వీవెనుడి టెక్కునిక్కులు

జూన్ 27, 2007

ఫైర్‌ఫాక్స్‌లో విహరణ చరిత్ర సైడుపట్టీని వాడుకోవడం

ప్రచురించిన వర్గము చిట్కాలు, ఫైర్‌ఫాక్స్ — Tags: — వీవెన్ @ 4:51 am

మీరు కొన్ని రోజుల క్రితం కూడలిలో ఓ టపా చూసారు. లేదా మరే సైటులోనో మరో సమాచారం చూసారు. చదివారు, ఆనందించారు, మర్చిపోయారు. బావుంది. కానీ, ఈ రోజు ఆ టపా మళ్ళీ కావలిసి వచ్చింది. అయితే మీరు ఆ టపాని పేజీక (bookmark) గా భద్రపరచుకోలేదు. కూడలిలో నుండి ఈసరికే వెళ్ళిపోయింది. ఆ వేరే వెబ్ సైటేదో మీకు గుర్తులేదు. ఇప్పుడు దాన్ని పట్టుకోవడం ఎలా? గూగుల్ బాబాయిని ఆశ్రయించేముందు, వెబ్ విహరిణుల (web browsers) లో ఉండే చరిత్రని ఓసారి చూడడం ఉత్తమం.

మీ విహరణ చరిత్ర (browsing history) ని మీరు వాడే వెబ్ విహరిణి గుర్తుపెట్టుకుంటుంది. మీరు చూసిన సైటు మీ విహరణ చరిత్రలో ఉండేఉంటుంది. ఈ విహరణ చరిత్రని ఫైర్‌ఫాక్స్‌లో ఎలా వాడుకోవచ్చో చూద్దాం.
(ఇంకా…)

జూన్ 26, 2007

తెవికీలో ౩౦,౦౦౦ వ్యాసాలు

ప్రచురించిన వర్గము తెలుగు, తెవికీ — Tags: — వీవెన్ @ 6:29 am

తెలుగు వికీపీడియా ౩౦,౦౦౦ వ్యాసాలకు చేరుకుంది! తెలుగు వికీపీడియనులందరికీ అభినందనలు! ఇన్ని వ్యాసాలు కలిగిఉన్న మొట్టమొదటి భారతీయ భాషా వికీపీడియా, తెవికీ.

భారతీయ భాషా వికీపీడియాల పూర్తి జాబితా మరియు గణాంకాల కోసం, క్రాస్‌రోడ్స్‌లో ఈ టపా చూడండి.

జూన్ 24, 2007

ఇంక్‌స్కేప్ మరియు యూనికోడ్ తెలుగు

ప్రచురించిన వర్గము తెలుగు, ప్రయోగాలు — Tags: — వీవెన్ @ 12:18 pm

ఇంక్‌స్కేప్ అనేది ఒక వెక్టర్ గ్రాఫిక్స్ పరికరం. దీనిలో యూనికోడ్‌కి తోడ్పాటు ఉంది. అంటే మనం తెలుగులో కూడా గ్రాఫిక్స్ తయారుచేసుకోవచ్చు.

ఉదాహరణకి ఈ చక్కని పాఠం ఉపయోగించి రెండు నిమిషాలలో నేను చేసిన బొమ్మ చూడండి:

Telugu in Inkscape

ఇంక్‌స్కేప్‌లో మరింత క్లిష్టమైన చిత్రాలు కూడా గీయవచ్చు. ఇది ప్రారంభం మాత్రమే.

ఫైర్‌ఫాక్స్‌౩ లో తెలుగు సరిగ్గా రాబోతుంది!

ప్రచురించిన వర్గము Telugu, తెలుగు, ఫైర్‌ఫాక్స్ — Tags: — వీవెన్ @ 8:29 am

ఫైర్‌ఫాక్స్‌ ప్రియులకు శుభవార్త: ఫైర్‌ఫాక్స్‌౩ లో తెలుగు సరిగ్గా రాబోతుంది! ఫైర్‌ఫాక్స్‌౩ లో అమలు చేస్తున్న కొత్త టెక్స్టుఫ్రేమ్ వల్ల ఈ బగ్గు ఫిక్సయ్యింది. అయితే మనకేంటి? మనకేంటంటే, తెలుగు ఇక ఫైర్‌ఫాక్స్‌ ౩ నుండి చక్కగా కనిపిస్తుంది. తెలుగొక్కటేకాదు, ఇతర భారతీయ భాషలుకూడా చక్కగా కనిపిస్తాయి. అవును, XPలో ప్రాంతీయ మరియు భాషా ఎంపికల (Regional and Language Options) లో సంక్లిష్ట లిపులకొరకు ప్రత్యేక తోడ్పాటుని వ్యవస్థాపితం చేయపోయినా సరే ఫైర్‌ఫాక్స్‌౩ నుండి తెలుగు తెలుగులా కనిపిస్తుంది. ఇకనుండి నా Unjustify! అవసరముండదు. మీకోసం కొన్ని తెరచాపలు (screenshots): (ఇంకా…)

జూన్ 22, 2007

కూడలి వార్షికోత్సవ కానుక: చదివిన టపాలు తొలగించుకునే సౌలభ్యం

ప్రచురించిన వర్గము koodali, కూడలి — వీవెన్ @ 3:05 pm

కూడలి వార్షికోత్సవ కానుకగా చదివిన టపాలు తొలగించుకునే సౌలభ్యం అందిస్తున్నా. ఇది సరళమైన, చిన్ని పరిష్కారం*.

Hide Visited Posts in Koodali

ఆ నక్షత్రం మీద నొక్కండి చాలు. మీరు చదివేసిన టపాలన్నీ ఎగిరిపోతాయి. (కీబోర్డు ప్రేమికులు “*” (asterisk), “.” (dot) లలో ఏదైనా వాడవచ్చు. Shift key does not matter.) మళ్ళీ అన్ని టపాలు కావాలంటే, పేజీని రీలోడ్ చేయండి.

ఇప్పుడే ప్రయత్నించండి!*

*document.defaultView ని అందించే ఏ విహరిణిలో ఐనా పనిచేస్తుంది. (మంటనక్కలో పనిచేస్తుంది. IE6లో పనిచేయదు. IE7 తెలియదు.)

ప్రస్తుతం బ్లాగుల పేజీలోనే దీన్ని చేతనం చేసా. మిగతా పేజీలలో కావాలంటే ఇక్కడ వ్యాఖ్యల రూపంలో తెలియజేయండి.

ఫైర్‌ఫాక్స్ కొత్త పొడగింత: థంబ్‌స్ట్రిప్స్

ప్రచురించిన వర్గము ఫైర్‌ఫాక్స్ — Tags: — వీవెన్ @ 2:18 am

థంబ్‌స్ట్రిప్స్ అనేది మీ వెబ్ విహరణ చరిత్రని సినిమా రీలులా చూపించే ఓ ఫైర్‌ఫాక్స్ పొడగింత.

Thumbstrips

విహరణ చరిత్రని దృష్యరూపంలో (నఖచిత్రాలుగా) చూపిండంలో ఇది కొత్త పద్ధతి. వెనక్కి ముందికి స్క్రోల్ చేస్తుంటే రీలు తిప్పుతునట్టే. వడపోత (filter) కూడా బావుంది: మనక్కావలిన సైట్ల నఖచిత్రాలను మాత్రమే చూపించేలా వడపోసుకోవచ్చు. మన విహరణ చరిత్రని శోధించవచ్చుకూడా.

Searching in Thumbstrips

ఈ పొడగింత ద్వారా మన విహరణ చరిత్రని ఇతరులతో పంచుకోవచ్చు కూడా. కానీ నేనింకా ప్రయత్నించలేదు.

ఆనంద జాలా జ్వాలనం!

జూన్ 21, 2007

ఫైర్‌ఫాక్స్ చిట్కా: అనుకోకుండా మూసేసిన ట్యాబులను తిరిగిపొందడం

ప్రచురించిన వర్గము చిట్కాలు — Tags: — వీవెన్ @ 10:03 am

మీరెప్పుడైనా ఫైర్‌ఫాక్స్‌లో అనుకోకుండా (లేదా ప్రమాదవశాత్తూ) మీక్కావాల్సిన ట్యాబుని మూసేసారా? మీరు మూసివేసిన ట్యాబుని తిరిగి పొందడం చాలా వీజీ.

  • History మెనూలో Recently Closed Tabs లో మీరు మూసేసిన ట్యాబులన్నీ ఉంటాయి.
  • లేదా, మీరు Ctrl + Shift + T అన్న కీబోర్డు షార్టుకట్టు కూడా వాడవచ్చు.

ఆనంద జాలా జ్వాలనం!

కూడలికి ఒక సంవత్సరం మరియు శతటపోత్సవం

ప్రచురించిన వర్గము koodali, కూడలి, తెలుగు బ్లాగులు — వీవెన్ @ 12:00 am

జూన్ 10, 2007

ఫైర్‌ఫాక్స్ ఉపయోగిచడం నేర్చుకోండి!

ప్రచురించిన వర్గము చిట్కాలు, ఫైర్‌ఫాక్స్ — Tags: — వీవెన్ @ 6:02 am

learnfirefox.cybernetnews.com అనే సైటులో ఫైర్‌ఫాక్స్‌లో వివిధ అంశాలని ఎలా ఉపయోగించుకోవాలి, కొత్త హంగులని ఎలా సమకూర్చుకోవాలి అన్న అంశాలపై సచిత్ర వివరణలతో (వీడియోలు కూడా) ఉన్నాయి. కొత్తవారికి చాలా ఉపయోగపడుతుంది.

జూన్ 9, 2007

ఇన్‌స్క్రిప్ట్ చిట్కాలు

ప్రచురించిన వర్గము Telugu, తెలుగు — Tags: , , — వీవెన్ @ 8:55 am

తెలుగు కీబోర్డు లేఔట్లపై సౌమ్య టపా మరియు తెలుగుబ్లాగు సమూహాంలో కొందరడిగిన సందేహాలు కలిపి ఈ టపా రాయడానికి నాకు ప్రేరణనిచ్చాయి.

మొదట, కీబోర్డు లేఔట్ అన్నది ఎవరికివారి వ్యక్తిగత ఎంపిక. నేను ఇన్‌స్క్రిప్ట్‌కి ఎందుకు మారానంటే నాకు RTS బాగా వచ్చేసింది కాబట్టి! ఇంకందులో మజాలేదు, కొత్తది నేర్చుకుందామని. మీరు ఇన్‌స్క్రిప్ట్‌కి మారాలంటే, మీ కారణాలు మీరు వెతుక్కోండి.

మీరు ఇన్‌స్క్రిప్ట్ నేర్చుకోవాలనుకుంటే, మీకోసం కొన్ని చిట్కాలు. మీఅంత మీరే శోధించి సాధించాలనుకునే తత్వంమీదైతే, మీకిది అవసరం.

ఇన్‌స్క్రిప్ట్‌ని ఇంగ్లీషు లేఔట్‌తో ముడి పెట్టడమనేది ఇన్‌స్క్రిప్ట్ నేర్చుకునేవారు చేసే మొదటి పొరపాటు మరియు వదులుకోవాల్సిన మొదటి అలవాటు. “ర” రాయాలంటే j అక్షరం టైపుచేయాలి అని గుర్తుంచుకోకూడదు. కుడిచేతి చూపుడువేలును వొత్తాలి అని గుర్తుపెట్టుకోవాలి. ఇది మొదటి నియమం. ఉన్న నియమం కూడా ఇదొక్కటే! పెద్దలమాట చద్దిమూట. మరొక్కసారి నా మాటల్లో:

Rule 1: Don’t try to remember keys; remember their positions.

మీరు ఇన్‌స్క్రిప్ట్‌లో టైపు చేస్తున్నప్పుడు మీ మదిలో తెలుగు అక్షరాల లేఔట్ ఉండాలి. ఇంగ్లీషులో టైపు చేస్తున్నప్పుడు ఇంగ్లీషు అక్షరాల లేఔట్ ఉండాలి. అప్పుడు మీరు టైపింగులో మంచి వేగం సాధించగలుగుతారు. ఇంగ్లీషు లేఔట్‌తో తెలుగు అక్షరాలను గుర్తుపెట్టుకోవడం మొదలుపెడితే మీ ఇంగ్లీషు మరియు తెలుగు టైపింగుల వేగం ప్రతికూలంగా ప్రభావితమౌతుంది. మీరు టైపుచేస్తున్నప్పుడు రెండు లేఔట్లు (మీ మదిలో) కలగలిసిపోయి ఒకదానిబదులు ఇంకొకటి టైపుచేసి ఆ తప్పులు సరిదిద్దుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది (మొదట్లో నాకు పట్టింది).

ఇన్‌స్క్రిప్ట్‌లో ఫలానా అక్షరం ఎలా టైపుచెయ్యాలి అని ఎవరైనా నన్ను అడిగితే, నేను మొదట ఆ కీ స్థానం గుర్తుతెచ్చుకుని, ఆ స్థానంలో ఇంగ్లీషుకి ఏ కీ ఉంటుందో చెప్తా. అవును, పై నియమం నేను అనుసరించిన తర్వాతే చెప్తున్నా.

ఒక్కసారి కీల స్థానాలమీద పట్టు సాధించాకా, వేగంగా టైపు చేయడమనేది ఇన్‌స్క్రిప్ట్‌ లోఔట్‌తో చాలా సులభమౌతుంది.

నాకైతే ఇన్‌స్క్రిప్ట్‌ లోఔట్‌తో తక్కువ నొక్కులతో టైపుచేయగల్గుతున్నాననిపిస్తుంది. ఇంకా తర్వాత టైపు చెయ్యాల్సిన కీ వేలి క్రిందే ఉన్నట్టు అనిపిస్తుంది. (సరే చాలా అతిగా చెప్పేసాననుకోండి.)

ఆనంద ఇన్‌స్క్రిప్ట్ లేఖనం.

WordPress.com లో Blog పెట్టుము.