వీవెనుడి టెక్కునిక్కులు

స్వేచ్ఛా సాఫ్ట్‌వేర్, బహిరంగ జాలం, తెలుగు, ఇతరత్రా…

Archive for the ‘వికీపీడియా’ Category

వికీపీడియా వార్షిక నిధుల సేకరణోత్సవం

leave a comment »

ప్రతీ సంవత్సరాంతంలో వికీపీడియా నిధుల సేకరణోత్సవం జరుగుతుంది. ఈ ఏటి నిధుల సేకరణ ఉత్సవం పోయిన వారం మొదలయ్యంది. తరచూ వికీపీడియాని సందర్శించేవారు విరాళాలకై విజ్ఞప్తిని చూసేవుంటారు. అయితే, ఈసారి ఈ ప్రయత్నానికి ఒక ప్రత్యేకత ఉంది: నిధుల సేకరణకి ఉద్దేశించిన ప్రచార సందేశాలు తెలుగులో కూడా ఉన్నాయి.

ఉదాహరణకి, మీరు తెలుగు వికీపీడియాని సందర్శిస్తే, వికీపీడియా స్థాపకులు జిమ్మీవేల్స్ సందేశాన్ని చదవమన్న విజ్ఞప్తి కనిపిస్తుంది. తెరపట్టు:
తెలుగు వికీపీడియాలో మీడియావికీ నిధుల సేకరణ ప్రచార పతాకం

(మీకు ఇతర భాషల వికీపీడియాలలో ఖాతా ఉంటే, మీ భాషగా తెలుగుని ఎంచుకుంటే ఆయా వికీపీడియాలలో కూడా మీరు ఈ సందేశాన్ని తెలుగులో చూడవచ్చు.)

ఆ పతాకంపై నొక్కితే ఆయన సందేశం దానితోపాటు విరాళమిచ్చే ఫారం కూడా తెలుగులో లభ్యం:
వికీమీడియా నిధుల సేకరణకై జిమ్మీ వేల్స్ విజ్ఞప్తి యొక్క తెలుగు అనువాదం

ప్రపంచంలోని జ్ఞానాన్నంతటినీ ఒకేచోట చేర్చి వికీపీడియా మనకి ఎంతగానో తోడ్పతుతుంది. దాన్ని నిలుపుకునేందుకు (ఎల్లకాలం స్వేచ్ఛగా, ఉచితంగా, వ్యాపార ప్రకటనలు లేకుండా ఉంచేందుకు) వికీపీడియాకి మన వంతు సహాయంగా ఇతోథిక విరాళాలని ఇద్దాం.

వ్రాసినది వీవెన్

నవంబర్ 23, 2010 at 8:47 సా.

వికీపీడియా లో రాసారు

Tagged with

తెలుగు వికీపీడియా అకాడమీ (జాలంలో)

4 వ్యాఖ్యలతో

వికీపీడియా అకాడమీ గురించి ఇటీవలే అర్జున రావు ఓ టపా రాసారు. ఆయన మాటల్లోనే:

వికీపీడియాని చాలా మంది చదవడానికి మాత్రమే వాడుతున్నారు. దానిలో ఎవరైనా సమాచారం చేర్చవచ్చని ఎంతమందికి తెలుసు. తెలిసినా ఎంతమంది చేస్తున్నారు.తెలుగు మరి ఇతర భారతీయ భాషలలో వ్యాసాలు తక్కువగా వుండటానికి చాలా అటంకాలు ఉన్నప్పటికి, వికీపీడియా గురించి, దానిలో సమాచారం ఎలా చేర్చవచ్చో తెలియక పోవడమే పెద్ద ఆటంకం. దానిని తొలగించటానికి ఉద్దేశించిందే వికీపీడియా అకాడమీ.

ఈ విధమైన వికీపీడియా అకాడమీ సెషన్‌ని జాలంలో ఒకదాన్ని నిర్వహించాలని నేను అనుకుంటున్నాను. ఇవీ వివరాలు:

  • వేదిక: chat.etelugu.org
  • సమయం: సెప్టెంబర్ 19, 2009 శనివారం ఉదయం 10:00 నుండి 11:00 వరకు

మీకు తెలుగు వికీపీడియాకి తోడ్పడాలని ఉన్నా లేదా అందులోని సమాచారాన్ని వాడుకోవాలని ఉన్నా (వికీపీడియాని వాడటం, ఉదాహరణకి వ్యాసం రాసేప్పుడు ఫార్మాటింగు గట్రా, తెలియకపోయినా) లేదా వికీకి సంబంధించిన ఇతర విషయాలపై సందేహాలు ఉన్నా ఈ అకాడమీ సెషనుకి రండి. మీ సందేహాలకు సమాధానాలిచ్చేందుకు, తెవికీ నిర్వాహకులు మరియు క్రియాశీల సభ్యులు ఈ సెషనులో పాల్గొంటారు.

కొన్ని ఉపయోగపడే లింకులు:

ఈ సెషనులో పాల్గొని, ప్రేరణ పొంది తెవికీని మెరుగుపరచడానికి ముందుకొస్తారని ఆశిస్తున్నాను. (ఒకవేళ మీరు ఈ సెషనులో పాల్గొనలేక పోతే, మీ సందేహాలను ఇక్కడ వ్యాఖ్యలుగానైనా లేదా తెవికీలో అయినా అడగండి.)

వ్రాసినది వీవెన్

సెప్టెంబర్ 17, 2009 at 9:33 ఉద.

Two Million Articles in English Wikipedia

20 వ్యాఖ్యలతో

English Wikipedia reaches 2 million article mark. It took just 6 months and 9 days for the last one million articles. (English Wikipedia reached a million articles on March 1, 2006.)

As I write this, Wikipedia (in total across all 253 languages) has 8.44 million articles. More than 5 million articles are added just in the last six months. It’s a phenomenal growth!

As for as Indian language Wikipedias, Telugu Wikipedia is leading with more than 36,000 articles.

వ్రాసినది వీవెన్

సెప్టెంబర్ 9, 2007 at 5:19 సా.

వికీపీడియా లో రాసారు

Tagged with

తెవికీలో ౩౦,౦౦౦ వ్యాసాలు

3 వ్యాఖ్యలతో

తెలుగు వికీపీడియా ౩౦,౦౦౦ వ్యాసాలకు చేరుకుంది! తెలుగు వికీపీడియనులందరికీ అభినందనలు! ఇన్ని వ్యాసాలు కలిగిఉన్న మొట్టమొదటి భారతీయ భాషా వికీపీడియా, తెవికీ.

భారతీయ భాషా వికీపీడియాల పూర్తి జాబితా మరియు గణాంకాల కోసం, క్రాస్‌రోడ్స్‌లో ఈ టపా చూడండి.

వ్రాసినది వీవెన్

జూన్ 26, 2007 at 6:29 ఉద.

తెవికీ లో 25 వేల వ్యాసాలు

2 వ్యాఖ్యలతో

tewiki-25000-articles

వ్రాసినది వీవెన్

డిసెంబర్ 12, 2006 at 10:59 ఉద.

వికీపీడియా లో రాసారు

Tagged with ,

తెవికీ ప్రగతి నివేదిక – జూలై 2006

leave a comment »

తెలుగు వికీపీడియా ప్రగతి నివేదిక – జూలై 2006

జూలై 31, 2006 న—

  • వ్యాసాలు: 3,307
  • సభ్యులు: 523

జూలై నెలలో విశేషాలు:

  • కొత్త పేజీలు: 43 (48% వృద్ధి)
  • కొత్త సభ్యులు: 53 (23% వృద్ధి)

ఆగష్టు నెల ప్రాధామ్యాలు:

వ్రాసినది వీవెన్

ఆగస్ట్ 1, 2006 at 7:26 ఉద.

వికీపీడియా లో రాసారు

Tagged with ,

తెవికీ ప్రగతి నివేదిక – జూన్ 2006

ఒక వ్యాఖ్యతో

తెలుగు వికీపీడియా ప్రగతి నివేదిక – జూన్ 2006

జూన్ 30, 2006 న—

  • వ్యాసాలు: 3,338
  • సభ్యులు: 470

జూన్ నెలలో విశేషాలు:

జూలై నెల ప్రాధామ్యాలు:

మీ నిరంతర తోడ్పాటుతోనే ప్రగతి సాధ్యం.

వ్రాసినది వీవెన్

జూలై 1, 2006 at 5:56 ఉద.

వికీపీడియా లో రాసారు

Tagged with ,

అనుసరించు

Get every new post delivered to your Inbox.

మరో 179గురు చందాదార్లతో చేరండి