కొత్త తెలుగు ఫాంటు: ఇండోలిపి వారి e-Telugu
ఇండోలిపి (INDOLIPI) అనేది భారతీయవేత్తలకు (Indologists) మరియు భాషావేత్తలకు ఉద్దేశించిన బహుళ ప్రయోజనకారక పరికరాల సముదాయం. దీనిలో చాలా భారతీయ భాషల ఫాంటులతో బాటు ఇతర ఉపయుక్త మృదులాంత్ర పరికరాలు కూడా ఉన్నాయి. (పూర్తి వివరాలు వారి సైటులో చదవండి.)
వారి వద్ద ఓ తెలుగు ఫాంటు కూడా ఉంది. దాని నమూనా ఇదిగో:

ఈ తెలుగు ఫాంటు మరియు ఇతర భారతీయ భాషలు ఫాంటులని ఇక్కడ నుండి (పేజీలో అడుగున లింకులు ఉన్నాయి) దిగుమతి చేసుకోవచ్చు.
స్థాపించుకోవడమిలా:
- జిప్ ఫైలులోని అంశాలను వెలికి తీయండి.
- అందులోని fonts ఫోల్డరులో e-Telugu OT అన్న ఫాంటుని కాపీ చేయండి (Ctrl + C).
- Run ఆదేశంలో (Windows key + R) ‘fonts’ అని టైపు చేసి, ఆ వచ్చిన విండోలో అతికించండి (Ctrl + V).
ఈరోజు ఈ ఫాంటును ఇన్‌స్టాల్ చేయగానే, నా మంటనక్క దీనిని వాడడం మొదలు పెట్టింది. పర్వాలేదు, వాడేకొద్ది బాగానే ఉన్నట్టనిపిస్తుంది, తెరపట్టులో ఉన్నంత చండాలంగా ఏమి అనిపించడంలేదు.
-రమణ.
వెంకట రమణ
అక్టోబర్ 4, 2007 at 1:58 అపరాహ్నం
పెద్ద సైజుల్లో అంత బాలేదు.
వీవెన్
అక్టోబర్ 4, 2007 at 3:22 అపరాహ్నం
hello, sir
bloglo, online lo dabbu sampadinchadam ela?
telugulo theliya cheyagalara.. pl.
naani
అక్టోబర్ 13, 2007 at 1:30 అపరాహ్నం
Mashtaroo, tamari deggara telugu sitla listlu unnaya? Istaaroo?
telugulo ela wrasedi ikkada? Ekkada kanipiyatledu?
Venkateswar Rao
అక్టోబర్ 27, 2007 at 8:23 పూర్వాహ్నం
Venkateswar Rao,
For Telugu sites list see: dir.jalleda.com
You can write in Telugu using lekhini.org
వీవెన్
అక్టోబర్ 28, 2007 at 12:28 అపరాహ్నం
mee site bagundi telugu satakalu emaina download chesukune veelunda inka paramanandayya sishula
kathalu laantive
muneswararao lakka
జనవరి 11, 2008 at 4:34 అపరాహ్నం
@muneswararao
తెలుగు శతకాలకై, వికీసోర్సులో శతకాల వర్గం చూడండి. పరమానందయ్య శిష్యుల కథలు లాంటివి ఎక్కడ దొరుకుతాయో నాకు తెలియదు. సాహిత్యం గుంపులో అడిగి చూడండి.
వీవెన్
జనవరి 17, 2008 at 10:03 పూర్వాహ్నం