ఇన్‌స్క్రిప్ట్+ పూర్తిస్థాయి తెలుగు కీబోర్డు లేయవుటు
ప్రపంచవ్యాప్తంగా ఉన్న లిపులన్నింటినీ కంప్యూటర్లలో ఉపయోగించుకునేందుకు వీలుగా యూనికోడ్ కన్సార్టియమ్ అన్ని అక్షరాలకూ స్థిరమైన సంకేతబిందువులను కేటాయిస్తుంది. వీటిల్లో ప్రస్తుతం వాడుకలో ఉన్న అక్షరాలే కాకుండా, కాలగతిలో కలిసిపోయిన అక్షరాలు కూడా ఉంటాయి. పురాతన గ్రంథాలను సాంఖ్యీకరించడానికి ప్రాచీన అక్షరాల/గుర్తుల అవసరం ఉంటుంది కదా. ఇవన్నీ యూనికోడ్ ప్రమాణంలో ఉన్నంత మాత్రన అంతిమ వాడుకరులకు అందుబాటులో ఉండకపోవచ్చు. ఎందుకంటే, వాటిని టైపు చెయ్యడానికి ఒక పద్ధతో పరికరమో కావాలి కదా!
భారతీయ భాషలకు సంబంధించి యూనికోడ్ 6.0 ప్రమాణంలో ఉన్న అన్ని అక్షరాలను టైపు చెయ్యగలిగే విధంగా, C-DAC వారు గతంలో రూపొందించిన ఇన్‌స్క్రిప్ట్ కీబోర్డు అమరికను మెరుగుపరిచి నిరుడు విస్తృత ఇన్‌స్క్రిప్ట్ కీబోర్డు అమరికను ప్రతిపాదించారు. (ఈ పేజీలో “Enhanced INSCRIPT standard (Proposed)” అన్న లంకె నుండి వారి ప్రతిపాదనను దించుకోవచ్చు.)
ఈ ప్రతిపాదన అధారంగా నేను ఇన్‌స్క్రిప్ట్+ అని తెలుగు కీబోర్డు అమరికను తయారుచేసాను. ఇలా ఉంటుందది:

ఒకే మీట మీద ఉన్న పలు అక్షరాలు ఉన్నాయి కదా. వాటిని టైపు చెయ్యాంటే… Shift, AltGr వంటి మీటలతో కలిపి టైపుచెయ్యవచ్చు. ఇలా:

ఉదాహరణ:
రూపాయి (₹) గుర్తునీ, ఌ గుణింతాన్నీ (కౢప్తం), సంస్కృతం కోసం దేవనాగరి శైలి కామా (।), ఫుల్‌స్టాప్ (॥) లనూ (డా॥ రాజశేఖర్), ఉచ్చారణను సూచించే ఉదాత్త (అ॒) అనుదాత్త (ఇ॑), సంధిచిహ్నంగా వాడే అవగ్రహం (ఇతోఽధికం, మనో౾వేదన) వంటి వాటన్నింటినీ టైపు చెయ్యవచ్చు.
మీ కంప్యూటర్లో ఉన్న తెలుగు ఖతిలో పై అన్ని అక్షరాలూ లేకపోవచ్చు. (లోహిత్ ఖతిని స్థాపించుకోమని నా సలహా.) నా కంప్యూటర్లో ఇలా కనిపిస్తుంది.

వీటితో బాటుగా ప్రాచీన భిన్నాంక చిహ్నాలనూ టైపుచెయ్యవచ్చు. (లంకెను సూచించినందుతు షణ్ముఖన్ గారికి నెనర్లు.)
ఊఁ, ఇదంతా బానే ఉంది. కానీ… ఈ కీబోర్డు లేయవుటుని పొందడమెలా?
విండోస్ XP/విస్టా/7
- సెటప్ దస్త్రాన్ని దించుకోండి.
- ఈ ఫైలు నుండి దస్తాలను వెలికి తీసి
te-insrఅన్న సంచయం లోనిsetup.exeఅన్న ఫైలుని నడపండి. (ఈ కీబోర్డు లేయవుటు మీ కంప్యూటరులో స్థాపితమవుతుంది.) - ఆ తర్వాత ఇంగ్లీషు, తెలుగుల మధ్య మారడానికి Left Alt+Shift అన్న మీటద్వయాన్ని ఉపయోగించండి.
జాలంలో
మీ కంప్యూటర్లో ఏమీ స్థాపించుకోనవసరం లేకుండానే జాలంలో లేఖిని ఇన్‌స్క్రిప్ట్ ద్వారా దీన్ని ఉపయోగించవచ్చు. మీకు గుర్తుండి ఉంటే… సరిగ్గా సంవత్సరం క్రితం లేఖిని ఇన్‌స్క్రిప్ట్ విడుదలయ్యింది! అప్పుడు చెప్పిన లోపాలన్నింటినీ ఇప్పుడు పరిష్కరించాను.
లినక్స్
iBus కొరకు
- ibus-m17n అన్న ఉపకరణాన్ని (ఇప్పటికే లేకుంటే) స్థాపించుకోండి.
te-inscriptplus.mimఅన్న దస్త్రాన్ని దించుకోండి.- దాన్ని
/usr/share/m17nసంచయం లోనికి కాపీ చెయ్యండి. - ఆ తర్వాత, iBusని పునఃప్రారంభించండి.
- iBus అభిరుచులలో నుండి Telugu InScript+ (m17n) అన్న పద్ధతిని ఎంచుకోండి.
- సంపూర్ణ తెలుగు టంకనాన్ని ఆనందించండి!
XKB కొరకు
పరిష్కారం దొరికింది. క్రింది సూచనలను పాఠించండి.te-inscriptplus దస్త్రాన్ని తెచ్చుకోండి. దీన్ని setxkbmap అన్న ఆదేశం ద్వారా నడుపుకోవచ్చు. ఈ దస్త్రాన్ని /usr/share/X11/xkb/symbols సంచయంలో ఉంచి rules/base.xml దస్త్రంలో తగిన మార్పులు చేస్తే, గ్నోమ్ కీబోర్డు ప్యానల్లో కనిపించాలి. కానీ ప్రస్తుతం దీన్ని గ్నోమ్ గుర్తించడం లేదు. తగిన పరిష్కారం దొరకగానే తెలియజేస్తాను, వేచివుండండి.
- te-inscriptplus దస్త్రాన్ని దించుకోండి.
- (రూటు లేదా సూడో ద్వారా) ఆ దస్త్రాన్ని
/usr/share/X11/xkb/symbolsసంచయం లోనికి కాపీ చేసుకోండి. - (రూటు లేదా సూడో ద్వారా)
/usr/share/X11/xkb/rules/evdev.xmlఅనే దస్త్రంలో ఈ క్రింది కోడుని “</layoutList>”అనే పంక్తి పైన కాపీచేయండి:<layout> <configItem> <name>te-inscriptplus</name> <shortDescription>te</shortDescription> <description>Telugu (InScript+)</description> <languageList> <iso639Id>tel</iso639Id> </languageList> </configItem> <variant> <configItem> <name>basic</name> <description>Telugu (InScript+)</description> <languageList> <iso639Id>tel</iso639Id> </languageList> </configItem> </variant> </layout> - ఆ తర్వాత xserverని పునఃప్రారంభించండి (లేదా ఒకసారి లాగ్-అవుట్ అయ్యి మళ్ళీ ప్రవేశించండి).
ఇన్‌స్క్రిప్ట్+ లేయవుటుని ఉపయోగించి చూడండి. సమస్యలను, లోపాలనూ నాకు తెలియజేయండి.
సంపూర్ణ తెలుగు టైపింగు కావాలనుకునే మీ బంధుమిత్రులకు దీని గురించి తెలియజేయండి.
ఆనంద తెలుగు టంకనం!


ఈ Inscript key board layout చాలా అసహజంగా ఉంది.
ఉదాహరణకు ‘బ’ అనే అక్షరానికి keyboard పైన ఉన్న ‘Y’ అనే key ని కేటాయించారు. నాకైతే యేమీ నచ్చలేదు.
ఇది మీరు చేసిన మార్పు కాకపోవచ్చు.
మీరు ఇచ్చే IME లో customized keyboard layout కు అవకాశం ఉంటే బాగుంటుందని నా సూచన.
తాడిగడప శ్యామలరావు
జనవరి 26, 2012 at 10:32 అపరాహ్నం
ఇంగ్లీషు కీబోర్డుని అనుసరించి మీరు తెలుగు కీబోర్డుని అసహజమని ఎలా నిర్ణయిస్తారు? ;)
వీవెన్
జనవరి 27, 2012 at 6:43 పూర్వాహ్నం
మీ రన్నది చాలా నిజం. కాకపోతే కంప్యూటరు వాడే వాళ్ళలో అధికశాతం మంది ఈ ఇంగ్లీషు కీబోర్డుకు అలవాటుపడి ఉంటారు. కాబట్టి అందుచేత బకారాని వేలు ‘B’ దగ్గరకు పోవటం సహజం. వేరే కోబోర్డు అమరిక ఫోనోటిక్ గా మరీ తేడాగా ఉంటే అలవాటు పడటం కష్టం అవుతుందన్న ఉద్దేశంతో అలా అన్నాను. మరేమీ లేదు.
తాడిగడప శ్యామలరావు
జనవరి 27, 2012 at 12:54 అపరాహ్నం
మైక్రోసాఫ్ట్ కీబోర్డు లేయవుట్ క్రియేటర్ను ఉపయోగించి మీకు నచ్చినట్టుగా IME లేయవుట్లను తయారుచేసుకోవచ్చు. ప్రయత్నించి చూడండి.
వీవెన్
జనవరి 27, 2012 at 6:46 పూర్వాహ్నం
అలాగా! చాలా సంతోషం అండీ. నేను యీ మైక్రోసాఫ్ట్ కీబోర్డు లేయవుట్ క్రియేటర్ను తప్పక ప్రయత్నిస్తాను. బహుధా కృతజ్ఞుడను.
తాడిగడప శ్యామలరావు
జనవరి 27, 2012 at 12:50 అపరాహ్నం
Reblogged this on Gpvprasad's Blog.
gpvprasad
జనవరి 27, 2012 at 6:29 పూర్వాహ్నం
నమస్కారం వీవెన్ గారూ,
నేను Ubuntu 11.10 వాడుతున్నాను. మీరు చెప్పినట్లు ౧.లోహిత్ ౨.iBus inscript+ ని సంస్థాపించాను.
iBus-> Preferences->general-> custom font లో లోహిత్ తెలుగు ని ఎంచుకున్నాను కూడా.
Right_Alt+Shit+F మీటలను కలిపి నొక్కితే, ఫైర్ఫాక్స్ లో Menu వస్తోంది, కానీ మీరు పొందుపరచిన కొత్త అక్షరాలు రావటం లేదు.
వేరే ఏవైనా మార్పులు చేయాలా?
షణ్ముఖన్
జనవరి 28, 2012 at 9:52 పూర్వాహ్నం
iBus నడుస్తుందా? iBus input methodని Telugu (InScript+)కి మార్చిన తర్వాత తతిమా తెలుగు అక్షరాలు వస్తున్నాయా?
పై రెండు ప్రశ్నలకూ జవాబు అవును అయితే, మీ ఉబుంటూలో AltGr లేదా 3వ స్థాయి మీట ఏమిటో చూడండి. మీ ఉబుంటులో Keyboard Layout Optionsకి వెళ్ళండి. అందులో Key to choose 3rd levelగా ఏ మీట ఉందో చూడండి. (ఉబుంటులో ఇక్కడకు వెళ్ళడమెలాగో ఖచ్చితంగా నాకు తెలియదు. బహుశా System > Preferences > Keyboard > Layouts > Options లేదా ప్యానల్లో కీబోర్డు లేయవుట్ ఇండికేటర్ పైన right-click చేసి అక్కడ వచ్చే Settings. లేదా System > Hardware > Keyboard > Layouts > Options కూడా కావచ్చు.)
ఆవిధంగా మూడో స్థాయి మీటను (Right_Alt లేదా అక్కడ ఉన్న మీటలలో దేనినైనా) ఎంచుకుని, దాన్ని వాడుకోవచ్చు.
వీవెన్
జనవరి 28, 2012 at 10:46 పూర్వాహ్నం
చాలా thanks అండీ, ౩వ స్థాయి మీటని right alt కి మార్చిన తర్వాత అన్నీ పని చేస్తున్నాయండీ…
కానీ, alt_g+shift+f మీటలను కలిపి వుపయోగిస్తే మీరు చెప్పినట్లు ‘ఓం’ రావటం లేదండీ, ఒకసారి చూడగలరు.
షణ్ముఖన్
జనవరి 28, 2012 at 11:38 పూర్వాహ్నం
ఓంకారం (ॐ) ఉన్నది x మీట పైన కదండీ!
ఈ ॐ, ఉదాత్తోనుదాత్తాలూ (d, e మీటల మీదున్నవి) ibus దానిలో లేవు. ఇప్పుడు చేర్చాను. పైన చెప్పిన mim దస్త్రాన్ని కొత్తగా తెచ్చుకోండి.
వీవెన్
జనవరి 28, 2012 at 12:08 అపరాహ్నం
ఇప్పుడు అన్నీ వస్తున్నాయండీ…
౧. “ఉచ్చారణను సూచించే ఉదాత్త (అ॒) అనుదాత్త (ఇ॑), సంధిచిహ్నంగా వాడే అవగ్రహం (ఇతోఽధికం, మనో౾వేదన) వంటి వాటన్నింటినీ టైపు చెయ్యవచ్చు.”
పై వాటి గురించి నాకు తెలియదండీ, వాటిని గూర్చి కాస్త చెప్తారా(ఏదైనా లంకె వున్నా ఇవ్వండి)?
౨. భిన్నాంకాల గురించి: http://www.eemaata.com/em/issues/200607/898.html
౩. ఒక హల్లు అచ్చుతో పూర్తయినప్పుడు దాని పక్కన మళ్ళీ గుణింతాలు రావటం అనవసరం కదండీ…
అంటే కోో –> కో పూర్తయిన తర్వాత పొరపాటున ో (గుణింతం) వచ్చినా అది టైపు అవ్వకుండా చెయ్యటం కుదురుతుందా?
Dne
షణ్ముఖన్
జనవరి 28, 2012 at 12:52 అపరాహ్నం
1. అవగ్రహాల గురించి ఈ లంకెలో చూడండి. ఇక ఉదాత్త అనుదాత్తాలను సంస్కృత శ్లోకాలను వ్రాసేప్పుడు స్వరాల హెచ్చుతగ్గులను సూచించడానికి వాడతారని వారూవీరూ చెప్పగా విన్నదే. ఈ వికీపీడియా వ్యాసాన్ని చూడండి. వీటిని వాడిన తెలుగు పాఠ్యపు చిత్రం.
2. లంకెకు నెనర్లండీ. టపాలో ప్రస్తావించాను.
3. కుదరదండీ. ఇది మొద్దు కీబోర్డు లేయవుటు. ఏ మీటకి ఏ అక్షరం—దీనికి అంతే తెలుసు. తెలివి లేనిదిది.
వీవెన్
జనవరి 28, 2012 at 3:51 అపరాహ్నం
[...] For more details about those characters, please see this post in my Telugu blog. [...]
InScript+ an enhanced InScript keyboard layout for Telugu | Crossroads
జనవరి 28, 2012 at 4:18 అపరాహ్నం
Reblogged this on జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ and commented:
మీ కృషికి అభినందనలు. కృతజ్ఞతలు కూడా.
విశేఖర్
జనవరి 28, 2012 at 7:00 అపరాహ్నం
వీవెన్ గారూ ఇలాంటిది ఏదైనా android కి ఉంటే బావుంటుంది. ఆండ్రోయిడ్ లో ఇప్పటి దాకా తెలుగు చదవటం కుదరదు. :-(
lohith fonts వాడి ఓ hack ఉంది కానీ వొత్తులు ఏమీ పనిచేయవు. something to do with glyphs support in Android.
దాని మీద ఎవరికైనా ఏమైనా తెలుసా?
Ravi Kiran
ఫిబ్రవరి 7, 2012 at 4:05 అపరాహ్నం
రవి కిరణ్ గారూ, మొబైళ్ళలో తెలుగు టైపు చెయ్యడానికి పద్ధతులు ఉన్నాయి, చూడండి.
వీవెన్
ఫిబ్రవరి 7, 2012 at 4:14 అపరాహ్నం