసెంబర్ రెండవ ఆదివారమే ఎందుకు:
- 2007 డిసెంబరు నెల 13వ తేదీన తెలుగు బ్లాగు గుంపులో సభ్యుల సంఖ్య 1,000కి చేరుకుంది. ఆ రోజు ఆదివారం కాకపోయినా, ఆదివారాలు అయితే జనాలకి ఖాళీ ఉంటుందని.
- ప్రతీ నెలా రెండవ ఆదివారం తెలుగు బ్లాగుల సమావేశం ఉంటుంది. మళ్ళీ బ్లాగుల దినోత్సవం కోసం ప్రత్యేక సమావేశం అవసరం లేకుండా, అదే రోజునైతే బాగుంటుందని.
పైన నేనుదహరించిన బొమ్మను మీ బ్లాగుల్లో వాడుకోవచ్చు.
తా.క.: హైదరాబాదు సమావేశపు నివేదికని e-తెలుగు సైటులో ప్రచురించాం.
ఆనంద బ్లాగాయనం!
కూడలి దృక్పథం
ఈ టపాకి నేపధ్యం ఈపాటికి మీకు తెలిసే ఉండాలి. ఒకవేళ తెలియకపోయినా, కూడలి గురించిన ప్రాముఖ్య విషయాలను ఈ టపాలో ప్రస్తావిస్తున్నాను. కూడలి గురించి ఆసక్తి ఉంటే ఈ టపా మీకు ఉపయోగపడుతుంది.
అత్యుత్తమ తెలుగు బ్లాగులు (రెండవ దఫా)
మీకు నచ్చిన, మీరు మెచ్చిన పది తెలుగు బ్లాగులు ఏవి అని క్రితం సారి నేను అడిగి సంవత్సరం గడిచింది. (కూడలి 100కి ఆ జాబితాలే మూలం.) అప్పుడు చాలా మంది తమకు నచ్చిన బ్లాగులను ఎన్నుకున్నారు. మరోసారి ఆలాంటి అంతర్మధనానికి సిద్ధంకండి.
ఈ సంవత్సర కాలంలో చాలా కొత్త బ్లాగులు వచ్చాయి, పాతవి కొన్ని మూగబోయాయి, మరి కొన్ని మూతబడ్డాయి.
ఇప్పుడు తాజాగా మీరు మెచ్చే మరియు తప్పక చదివే పది (పది మరీ తక్కువనిపిస్తే ఇరవై, ముప్పై, లేదా మీకు నచ్చినన్నే ఇష్టమొచ్చినన్ని) బ్లాగులేవి?
నియమాలు ఇవీ:
- మీ స్వంత బ్లాగు(ల)ని మీ జాబితాలో చేర్చకండి. మీ బ్లాగుకి అంత సీనుంటే ఇతరులు చేరుస్తారు కదా.
- ఆ బ్లాగు తప్పక అత్యధిక శాతం చదువరులకు నచ్చుతుందని, బ్లాగేతరులకు తెలుగు బ్లాగులపై సదభిప్రాయం కలిగిస్తుందని మీరు అనుకుంటున్నారు.
- ఆ బ్లాగునుండి క్రమం తప్పకుండా టపాలు రాలుతుంటాయి. (ఎంత తరచూ అనేదికూడా మీ ఎంపికే.)
మీ జాబితాని ఇక్కడ వ్యాఖ్యగా గానీ లేదా మీ బ్లాగులో టపాగాగానీ ప్రచురించండి.
ఈ బ్లాగ్మధనం వల్ల ప్రయోజనాలివీ:
- కూడలి 100 జాబితా తాజా అవుతుంది.
- మీరు ఆయా బ్లాగులు ఎందుకు మీకు నచ్చుతున్నాయో చెప్తే, మిగతా వారు మరింత మెరుగ్గా బ్లాగులు రాయడానికి ప్రయత్నిస్తారు.
- మీరు ఇప్పటివరకూ తెలియని బ్లాగులను తెలుసుకునే అవకాశం లభిస్తుంది.
మీ జాబితాలు ప్రచురించండి మరి.
(తా.క.: దీన్ని మరో అంచె ముందుకు తీసుకెళ్ళి, మీకు నచ్చని బ్లాగులేవో కూడా రాయొచ్చు. ఎందుకు నచ్చట్లేదో నిర్మాణాత్మకంగా రాస్తే, తెలుగు బ్లాగ్లోకానికి చాలా ప్రయోజనం.)
మీ తెలుగు బ్లాగు/సైటు ఇక్కడ ఉందా?
మీ తెలుగు బ్లాగు లేదా వెబ్ సైటు ఈ క్రింది సైట్లలో ఉందా?
మీ తెలుగు బ్లాగు లేదా సైటు కొత్తవారిని చేరుకోవడానికి ఇవి ఓ మార్గం.
కొత్త కూడలి విడుదలయ్యింది!
కొన్ని నెలలుగా పరీక్షాస్థితిలో ఉన్న కొత్త కూడలిని ఈ పూట (ఆదివారం సాయంత్రం) విడుదల చేసా.
గమనించాల్సిన మార్పులివీ:
- మొదటి పేజీలో అన్ని టపాలకు బదులు వీటిని చూపిస్తున్నా:
కూడలి 100అన్ని బ్లాగుల నుండి, వెబ్‌పత్రికల నుండి, మరియు తెలుగు జర్నల్ నుండి 15 కొత్త టపాల శీర్షికలు, ఫొటో బ్లాగుల నుండి ఓ యాదృచ్ఛిక ఫొటో (మీరు ఫొటో బ్లాగు మొదలుపెట్టడానికి మరో కారణం). మీకు పాత కూడలిలో వలె అన్ని టపాలు కావాలంటే, బ్లాగుల పేజీ చూడండి. - వ్యాఖ్యలు ఆయా సంబంధిత పేజీలలో కుడివైపు వస్తాయి. కానీ మీరు కావాలని అడిగితే వ్యాఖ్యల పేజీ కూడా ఉంది.
- విభాగాలు: మీకు అంతగా సమయం లేకపోతే, టపాలన్నింటినీ చదవకుండా మీకు ఆసక్తి ఉన్న విభాగాలనుండి టపాలను మాత్రమే చదువుకోవచ్చు. ప్రస్తుతం ఈ విభాగాలున్నాయి:
- అన్వేషణ: నావిగేషన్ బద్దీలో ఉన్న అన్వేషణ పెట్టె నుండి వెతకడంద్వారా కూడలిలో వచ్చే అన్ని తెలుగు బ్లాగులనుండి గూగుల్ ఫలితాలను పొందవచ్చు. (ఉదా: మీగడ, సూరేకారం)
- సేకరణలు మరియు ఇంగ్లీషు పేజీలలో కూడా విభాగాలు. ఇకనుండి మీకు నచ్చినవే చదవండి.
- ఫీడులకు మార్పులు: మీలో చాలా మంది కూడలిని ఫీడుల ద్వారా చదువుతూ ఉండవచ్చు. బ్లాగుల ఫీడుని తాజాకరించుకోండి. మీరేమీ మార్చుకోకపోయినా పర్లేదు. కానీ తాజాకరించుకోవడం ఉత్తమం. బ్లాగుల విభజన వల్ల మీకు ఆసక్తి ఉన్న విభాగాలనే చేర్చుకునే సౌలభ్యం కూడా ఉంది.
- మీ బ్లాగు లేదా వెబ్ సైటు నుండి కూడలికి లంకె వెయ్యడానికి మీకు కావలసిన సమాచారమందించే ప్రచార పేజీ.
- మంచి 404 పొరపాటు పేజీ
మరి మీకు నచ్చిందా? సూచనలు, సలహాలు, విమర్శలు తెలియజేయండి మరి.
వర్గాలు, టాగులు, లేబుళ్ళు
పెరుగుతున్న బ్లాగులన్నింటినీ చదవేందుకు మనకి సమయం చిక్కదు. ప్రస్తుతం మనం చదివే టపాలు మొత్తం టపాల్లో 80 శాతం వరకు ఉంటే, భవిష్యత్తులో మనం చదవనివే 95% ఉంటాయి. మనకి నచ్చిన లేదా ఆసక్తి ఉన్న టపాలని ఎంచుకోడానికి టాగులు ప్రధాన మార్గంగా మారుతాయి. కనుక మీ టపాలకి టాగులు తగిలించండి.
మీరు ఏ బ్లాగుడు సేవని వినియోగిస్తున్నా దానిలో టపాలను వర్గీకరించుకునే (టాగులు లేదా లేబుళ్లు తగిలించే) సదుపాయం తప్పకుండా ఉంటుంది. ఈ టాగులు ఎందుకు, వాటి వల్ల ప్రయోజనాలు, టాగులు ఇవ్వడంలో ఇబ్బందులు, వీటిని మరింత ఉపయోగకరంగా మలచుకోవడం లాంటి విషయాలను ఈ టపాలో చర్చిస్తున్నాను. మీ అభిప్రాయాలను, ఆలోచనలను కూడా ఆహ్వానిస్తున్నాను.
మరో బ్లాగు తుఫాను సూచన?
- ఆంధ్రాకి ఏమౌతాడీ వ్యక్తి ?
- తెలుగువాడి సొమ్ముతో కట్టిన ప్రతీదానికి తెలుగువాడి పేరే పెట్టాలి
- ఆంద్రప్రదేశ్ …రాజీవ్ ప్రదేశ్….ఇందిరా ప్రదేశ్
- ఈ రోజు ఓ ఆంధ్ర రాజీవ జీవి దిన చర్య
- [పాత బంగారం] వార్తల్లో విప్లవం – ఇందిరమ్మ టీవీ
ఈ రోజు మా సహోద్యోగుల మధ్య చర్చలో వచ్చిన కొన్ని పేర్లు:
- ఇందిరాబాద్
- రాహుల్‌గూడ
- ప్రియాంక నగర్
- రాజీవ్ పేట
రాజకీయం మరి! రాజ్యాంగబద్దంగా జనానికి కీడుచేసే యంత్రాంగం
