మీ టపాలు కూడలిలో పిచ్చి అక్షరాలుగా వస్తున్నాయా?
కూడలిలో అలా పిచ్చి అక్షరాలు వస్తున్నాయి అంటే మీ బ్లాగు యొక్క ఫీడులో ఏదో సమస్య ఉంది అని అర్థం. మీ టపాలోని అక్షరాలని కూడలి అర్థం చేసుకోలేక పోతుంది.
ఇలా ఎందుకు జరుగుతుందంటే, మీ బ్లాగులోని వర్గాల పేర్లు పెద్దగా ఉన్నప్పుడు లేదా టపా సంగ్రహం చూపించడానికి వర్డ్‌ప్రెస్ వాటిని కత్తిరిస్తుంది. ఈ ప్రక్రియలో ఓ పిచ్చి అక్షరం అక్కడ చేరుతుంది. ఆ అక్షరం వల్ల కూడలి మొత్తం ఫీడుని తప్పుగా అర్థం చేసుకుంటుంది.
ఇలా పిచ్చి అక్షరాలు వచ్చినప్పుడు ఆయా బ్లాగుల ఫీడులని ఫీడ్ వాలిడేటర్లో పరీక్షిస్తే, ఈ తప్పిదాలు కనబడ్డాయి:
వీటిని ఎలా సరిదిద్దాలి: వీటిలో మీ తప్పిదం లేకపోయినా మీరు సరిదిద్దవచ్చు. ఆయా వర్గాలని లేదా తప్పులు సూచించిన పదాలని తిరిగి టైపు చేసి టపాని భద్రపరచండి.
ఇది పునరావృతం కాకుండా జాగ్రత్తలు: మీ బ్లాగులోని వర్గాలు మరియు టాగుల పేర్లు చిన్నవిగా (ఒకటి లేదా రెండు పదాలు) పెట్టండి.














Nice catch!
వ్యాఖ్య ద్వారా chavakiran — ఫిబ్రవరి 10, 2008 @ 10:30 am
వీవెన్ గారూ,
ఫీడు వాలిడేటరుని ఎలా చేరుకోవాలో చెప్పగలరా.
నెనరులు
మాలతి
వ్యాఖ్య ద్వారా tethulika — ఫిబ్రవరి 10, 2008 @ 5:57 pm
వీవెన్,
టాగులో అక్షరాలు ఎక్కువై చివర్లో ఆ పిచ్చి అక్షరం జతచేరింది. టాగు కత్తిరిచ్చా. ఇప్పుడు సరి అవుతుందనుకుంటా. ధన్యవాదాలు.
వ్యాఖ్య ద్వారా వికటకవి — ఫిబ్రవరి 10, 2008 @ 7:17 pm
@మాలతీ
ఫీడు వాలిడేటరు లింకు పైన ఇచ్చాను కదా? (పైన పదాన్ని మీరు నొక్కవచ్చు.) అయినా మరోసారి ఆ సైటు చిరునామా: http://feedvalidator.org/
వ్యాఖ్య ద్వారా వీవెన్ — ఫిబ్రవరి 10, 2008 @ 9:18 pm
ఓ అదా. నేను నాబ్లాగులో వుంటుందనుకున్నానండీ. మీ ఓపికకి నెనరులు.
వ్యాఖ్య ద్వారా tethulika — ఫిబ్రవరి 10, 2008 @ 10:33 pm
RSS ఫీడు అంటే ఏమిటి?నా బ్లాగు RSS ఫీడుని నేనెలా తెలుసుకోగలను?మొన్నేదో సైటులో నా బ్లాగుని చేరుస్తుంటే RSS ఫీడుని అడిగింది.ఏమి చెయ్యాలో తెలియక నా సైటు URL నే ఇచ్చేసాను.
వ్యాఖ్య ద్వారా radhika — ఫిబ్రవరి 11, 2008 @ 10:01 pm
వీవెన్ గారూ,
మీసలహాప్రకారం చూసి ఫీడుబాధలు కనుక్కోగలిగాను. ముఖ్యంగా నేను పీడీయఫ్ లో పెట్టడంవల్ల జరుగుతున్న దోషాలు. వర్గాలూ, గట్రా చూపించకుండా చేస్తే తగువు తీరిపోయింది.
మాలతి
వ్యాఖ్య ద్వారా tethulika — ఫిబ్రవరి 11, 2008 @ 11:56 pm
రాధిక గారు, ఆరెసెస్ అంటే ఏమిటో ఈ టపా చదవండి.
క్లుప్తంగా చెప్పాలంటే మీ బ్లాగు గురించి ఇతరులకు చెప్పే సాధనమనుకోండి.
ఉదా: మీ బ్లాగుకి ఆరెసెస్ ఫీడు ఈ కింది లంకె
http://snehama.blogspot.com/feeds/posts/default
వ్యాఖ్య ద్వారా ప్రవీణ్ గార్లపాటి — ఫిబ్రవరి 12, 2008 @ 12:11 am