వీవెనుడి టెక్కునిక్కులు

వెబ్, కంప్యూటర్లు, తెలుగు, ఇతరత్రా…

ఫైర్‌ఫాక్స్‌లో విహరణ చరిత్ర సైడుపట్టీని వాడుకోవడం

with 2 comments

మీరు కొన్ని రోజుల క్రితం కూడలిలో ఓ టపా చూసారు. లేదా మరే సైటులోనో మరో సమాచారం చూసారు. చదివారు, ఆనందించారు, మర్చిపోయారు. బావుంది. కానీ, ఈ రోజు ఆ టపా మళ్ళీ కావలిసి వచ్చింది. అయితే మీరు ఆ టపాని పేజీక (bookmark) గా భద్రపరచుకోలేదు. కూడలిలో నుండి ఈసరికే వెళ్ళిపోయింది. ఆ వేరే వెబ్ సైటేదో మీకు గుర్తులేదు. ఇప్పుడు దాన్ని పట్టుకోవడం ఎలా? గూగుల్ బాబాయిని ఆశ్రయించేముందు, వెబ్ విహరిణుల (web browsers) లో ఉండే చరిత్రని ఓసారి చూడడం ఉత్తమం.

మీ విహరణ చరిత్ర (browsing history) ని మీరు వాడే వెబ్ విహరిణి గుర్తుపెట్టుకుంటుంది. మీరు చూసిన సైటు మీ విహరణ చరిత్రలో ఉండేఉంటుంది. ఈ విహరణ చరిత్రని ఫైర్‌ఫాక్స్‌లో ఎలా వాడుకోవచ్చో చూద్దాం.

ఫైర్‌ఫాక్స్ సాధారణంగా 9 రోజుల చరిత్రని గుర్తుపెట్టుకుంటుంది. మీరు దీన్ని పెంచుకోవచ్చు (లేదా అసలు మీ విహరణ చరిత్రని గుర్తుపెట్టుకోకుండానూ చేయవచ్చు కూడా, అది వేరే విషయం). మీ గత వెబ్ విహరణలోకి తొంగిచూడాలంటే, చరిత్ర సైడుపట్టీ (history sidebar) ని తెరవండి. దీనికి పలు మార్గాలు:

  • Ctrl + H కీ-జంటను నొక్కండి, లేదా
  • View మెనూలో Sidebar, తర్వాత History, లేదా
  • History మెనూలో చివరి అంశం, Show in Sidebar

అప్పుడు మీకు సైడుపట్టీ ఇలా కనిపిస్తుంది.

Date-wise

దీనిలో మీ విహరణ చరిత్రని మీరు రోజువారీ, సైటువారీ, ఎక్కువసార్లు చూసిన పేజీలువారీగా, చివరిసారిచూసిన పేజీలవారీగా చూడవచ్చు (View బొత్తాన్ని నొక్కడం ద్వారా).

Views

మీ విహరణ చరిత్రలో శోధించవచ్చు కూడా:
Searching

ఇక ముగిస్తా. ఈ పరిచయంతో మీరు ముందుకెళ్ళవచ్చు. సందేహాలు, సూచనలు గట్రా ఉంటే వ్యాఖ్యానించండి.

ఆనంద జాలా జ్వాలనం!

Written by వీవెన్

జూన్ 27, 2007 వద్ద 4:51 పూర్వాహ్నం

2 స్పందనలు

Subscribe to comments with RSS.

  1. నేను నిన్న sidebar కి పక్కబారు అని వాడాను,
    ఇవాళ మీరు సైడు పట్టీ అంటున్నారు. రెండూ కలిపి పక్కపట్టీ అంటే బాగుంటుందేమో..

  2. ఓకే, అలాగే కానిద్దాం.


ప్రత్యుత్తరమిమ్ము