వీవెనుడి టెక్కునిక్కులు

డిసెంబరు 25, 2007

ఎలా: ఆపిల్ కీబోర్డు అమరికతో యూనికోడ్ టైపు చెయ్యడం

ప్రచురించిన వర్గము Telugu, చిట్కాలు, తెలుగు, ప్రయోగాలు, సాంకేతికం — Tags: , , , , — వీవెన్ @ 8:16 pm

తెలుగు టైపు చెయ్యడానికి ఉన్న కీబోర్డు అమరికలలో మాడ్యులర్, ఇన్‌స్క్రిప్టుల తర్వాత ఆపిల్ అమరికదే అగ్రస్థానం (RTSని పట్టించుకోకపోతే).

ఇప్పుడు ఆపిల్ కీబోర్డు అమరికతో కూడా యూనికోడ్ తెలుగుని టైపు చెయ్యవచ్చు. పూర్తి వివరాలు చూడండి.

డిసెంబరు 9, 2007

నెట్‌వైబ్స్‌లో కూడలి

ప్రచురించిన వర్గము koodali, కూడలి, సాంకేతికం — Tags: — వీవెన్ @ 10:01 am

నెట్‌వైబ్స్ వాడేవారికి శుభవార్త! కూడలికి ఇప్పుడు నెట్‌వైబ్స్ సైటులో ఓ టాబు ఉంది. ఈ కూడలి టాబు నుండి పూర్తి టాబుని గానీ అందులోని విడి ఫీడులను గానీ మీ నెట్‌వైబ్స్ పేజీకి చేర్చుకోవచ్చు.

డిసెంబరు 5, 2007

వర్డ్‌ప్రెస్.కామ్ ఇప్పుడు తెలుగులో

ప్రచురించిన వర్గము తెలుగు, సాంకేతికం — Tags: , , — వీవెన్ @ 3:36 am

వర్డ్‌ప్రెస్.కామ్ ఇప్పుడు తెలుగులో కూడా లభ్యమవుతుంది. మీ బ్లాగు ఎంపికలలో భాషను తెలుగుగా ఎంచుకుని ఉంటే, మీ బ్లాగును తెలుగులో చూడవచ్చు. మీ బ్లాగు నిర్వహణ గట్రా అంతా ఇక తెలుగులోనే.

అయితే, ఈ అనువాదాలలో కొన్ని దోషాలున్నాయి. మరికొన్ని అందరికీ అర్ధం కాకపోవచ్చు. మరికొన్ని ఇంకా అనువాదం చెయ్యాల్సినవి ఉన్నాయి.

వర్డ్‌ప్రెస్ తెలుగు స్థానికీకరణను మెరుగుపరచడానికి మీ వంతు తోడ్పాటునందించండి.

మీకు తెలుగు పదాలు కొత్తగా ఉండి ఉంటే, దయచేసి ఆందోళన చెంది ఆవేశపడకండి. Don’t panic! మెల్లగా అలవాటవుతాయి.

WordPress.com లో Blog పెట్టుము.