వీవెనుడి టెక్కునిక్కులు

వెబ్, కంప్యూటర్లు, తెలుగు, ఇతరత్రా…

యాహూ మెయిల్‌లో తెలుగు!

with 22 comments

యాహూ! మెయిల్ వాడుకరులకు మీరేదైనా తెలుగు వేగు పంపినప్పుడు, వారికి తెలుగు సరిగా కనబడకపోవచ్చు.

నా జీమెయిల్ ఖాతా అమరికలలో ‘బయటకు వెళ్ళే సందేశపు సంకేతలిపి’ని ‘యూనికోడ్’గా అమర్చా. ఆ తర్వాత నేను పంపిన సందేశం యాహూ! మెయిల్‌లో చక్కగా తెలుగులో కనబడింది.

క్రింద ఇచ్చిన తెరపట్టులు చూడండి.

1. జీమెయిల్‌లో అమర్పు: Settings > General

Character Encoding Setting in Gmail

2. యాహూ! మెయిల్‌కు ఆ తర్వాత పంపిన సందేశం:

Yahoo! Mail showing Telugu mail correctly

తాజాకరణ: మీ విహారిణిలో భాషని మరియు అక్షరాల ఎన్‌కోడింగులని సరిగ్గా అమర్చుకోవడం కూడా చాలా వరకు సహాయపడుతుంది.

Written by వీవెన్

సెప్టెంబరు 16, 2007 వద్ద 3:44 పూర్వాహ్నం

22 స్పందనలు

Subscribe to comments with RSS.

  1. అమరికలు అలా మార్చిన తర్వాత కూడా నేను పంపిన వేగులు కొంతమంది సరిగ్గా చూడలేకపోయిన సందర్భ్హాలున్నాయి..

    Giri

    సెప్టెంబరు 16, 2007 at 9:00 పూర్వాహ్నం

  2. అవునండీ.., ఈ అమరికలతో దాదాపు సంవత్సరం న్నర గా తెలుగులో సందేశాలు పంపుతున్నా…,
    మా అమ్మాయి మొదటి పుట్టిన రోజు ఆహ్వానాలు పంపటానికి అప్పట్లో తెగ శోధించి పట్టేశా…:-)
    అన్నట్లు ఈమధ్య నేను పంపిన సందేశాలు చూసి కొందరు తెలుగు పత్రికా సంపాదకులు తెలుగులో ఎలా సందేశాలు పంపాలని ఆడిగారు, కొంత వరకు వారి సందేహాలను తీర్చి నప్పటికి, Outlook / Outlook Express లలో ఏమైనా ఇబ్బందులున్నయ్యేమో నని చూ డాలని పిస్తోంది, వచ్చే వారానికల్లా ప్రయత్నించి చూస్తా…:-)

    –రాజ మల్లేశ్వర్ కొల్లి
    టోక్యో, జపాను.

    రాజ మల్లేశ్వర్ కొల్లి

    సెప్టెంబరు 16, 2007 at 9:11 పూర్వాహ్నం

  3. అమరికలు చెప్పినందుకు ధన్యవాదములు వీవెన్ గారు…. కానీ ఈ తెలుగు మెయిల్స్ పైన తెరచాపలో చూపినట్లుగా క్రొత్త యాహూలో మాత్రమే కనబడుతోంది…పాతదానిలో కనబడుటలేదు…

    http://www.hydbachelors.worpress.com లో తెరచాపలు గమనించగలరు…

    నంద

    సెప్టెంబరు 16, 2007 at 9:12 పూర్వాహ్నం

  4. ఇది పాత యాహూ మెయిల్ లో పనిచేస్తుందా..
    కొత్త యాహూలో ఇలా చెయ్యకున్నా పనిచేస్తుందిగా ఎప్పటినుండో …

    రాకేశ్వర

    సెప్టెంబరు 16, 2007 at 9:42 పూర్వాహ్నం

  5. రాకేశ్వర, కొత్త యాహూలో ఇంతకుముందు పనిచేస్తుందో లేదో తెలియదు.

    పాత యాహూలో (విహరిణిలో) View > Character Encodingని UTF-8కి మారిస్తే పనిచేయవచ్చు.

    వీవెన్

    సెప్టెంబరు 16, 2007 at 11:39 పూర్వాహ్నం

  6. కొత్త యాహూలో సెట్టింగులేవీ మార్చకుండానే తెలుగు రాయడం చదవడం చక్కగా సాగుతున్నది.

    కొత్తపాళీ

    సెప్టెంబరు 16, 2007 at 12:45 అపరాహ్నం

  7. ఏదేమైనా “తెఱపట్టు” (screen-capture)ప్రయోగం బావుంది.

    T. L. Bala Subrahmanyam

    సెప్టెంబరు 17, 2007 at 4:58 పూర్వాహ్నం

  8. మీ సూచన ద్వారా ఒక సమస్య తీరింది. ధన్యవాదాలు !

    samanvayabharathi

    జనవరి 19, 2008 at 4:34 అపరాహ్నం

  9. amantunnadi e gali

    dd

    జనవరి 22, 2008 at 12:31 అపరాహ్నం

  10. hi i m venkat

    venkat

    ఫిబ్రవరి 29, 2008 at 2:09 అపరాహ్నం

  11. అరమరికలు లేని అమరికలు ! నెనర్లు.

    పానకంలో పుడకలాంటి సందేహంతో వస్తున్నందుకు ఏమీ అనుకోకండి. మీరు వేగుపంపడానికి వాడిన ఖతి పోతన-2000 కదూ ! నేను కావ్యనందనం సాలెగూటి నుంచి దాన్ని దిగుమతి చేసుకున్నాను. కాని దాన్ని నా కలనయంత్రంలో ఎలా స్థాపించుకొవాలో అర్థంకాలేదు. దయచేసి కొంచెం చెప్పగలరా ?

    T.L.Bala Subrahmanyam

    ఫిబ్రవరి 29, 2008 at 6:21 అపరాహ్నం

  12. @T.L.Bala Subrahmanyam

    కావ్యనందనం నుంచి తెచ్చుకున్న zip ఫైలు నుండి, Pothana2000.ttf అన్న పైలుని వెలికితీయండి.
    దాన్ని కాపీ చేయండి. (Ctrl + C)
    విండోసులోని ఖతుల ఫోల్డర్ లోనికి వెళ్ళండి. (Run command, then type fonts)
    అక్కడ అతికించండి. (Ctrl + V)

    వీవెన్

    ఫిబ్రవరి 29, 2008 at 6:33 అపరాహ్నం

  13. వీవెన్ గారూ ! నెనర్లు.

    మీరు చెప్పినట్లే చేశాను. దురదృష్టవశాత్తు లాభం లేకపోయింది. స్థాపితమైతే అయింది కాని టైపు చెయ్యడానికి పనికిరావట్లేదు. MS-Word, Adobe PageMaker ల ఖతుల జాబితాలో కనిపిస్తోంది. వాటిని ఎంచుకుని టైపు చేస్తే అర్థం లేని గుండ్రాలు పడుతున్నాయి తప్ప తెలుగు అక్షరాలు మాత్రం పడట్లేదు. ఎందుచేత ? ఇంకొంత సవివరంగా తెలియజెప్పగలరని ప్రార్థన.

    (మఱొక సందేహం. MS-Word, PageMaker సంగతలా ఉంచి వేగుపంపేటప్పుడూ బ్లాగులో టపాలు చేసేటప్పుడూ పోతన-2000 ని ఎలా టైపు చెయ్యాలో కూడా చెప్పగలరు)

  14. “పోతన” ఇంత పితలాటకం కావడానికి కారణం ఏమిటి ? నేను శ్రీలిపితో గాని, అను తో గాని ఇలా అవస్థపడలేదు.

  15. hi

    prasad

    మార్చి 3, 2008 at 3:41 అపరాహ్నం

  16. @T.L.Bala Subrahmanyam

    మీకు ఈ-మెయిల్ పంపించా.

    వీవెన్

    మార్చి 10, 2008 at 7:00 అపరాహ్నం

  17. lekhini is usefull web for the telugu people iam very proud of this web because it is established by telugu people only.

    indian

    నవంబరు 14, 2008 at 11:52 పూర్వాహ్నం

  18. your site very good

    shyam prasad

    మే 6, 2009 at 3:54 అపరాహ్నం

  19. NAAKU SCREEN NI MEELAGE ELA CAPTURE CHEYALO TELUPAGALARU….


ప్రత్యుత్తరమిమ్ము