ఫైర్‌ఫాక్స్ చిట్కా: అనుకోకుండా మూసేసిన ట్యాబులను తిరిగిపొందడం
మీరెప్పుడైనా ఫైర్‌ఫాక్స్‌లో అనుకోకుండా (లేదా ప్రమాదవశాత్తూ) మీక్కావాల్సిన ట్యాబుని మూసేసారా? మీరు మూసివేసిన ట్యాబుని తిరిగి పొందడం చాలా వీజీ.
- History మెనూలో Recently Closed Tabs లో మీరు మూసేసిన ట్యాబులన్నీ ఉంటాయి.
- లేదా, మీరు Ctrl + Shift + T అన్న కీబోర్డు షార్టుకట్టు కూడా వాడవచ్చు.
ఆనంద జాలా జ్వాలనం!











చాలా మంచి విశేషమిది
వ్యాఖ్య ద్వారా చదువరి — జూన్ 21, 2007 @ 2:14 pm
IEలో ఇలాంటి పనులు చేయడానికి iepro (http://www.ie7pro.com/) వాడవచ్చు.
వ్యాఖ్య ద్వారా వెంకట రమణ — జూన్ 21, 2007 @ 5:56 pm
Tab = టాబ్, mari mee lekkana Tyab = ట్యాబు కావాలికదా?
కలర్డ్ టాబ్స్ గురించి విశదీకరించండి.
వ్యాఖ్య ద్వారా anil — జూన్ 22, 2007 @ 10:33 am
ట్యాబు అనేకంటే టాబు అనడం మేలు. తెలుగులో ఈ సౌండు ఉన్నా రాసే విధానం మాత్రం లిపిలో లేదు. తాటాకు అని రాస్తారు కాని పలికేటప్పుడు తాటే/కు అని పలుకుతారు. తాట్యాకు అని మాత్రం ఎక్కడా వ్రాయరు. అలాగే టే/బు అని పలికేదాన్ని లిపిలో టాబు అని రాయడం సబబు అని నాభిప్రాయం.
వ్యాఖ్య ద్వారా కిరణ్ — జూన్ 28, 2007 @ 2:42 pm