Archive for అక్టోబర్ 9th, 2011
మొదటి అంతర్జాతీయ తెలుగు అంతర్జాల సమావేశం — ప్రారంభ సదస్సు నివేదిక
పోయిన నెలాఖరులో సిలికాన్ వ్యాలీలో జరిగిన మొట్టమొదటి అంతర్జాతీయ తెలుగు అంతర్జాల సమావేశానికి నేను హాజరయ్యాను. ఆ సమావేశపు ప్రారంభ సదస్సు యొక్క నివేదిక ఇది. నివేదికకు వెళ్ళేముందు రెండు ప్రశ్నలకు సమాధానాలు:
- అమెరికాలో ఎందుకు? సిలికాన్ వ్యాలీ సమాచార సాంకేతిక రంగానికి ప్రధాన కేంద్రం. సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేస్తున్న తెలుగువారు అధిక సంఖ్యలో ఉన్నదీ ఇక్కడే. తెలుగు కోసం లేదా తెలుగు వారి కోసం వీరు చేసింది తక్కువే. వీరి దృష్టిని ఆకర్షించడం అన్నది ఈ సామావేశాన్ని అక్కడ నిర్వహించడానికి ప్రధాన కారణం. ఇక్కడి వదాన్యుల నుండి వివిధ చేపట్లకు నిధుల/విరాళాల సేకరణ మరో కారణం.
- ‘తెలుగు అంతర్జాల’ అన్న పేరెందుకు? తెలుగు సంగణన గురించి అన్ని విషయాలనూ స్పృషించే ఈ సమావేశానికి పరిమితార్థాన్నిచ్చే అంతర్జాల సమావేశం అన్న పేరు ఎందుకు అన్న సందేహాన్ని కొందరు వ్యక్తం చేసారు. ఇదీ ఆలోచన: ఇప్పుడంతా జాలమే. అన్ని రకాల ఉపకరణాలూ (క్లిష్టమైన ఫొటో ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైనింగులతో సహా) జాల సేవలుగా మారిపోతున్నాయి. వివిధ సేవల భారీతనాన్ని సూచిండానికి ఇప్పుడు ఆంగ్లంలో web-scale అని వ్యవహరిస్తున్నారు. ఎలాగూ పూర్తిస్థాయిలో తెలుగు సంగణన సిద్ధమయితేనే జాలంలో తెలుగు సంపూర్ణమవుతుంది. కనుక అంతర్జాలం అన్నది విస్త్రుతార్థకమే.
ఇక ప్రారంభ సదస్సు నివేదిక.
ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »

