Archive for the ‘లేఖిని’ Category
ఇన్‌స్క్రిప్ట్+ పూర్తిస్థాయి తెలుగు కీబోర్డు లేయవుటు
ప్రపంచవ్యాప్తంగా ఉన్న లిపులన్నింటినీ కంప్యూటర్లలో ఉపయోగించుకునేందుకు వీలుగా యూనికోడ్ కన్సార్టియమ్ అన్ని అక్షరాలకూ స్థిరమైన సంకేతబిందువులను కేటాయిస్తుంది. వీటిల్లో ప్రస్తుతం వాడుకలో ఉన్న అక్షరాలే కాకుండా, కాలగతిలో కలిసిపోయిన అక్షరాలు కూడా ఉంటాయి. పురాతన గ్రంథాలను సాంఖ్యీకరించడానికి ప్రాచీన అక్షరాల/గుర్తుల అవసరం ఉంటుంది కదా. ఇవన్నీ యూనికోడ్ ప్రమాణంలో ఉన్నంత మాత్రన అంతిమ వాడుకరులకు అందుబాటులో ఉండకపోవచ్చు. ఎందుకంటే, వాటిని టైపు చెయ్యడానికి ఒక పద్ధతో పరికరమో కావాలి కదా!
భారతీయ భాషలకు సంబంధించి యూనికోడ్ 6.0 ప్రమాణంలో ఉన్న అన్ని అక్షరాలను టైపు చెయ్యగలిగే విధంగా, C-DAC వారు గతంలో రూపొందించిన ఇన్‌స్క్రిప్ట్ కీబోర్డు అమరికను మెరుగుపరిచి నిరుడు విస్తృత ఇన్‌స్క్రిప్ట్ కీబోర్డు అమరికను ప్రతిపాదించారు. (ఈ పేజీలో “Enhanced INSCRIPT standard (Proposed)” అన్న లంకె నుండి వారి ప్రతిపాదనను దించుకోవచ్చు.)
ఈ ప్రతిపాదన అధారంగా నేను ఇన్‌స్క్రిప్ట్+ అని తెలుగు కీబోర్డు అమరికను తయారుచేసాను. ఇలా ఉంటుందది:

గణతంత్ర దినోత్సవ కానుక: ఇన్‌స్క్రిప్ట్ లేఖిని
ఇప్పుడు లేఖినిలో ఇన్‌స్క్రిప్టుని టైపు చేసుకోవచ్చు మరియు నేర్చుకోవచ్చు: lekhini.org/inscript
ఇన్‌స్క్రిప్ట్ నేర్చుకునే వారికి ఉపయోగంగా ఉండాలన్న ప్రధాన ఉద్దేశం తోనూ, ఎప్పుడైనా ఇతరుల కంప్యూటర్లో త్వరగా టైపు చెయ్యాల్సి/చేసుకోవాల్సి వచ్చినప్పుడు (ఇన్‌స్క్రిప్ట్ స్థాపించే సమయం తీరికా లేనప్పుడు టైపు చేసుకోడానికి) వీలుగా ఉండాలన్న అనుబంధ ఉద్దేశంతోనూ దీన్ని తయారు చేసాను.
ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »
లేఖిని పనిచేయడం లేదా?
ఈ మధ్య లేఖిని పనిచేయడం లేదన్న పిర్యాదుని తరచూ వింటున్నాను. కానీ నా లినక్స్ కంప్యూటరుపై ఈ సమస్యని నేను చూడలేదు. బహుశా ఇది పాడయిన కోశం వల్ల అయ్యివుండొచ్చు. మీ జాల విహారిణి ఫైర్‌ఫాక్స్ అయితే ఇలా ప్రయత్నించి చూడండి:
- Tools మెనూ నుండి Options… అన్న ఆదేశాన్ని ఎంచుకోండి.
- ఆ తర్వాత వచ్చే కిటికీలో, (క్రింద తెరపట్టులో చూపినట్టు) Advanced అన్న ప్రతీకాన్నీ తర్వాత Network అన్న ట్యాబునీ ఎంచుకోండి.

- Offline Storage విభాగంలో (పై తెరపట్టులో గుర్తించి చూపిన చోట) lekhini.org అని ఉంటే, దాన్ని ఎంచుకుని Remove బొత్తాన్ని నొక్కండి.
- తొలగింపుని నిర్ధారించండి; OK బొత్తాన్ని నొక్కి అమరికల కిటికీని మూసేయండి.
- ఇప్పుడు lekhini.orgకి వెళ్ళి చూడండి.
అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే, నాకు తెలియజేయండి.
మీ మిత్రులెవరైనా ఈ సమస్యని మీతో ప్రస్తావించి ఉంటే, వారికి కూడా ఈ టపాని చూపించండి.
ఆనంద లేఖనం!
ఆఫ్‌లైనులో లేఖినిని వాడుకోవడం ఎలా?
కంప్యూటర్లో తెలుగు టైపు చెయ్యడానికి అనేక పద్ధతుల్లో లేఖిని ఒకటి. ఇప్పటికీ లేఖినికి రోజుకి సగటున 1,250 సందర్శనలు నమోదవుతున్నాయి. లేఖినితో ఉన్న ప్రధాన ఇబ్బందులలో మొదటిది జాల సంధానం అవసరమవడం, రెండోది ఇక్కడ టైపు చేసి మరో చోటకి కాపీ చేసుకోవాల్సి రావడం. అయితే జాల సంధానం అవసరం లేకుండా లేఖినిని వాడుకోవచ్చు. ఇందుకు గల రెండు పద్ధతులను ఈ టపాలో వివరిస్తున్నాను. వీటివల్ల, మీకూ మరియు లేఖినికీ బ్యాండ్‌విడ్త్ వినియోగం తగ్గుతుంది.
ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »
ఆర్కుట్ లేఖిని సమూహంలో 400 సభ్యులు
శీర్షికే మొత్తం చెప్పేస్తుంది. మీరు ఆర్కుట్ సభ్యులైతే, లేఖిని సమూహంలో చేరండి.
ఆర్కుట్ లేఖిని సమూహాన్ని దాదాపు 9 నెలల క్రితం (సెప్టెంబర్ 2006 లో) , చింతు ప్రారంభించాడు. ఆర్కుట్లో తెలుగు క్రమంగా (మెల్లగానైనా) పెరుగుతూంది. చాలా మంది తమ పేరుని తెలుగులో కూడా రాసుకుంటున్నారు. ఆర్కుట్ నుండి లేఖినికి నెలకు దాదాపు 300 హిట్లు వస్తున్నాయి, ప్రత్యేకించి ఈ సమూహాలనుండి:
లేఖినికి 1 సంవత్సరం
క్లుప్తంగా ఓసారి లేఖిని కాలరేఖ:
- 2006-03-15: లేఖిని జననం
- 2006-03-19: కొత్త రూపం, హంగులు
- 2006-07-16: మరిన్నిహంగులు
- 2006-07-20: మరిన్ని మెరుగులు
- 2006-07-28: Lekhini.org
- 2006-08-17: లేఖిని పుట్టుక పెరుగుదల గురించి నా వ్యాసం
- 2006-09-02: ఆర్కుట్లో లేఖినికో సమూహం
- 2006-09-17: నిఖిలే జననం
- 2007-03-02: లేఖిని నుండి గూగుల్ శోధన
లేఖినిని తయారుచేసింది తాత్కాలిక పరిష్కారం కోసమే అయినా కొత్త హంగుల (ఈ-మెయిల్ మరియు ఆటోసేవ్) కోసం మీ డిమాండ్లు దీనిని మెరుగుపరచాలని చెప్తున్నాయి.
నాకంత ప్రోగ్రామింగు నైపుణ్యంలేదు, ఖాళీ సమయంకూడా పరిమితమే. కానీ ఔత్సాహికుల సహాయంతో మెరుగులు దిద్దడానికి నాకేమీ ఇబ్బందిలేదు. లేఖిని వృద్ధికి మీరూ తోడ్పడవచ్చు.
- లాగిన్ వ్యవస్థ (సహాయం కావాలి)
- ఈ-మెయిల్, ఆటోసేవ్ ఓ విధంగా పూర్తయినట్టే. లాగిన్ వ్యవస్థతో వీటిని అనుసంధానించాలి. (సహాయం కావాలి)
లేఖిని నుండి గూగుల్ శోధన
ఇక నేరుగా లేఖిని నుండే గూగుల్ లో వెతకవచ్చు!
మీరు గూగుల్ లో వెతకాలనుకున్నది టైపు చేసాకా G పై నొక్కండి (పైన బొమ్మలో చూడండి). గూగుల్ ఫలితాలతో కొత్త ట్యాబు/విండో ప్రత్యక్షమవుతుంది.


