వీవెనుడి టెక్కునిక్కులు

జులై 29, 2007

ఏది సరి:’ళ్ళ’ లేదా ‘ళ్ల’?

ప్రచురించిన వర్గము Telugu, తెలుగు — Tags: — వీవెన్ @ 3:31 pm

నేను చిన్నప్పటినుండీ నేర్చుకున్నది ‘ళ్ళ’ అనే. ఉదాహరణకు ఇళ్ళు, పెళ్ళి, వెళ్ళు, మొదలైనవి. కానీ చాలాచోట్ల ‘ళ్ల’ వాడుతుండడం చూస్తున్నాం. ఇళ్లు, పెళ్లి, వెళ్లు, అని.

బ్రౌణ్యంలో కూడా ఇళ్లు, పెళ్లి అనే వాడారు.

ఈ రెండు రకాల వాడుకలూ సరైనవేనా? ఒకటే సరైనదైతే, ఏది? ఎందుకు?

మీరేమంటారు?

(ఈ చర్చ ఇంతకుముందెప్పుడో తెలుగుబ్లాగు సమావేశాల్లో వచ్చినట్టు లీలగా గుర్తుంది, కానీ వివరాలు గుర్తులేవు.)

తెలుగుపదం

ప్రచురించిన వర్గము Telugu, తెలుగు — Tags: — వీవెన్ @ 2:24 am

తెలుగుపదం ముఖ్యంగా రెండు లక్ష్యాలతో ఏర్పడింది:

  • చాన్నాళ్ళుగా మందగించిన కొత్త తెలుగు పదాలు తయారీని వేగవంతం చేయడం, ప్రోత్సహించడం, అందుకుకావాల్సిన సాముదాయిక వాతావరణాన్ని కల్పించడం.
  • పలు చోట్ల (బ్లాగుల్లో, గుంపుల్లో, ఇతర చోట్ల) తయారౌతున్న తెలుగు పదాలను ఒకేచోట (వెతుకుకొనగలిగే సౌలభ్యంతో) క్రోడీకరించడం.

ఈ లక్ష్యాలకు సాధనాలుగా తెలుగుపదం వికీ సైటు మరియు తెలుగుపదం గుంపులను స్థాపించాం.

మీరెలా తోడ్పడవచ్చు?

  1. మీ బ్లాగులో, ఇతర రచనలలో తెలుగు పదాలు వాడుతుండండి. మీనుండి మేం ఆశించే పెద్ద సహాయం ఇదే.
    కొత్త తెలుగు పదాలు వాడడానికి మీరు సందిగ్థంలో ఉండవచ్చు, మీ చదువరులకు ఈ కొత్త తెలుగు పదాలు అర్ధమౌతాయా అని. కానీ ధైర్యం చేసి తెలుగుపదాలు వాడండి. చాలావరకు సందర్భమే ఆ తెలుగుపదమేంటో తెలియజేస్తుంది. ఇక్కడ సందర్భం అంటే context అని మీకు తెలిసిపోయిందిగా అలా. ఆ రిస్కుకూడా తీసుకోకూడదు అనిపిస్తే ఆంగ్ల సమానార్థకాన్ని కూడా బ్రాకెట్లలో ఇవ్వండి. ఉ.దా. మీ వెబ్ విహరిణి (web browser) ని తెరవండి.
  2. మీక్కావలసిన పదాలు తెలుగుపదం సైటులో లేకపోతే, తెలుగుపదం గుంపులో అడగవచ్చు. మీకు తప్పక ఓ తెలుగుపదం దొరుకుతుంది.
  3. కొత్త పదాలను మీరు ప్రతిపాదించవచ్చు కూడా. ఇతరుల ప్రతిపాదనలకు మీ ప్రత్యామ్నాయాలూ సూచించవచ్చు. తెలుగుపదాల తయారీకి మీక్కావలిసిన మార్గదర్శకాలు రూపొందుతున్నాయి మరియు సమాచార వనరులు కూడా సేకరిస్తున్నాం
  4. గుంపులో జరిగే చర్చల్లో చాలా కొత్త పదాలు జాలువారుతుంటాయి. వీటిని తెలుగుపదం వికీలో చేర్చండంలో తోడ్పడడం ద్వారా మంచి పదసంపద తయారీలో మీ వంతు కృషిచేసినవారుఅవుతారు.
  5. మీకు తెలిసిన పండితులను (వివిధ రంగాలకు చెంది వారిని, తెలుగుపై ఆసక్తి ఉన్న వారిని) తెలుగుపదానికి సాయపడమని ప్రోత్సహించండి.
  6. మీ వెబ్ సైటు లేదా బ్లాగులో తెలుగుపదం బొత్తాలు పెట్టుకోండి.
    మామూలు బొత్తం: తెలుగుపదం

    <a href="http://telugupadam.org/">
      <img src="http://telugupadam.org/images/6/6f/Button88x31.png"
      alt="తెలుగుపదం"/>
    </a>

    చిన్ని బొత్తం: తెలుగుపదం

    <a href="http://telugupadam.org/">
      <img src="http://telugupadam.org/images/3/36/Button80x15.png"
      alt="తెలుగుపదం"/>
    </a>

అంతర్జాలంలో తెలుగుని వాడి మీరిప్పుడు చేస్తున్న తోడ్పాటు భవిష్యత్తులో బయటి ప్రపంచంలోని తెలుగు స్థాయిని కూడా పెంచేంతగా ప్రభావంచూపిస్తుంది.

జులై 25, 2007

ఈటీవీ ఇప్పుడు ప్రభాకరమయం అవుతుందా?

ప్రచురించిన వర్గము అవర్గీకృతం — Tags: — వీవెన్ @ 5:41 pm

ఖచ్చితంగా! సగటున రోజుకి 30 నిమిషాలు మించి టీవీ చూడని నాకే అలా అనిపిస్తుందంటే, అవుతుందనే లెఖ్ఖ.

ఈటీవీ వాళ్ళు వాళ్ళ పాతమయం గురించి మన బ్లాగుల్లో చదివారనుకుంటా. దాన్ని తగ్గించడానికి ఈటీవీని మరోమయం చేస్తున్నారేమో. ఆ పాతమయం గురించి ఈ టపాలో కూడా ఉంది. చదివితీరాల్సిన టపా అది.

జులై 24, 2007

IE7.com

ప్రచురించిన వర్గము ఫైర్‌ఫాక్స్ — Tags: — వీవెన్ @ 4:11 am

జులై 21, 2007

మీరో, ఉచిత అంతర్జాల టీవీ

ప్రచురించిన వర్గము అవర్గీకృతం — Tags: , — వీవెన్ @ 4:36 pm

మీక్కావలసిన ఒకే ఒక వీడియో ప్లేయర్ మీరో.

miro, Internet TV Platform

మీరో విశేషాలు:

  • ఏ వీడియో ఫైలునైనా ఆడించి చూపిస్తుంది
  • హై డెఫినిషన్
  • ఉచిత అంతర్జాల టీవీ
  • యూట్యూబ్ తదితర వీడియోల దిగుమతి
  • బిట్ టొరెంట్‌కు తోడ్పాటు

Miro

మీరు మీరోని తెలుగులోకి అనువదించవచ్చు కూడా.

జులై 16, 2007

గిన్నీసులో బ్రహ్మానందం?

ప్రచురించిన వర్గము లింకులు — Tags: , , — వీవెన్ @ 4:57 pm

ప్రపంచంలో అత్యధిక సినిమాలలో (750) నటించిన వ్యక్తిగా బ్రహ్మానందం గిన్నీసు పుస్తకంలో చోటు సంపాదించుకుంటున్నాడంట. పూర్తి వార్త MSN తెలుగులో.

జులై 10, 2007

విరామచిహ్నాలు ఇలా పుట్టాయి

ప్రచురించిన వర్గము లింకులు — Tags: , , , , , — వీవెన్ @ 2:01 am

విరామచిహ్నాలు (punctuation marks) ఎలా పుట్టాయో తెలుసుకోవడానికి, ఈ టపా చదవండి.

WordPress.com లో Blog పెట్టుము.