మీకు నచ్చిన తెలుగు టైపింగ్ విధానానికి వోటు వేసారా? ఇప్పుడే వెయ్యండి మరి.
ఫిబ్రవరి 27, 2008
ఫిబ్రవరి 13, 2008
ఫిబ్రవరి 10, 2008
మీ టపాలు కూడలిలో పిచ్చి అక్షరాలుగా వస్తున్నాయా?
కూడలిలో అలా పిచ్చి అక్షరాలు వస్తున్నాయి అంటే మీ బ్లాగు యొక్క ఫీడులో ఏదో సమస్య ఉంది అని అర్థం. మీ టపాలోని అక్షరాలని కూడలి అర్థం చేసుకోలేక పోతుంది.
ఇలా ఎందుకు జరుగుతుందంటే, మీ బ్లాగులోని వర్గాల పేర్లు పెద్దగా ఉన్నప్పుడు లేదా టపా సంగ్రహం చూపించడానికి వర్డ్‌ప్రెస్ వాటిని కత్తిరిస్తుంది. ఈ ప్రక్రియలో ఓ పిచ్చి అక్షరం అక్కడ చేరుతుంది. ఆ అక్షరం వల్ల కూడలి మొత్తం ఫీడుని తప్పుగా అర్థం చేసుకుంటుంది.
ఇలా పిచ్చి అక్షరాలు వచ్చినప్పుడు ఆయా బ్లాగుల ఫీడులని ఫీడ్ వాలిడేటర్లో పరీక్షిస్తే, ఈ తప్పిదాలు కనబడ్డాయి:
వీటిని ఎలా సరిదిద్దాలి: వీటిలో మీ తప్పిదం లేకపోయినా మీరు సరిదిద్దవచ్చు. ఆయా వర్గాలని లేదా తప్పులు సూచించిన పదాలని తిరిగి టైపు చేసి టపాని భద్రపరచండి.
ఇది పునరావృతం కాకుండా జాగ్రత్తలు: మీ బ్లాగులోని వర్గాలు మరియు టాగుల పేర్లు చిన్నవిగా (ఒకటి లేదా రెండు పదాలు) పెట్టండి.
ఫిబ్రవరి 3, 2008
ఉప్పెన
ఈనాడులో వెబ్లో తెలుగు గురించి రావడంతో వికీపీడియా, కూడలి, లేఖిని మరియు ఇతర సైట్లకు జనాలు పోటెత్తారు.
మీ ఆనందం కోసం కొన్ని చార్టులు:
కూడలి: ఓ రోజులో వెయ్యి మంది ప్రత్యేక (unique) సందర్శకులు కూడలికి రావడం ఇదే మొదలు (600 మంది ఇదివరకటి ఆధిక్యం)

నా బ్లాగు గణాంకాలు: 353ఇప్పటివరకు. (309ఇదివరకటి ఆధిక్యం. అప్పుడూ ఈనాడు ప్రభావమే)
ఫిబ్రవరి 1, 2008
మీ తెలుగు బ్లాగు/సైటు ఇక్కడ ఉందా?
మీ తెలుగు బ్లాగు లేదా వెబ్ సైటు ఈ క్రింది సైట్లలో ఉందా?
మీ తెలుగు బ్లాగు లేదా సైటు కొత్తవారిని చేరుకోవడానికి ఇవి ఓ మార్గం.
ఒకే అచ్చు గుణింతంతో పదాలు
తెలుగులో చాలా పదాలు ఒకే అచ్చుతో వస్తాయి. నాకు తట్టినవి ఇక్కడ. అసలు తలకట్టు తప్ప వేరే అచ్చులేని పదాలు (ఉదా. పలక) కాకుండా:
- ఆ
- కాకా (కాకా హోటల్ అంటాం కదా)
- కాజా
- కామా
- టాటా
- బాకా
- బాజా
- బాబా
- లావా
- ఇ
- గిరి
- చిలిపి
- తిమ్మిరి
- నిడివి
- పిడికిలి
- పిప్ఫి
- మిసిమి
- లిపి
- విరివి
- సిరి
- ఈ
- టీవీ
- ఉ
- ఉడుకు
- ఉరుము(లు)
- కుక్కు (సంచిలో కుక్కడం)
- కుదుపు(లు)
- కుదురు
- కులుకు(లు)
- గుద్దు(లు)
- గుబులు
- తుడుపు
- దుద్దు(లు)
- దున్ను
- పులుపు
- బుద్ధుడు
- ముక్కు(లు)
- ముగ్గు(లు)
- ముగ్గురు
- ముడుపు(లు)
- ముదురు
- ముద్దు(లు)
- మురుగు
- ములుకు
- ముసురు
- రుద్దు
- సుద్దులు
- ఏ
- వేరే
ఇంకేమైనా?













