వీవెనుడి టెక్కునిక్కులు

వెబ్, కంప్యూటర్లు, తెలుగు, ఇతరత్రా…

ఏది సరి:’ళ్ళ’ లేదా ‘ళ్ల’?

with 18 comments

నేను చిన్నప్పటినుండీ నేర్చుకున్నది ‘ళ్ళ’ అనే. ఉదాహరణకు ఇళ్ళు, పెళ్ళి, వెళ్ళు, మొదలైనవి. కానీ చాలాచోట్ల ‘ళ్ల’ వాడుతుండడం చూస్తున్నాం. ఇళ్లు, పెళ్లి, వెళ్లు, అని.

బ్రౌణ్యంలో కూడా ఇళ్లు, పెళ్లి అనే వాడారు.

ఈ రెండు రకాల వాడుకలూ సరైనవేనా? ఒకటే సరైనదైతే, ఏది? ఎందుకు?

మీరేమంటారు?

(ఈ చర్చ ఇంతకుముందెప్పుడో తెలుగుబ్లాగు సమావేశాల్లో వచ్చినట్టు లీలగా గుర్తుంది, కానీ వివరాలు గుర్తులేవు.)

Written by వీవెన్

జులై 29, 2007 వద్ద 3:31 అపరాహ్నం

18 స్పందనలు

Subscribe to comments with RSS.

  1. ళ కు ళ వత్తు ఇవ్వడం సరి అయినదని నాఅభిప్రాయం. ఉదాహరణకు పెళ్ళి,వెళ్ళు,కళ్ళు మొదలైనవి.దీనికి వివరంతెలిసిన పండితులేమటారో మరి.

    t.sujatha

    జులై 29, 2007 at 4:36 అపరాహ్నం

  2. “ళ్ళ” సరి అయినది అని భావన. కాలగమనంలో కొందరు కష్టతరమైన “ళ”ని వదలి “ల” మీద మొగ్గు చూపుతున్నారు. అలా పుట్టుకొచ్చినవే మనం చూస్తున్న ఇళ్లు,కళ్లు వగైరా

  3. “ళ” కి “ల” వత్తు ఇవ్వాలనీ, “ణ” కు “న” వత్తు ఇవ్వాలనేది నాకు తెలిసిన విషయం.

    Dil

    జులై 30, 2007 at 2:51 పూర్వాహ్నం

  4. నేను “ళ్ళ” అనే నేర్చుకున్నాను. జనాలు “ళ్ల” అని అంటూంటే..”నిర్ఘాంతపోవడం” తప్ప ఏమీ చెయ్యలేకపోతున్నా. ఇంతకూ Evolution సంగతి పక్కనపెడితే “ళ్ళ” సరైనదని ఒప్పుకున్నట్టేనా?

  5. కళ్లు, కళ్ళు, పెళ్లి, పెళ్లి లాంటి పదాలలోని ళ్ల, ళ్ళ ఉచ్చారణలో ఆపిపట్టి పలికితే తప్ప తేడాగా పలకలేం. నేనెప్పుడూ ళ్ల వాడతాను. చాలా పుస్తకాలలో ఇలాగే ఉండటం గమనించాను. ళ్ళ తప్పు అని నా అభిప్రాయం కాదు.

  6. ఏదీ సరైనదో నాకు తెలియదు. నాకు ళ్ల అని రాయటం అలవాటు. సినీలోకం గారన్నట్టు కాలగమనంలో పుట్టుకొస్తే వందేళ్ల నాటిదైన బ్రౌణ్యంలో ళ్ళ ఉండాలి కదా!! ఒకవేళ బ్రౌణ్యం రాసేనాటికే మార్పు జరిగిందనుకుంటే, ఈ మార్పు అప్పటికే ప్రామాణికమయ్యుంటేనే గానీ ళ్లి బ్రౌణ్యంలో స్థానం సంపాదించే అవకాశముండి ఉండదు.
    1910వ దశకములో నిఘటువును రాసిన శంకరనారాయణ అలాంటి పదమొచ్చిన ప్రతిసారి ండ్లు, ండ్లి అని తప్పించుకున్నాడేంటి చెప్మా

  7. ఈ సందేహం నాకూ ఉంది. నేను ళ్ళ రాస్తూ ఉంటాను. ఏది సరైనదో తెలియదు గానీ, బహువచన పదాలు (కళ్ళు, కాళ్ళు వగైరా), ఏకవచన పదాల (పెళ్ళి, మళ్ళీ వగైరా) విషయంలో వేరువేరుగా రాయలేమో అని నేననుకుంటాను.

  8. టెక్కునిక్కుల బ్లాగులో కూడా ఈ “జస్టిఫైడ్ ఇబ్బంది” ఉందేం చెప్మా?

  9. నేనెప్పుడూ “ళ్ళ” వాడతాను. “ళ్ల” వుందనే గమనించలేదే!

    –ప్రసాద్
    http://blog.charasala.com

  10. ళ కు ళ వత్తు ఇవ్వడమే సరైనది.సినిమా,టీ,వీ వాళ్ళ తెలుగు standard గా తీసుకోకూడదు

  11. నేనూ ళ కి ళ వత్తే వాడతాను…
    కానీ అక్కడక్కడా ళ కి ల వత్తు వాడటం చూసాను.

  12. శంకరనారాయణగారి పద్ధతే బాగుంది. పెండ్లి, ఇండ్లు, కండ్లు ఇవే మావైపు పల్లెల్లోనూ పట్నాల్లోనూ వాడుకలో ఉన్నవి. నేను చిన్నప్పుడు విన్నదీ నేర్చుకున్నదీ ఇవే. కానీ పల్లెదాటి కాస్త పక్కకొచ్చాక ళ్లి, ళ్లు వినబడసాగాయి. డ్ల అనేది వ్యవగారంలో ళ్ల గా మారి ఉండవచ్చు.

  13. “ళ్ళ” నే కరెక్టని నా అభిప్రాయం. ఎందుకంటే,

    “ళ్ల” అనే అక్షరాన్ని స్పష్టంగా పలకటం అసంభవం. అదే “ళ్ళ” ని పలకచ్చు. ‘Dil’ గారు అన్నట్టు, “ళ” కింద “ల” వత్తు, “ణ” కింద “న” వత్తు పెట్టాలి అనే కొండగుర్తు మాత్రం కచ్చితంగా తప్పే! వ్రాతలో కొండగుర్తులు పెట్టుకోవడం దయచేసి మర్చిపోతారని మనవి.

    “ణ” కింద కూడా “న” వత్తు బూతే అని గమనించాలి.

    smadpr

    ఆగష్టు 1, 2007 at 7:21 పూర్వాహ్నం

  14. బహుశా “ళ” కి “ల” వత్తు, వగైరా గబగబా రాయడం కోసం మొదలుపెట్టి దానికి అలవాటు పడిపోయి ఉంటారు జనాలు.

    కంప్యూటర్ కీబోర్డ్ లాంటి సాధనాల్లో రెంటికీ ఒకింత సమయమే పడుతుంది కాబట్టి ఇక ఈ అలవాటు మరుతుంది అని ఆశిస్తున్నా.

    smadpr

    ఆగష్టు 1, 2007 at 7:24 పూర్వాహ్నం

  15. ళ కి ళ వొత్తె సరి అయినది.. చిన్నప్పుదు నేను నేర్చుకొన్నది కూడ మళ్ళీ .. వెళ్ళి…. లాంతి పదాలే కాని మళ్లీ .. వెళ్ళీ.. పెళ్లీ లాంటివి కాదు… నాకు తెలిసి ల వొత్తు కాదు ళ వొథు సరీయినది ఇది చదివిన తరువాత నేను ఒకసారి పెద్ద బాల శిక్ష పరిశీలిస్తే అనిపించింది… ళ కి ళ వొత్తె సరి అయినది అని.. ఇప్పటి తెలుగులో ఇలాంటివి చాల కనిపిస్తాయీ…

    rama

    ఆగష్టు 1, 2007 at 9:55 పూర్వాహ్నం

  16. ళ కి ళ వొత్తె సరి అయినది.. చిన్నప్పుడు నేను నేర్చుకొన్నది కూడ మళ్ళీ .. వెళ్ళి…. లాంటి పదాలే కాని మళ్లీ .. వెళ్లీ. . పెళ్లీ లాంటివి కాదు… నాకు తెలిసి ల వొత్తు కాదు ళ వొత్తు సరి అయినది ఇది చదివిన తరువాత నేను ఒకసారి పెద్ద బాల శిక్ష పరిశీలిస్తే అనిపించింది… ళ కి ళ వొత్తే సరి అయినది అని.. ఇప్పటి తెలుగులో ఇలాంటివి చాల కనిపిస్తాయి

    rama

    ఆగష్టు 1, 2007 at 9:57 పూర్వాహ్నం

  17. కాని బ్రౌణ్యంలో ళ్ల అని ఉండడమే నాకు అంతు పట్టటలేదు.

    రాకేశ్వర రావు

    సెప్టెంబరు 9, 2007 at 10:08 అపరాహ్నం

  18. “ళ” మూర్ధన్య పార్శ్వం (Retroflex lateral approximant) అయితే “ల” దంతమూలీయ పార్శ్వం (Alveolar lateral approximant). మనం ళ్ల అని రాసినా ళ్ళ అని రాసినా ధ్వనిశాస్త్ర రీత్యా పలుకగలిగేది రెండు మూర్ధన్యాలనే. బ్రౌణ్యంలోనూ, పాత పుస్తకాలలోనూ “ళ్ల” “ణ్న” అని రాయడానికి కారణాలు భాషా పరమైనవి కాక ముద్రణా సాంకేతికతకు సంబంధించినవని నా నమ్మకం. ఆ రోజుల్లో ప్రింటింగ్ ప్రెస్సులలో అన్ని రకాల సంయుక్తాక్షరాలకు సరిపడా వేర్వేరు ముద్రలు ఉంచుకోవడం చాలా ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి అర్థభేదం లేకుంటే ఉన్న ముద్రలతోనే సరిపెట్టడానికి ప్రయత్నించేవారని నా ఊహ.

    సురేశ్ కొలిచాల

    సెప్టెంబరు 10, 2007 at 8:03 అపరాహ్నం


ప్రత్యుత్తరమిమ్ము