వీవెనుడి టెక్కునిక్కులు

మే 28, 2007

భారత్‌లో వైరస్‌బాధిత కంప్యూటర్లు

ప్రచురించిన వర్గము అవర్గీకృతం — Tags: — వీవెన్ @ 12:25 pm

MSN తెలుగులో ఈ కథనం చదవండి. మీ కంప్యూటర్లను సంరక్షించుకోండి. నా కంప్యూటర్ కోసం నేను AVG వాడుతా.

మే 25, 2007

ఫలితాలు వచ్చాయి!

ప్రచురించిన వర్గము అవర్గీకృతం — Tags: — వీవెన్ @ 4:30 am

వీరిలా నేను కూడా IQ పరీక్ష రాసా. మరి ఫలితాలు చూడండి (ఎర్రగీతలు నావి).

Veeven’s IQ Test Results

నాకు నచ్చాయి. కానీ, మిగతా విషయాలెలా ఉన్నా నా గణిత పరిజ్ఞానం మీద మాత్రం నాకు చాలా నమ్మకం. 7 తరగతి లెక్కల పరీక్ష ఇప్పుడు రాస్తే తప్పనిసరిగా ఫెయిల్ అవుతా.

మే 24, 2007

కొత్తవారిని కరవొద్దు!

ప్రచురించిన వర్గము అవర్గీకృతం — Tags: — వీవెన్ @ 10:32 am

మనమెక్కడ?

ప్రచురించిన వర్గము Telugu, తెలుగు — Tags: — వీవెన్ @ 9:27 am

 Telugu

బొమ్మే చెప్పేస్తుంది కథంతా. (బొమ్మ మే 22న తీసింది. తాజా ధోరణి చూడండి.)

తెలుగు వికీపీడియా (Telugu Wikipedia) మరియు తెలుగు బ్లాగులు (Telugu Blogs) ఉన్నాయని చాలామందికింకా తెలిసినట్టు లేదు. తెలిసి ఉంటే, కనీసం అట్టడుగునైనా ఉండేవి కదా. Keep spreading!

మే 20, 2007

ఫైర్‌ఫాక్స్ పొడగింత: CoLT

ప్రచురించిన వర్గము చిట్కాలు — Tags: — వీవెన్ @ 2:13 pm

సమస్య:
మనం కొన్ని సార్లు వెబ్ పేజీలలో లింకు వచనాన్ని కాపీ చేయాల్సివస్తుంది మరికొన్నిసార్లు లింకు వచనము మరియు చిరునామాని కూడా కాపీ చేస్తుంటాం (ఉ.దా. మన బ్లాగు టపాలో ఇతర బ్లాగులకు లేదా సైట్లుకు లింకులు ఇస్తున్నప్పుడు). ఫైర్‌ఫాక్స్‌లో లింకు చిరునామాని లింకు మీద మూషికపు కుడినొక్కు చేస్తే వచ్చే మెనూలో నుండి Copy Link Location ద్వారా కాపీ చేసుకోవచ్చు. కానీ లింకు వచనాన్ని కాపీ చేయడం కోసం వచనాన్ని సెలెక్టు చేసుకోవడం కొంచెం కష్టమే.

పరిష్కారం:
CoLT (Copy Link Text కి సంక్షిప్త రూపం) అనేది మనక్కావలసిన విధంగా లింకు వచనాన్ని లేదా లింకు చిరునామాని మరియు లింకువచనాన్ని కలిపి కాపీ చేసిపెట్టే ఓ చిన్న ఫైర్‌ఫాక్స్ పొడగింత.

ఉదాహరణకి మీరో లింకు మీద మూషికపు కుడినొక్కు మెనూలో ఈ క్రింది ఎంపికలు కనిపిస్తాయి:
CoLT Options when right-clicked on a link

ఏ ఎంపిక ఏమేం క్లిప్‌బోర్డులోకి కాపీ అవుతుందో ఈ పట్టిక చూపిస్తుంది:

ఎంపిక క్లిప్‌బోర్డులోకి కాపీ అయ్యేది
Copy Link Text స్వచ్ఛమైన నీరు-ఆరోగ్యమైన మీరు
HTML Link <a href=”http://veeven.wordpress.com/2007/05/02/pure-water/”>స్వచ్ఛమైన నీరు-ఆరోగ్యమైన మీరు</a>
Plain Text స్వచ్ఛమైన నీరు-ఆరోగ్యమైన మీరు - http://veeven.wordpress.com/2007/05/02/pure-water/
BB Code [url=http://veeven.wordpress.com/2007/05/02/pure-water/]స్వచ్ఛమైన నీరు-ఆరోగ్యమైన మీరు[/url]
Fuse Talk [L=స్వచ్ఛమైన నీరు-ఆరోగ్యమైన మీరు]http://veeven.wordpress.com/2007/05/02/pure-water/[/L]
Wikipedia [http://veeven.wordpress.com/2007/05/02/pure-water/ స్వచ్ఛమైన నీరు-ఆరోగ్యమైన మీరు]

ఇవేకాక వీలైనన్ని మీ స్వంత ఫార్మాటులు కూడా చేర్చుకోవచ్చు.

మే 18, 2007

కూడలిలో సేకరణల విభాగం

ప్రచురించిన వర్గము koodali, కూడలి — వీవెన్ @ 1:52 am

తెలుగుబ్లాగు గుంపులో వచ్చిన ప్రతిపాదన మేరకు కూడలిలో సేకరణబ్లాగులకో ప్రత్యేక విభాగం సృష్టించా. (బ్లాగుల జాబితా) మీ బ్లాగు ఇందులో ఉండిఉంటే, అలా ఉండకూడదని మీరనుకుంటే, తెలుగుబ్లాగు సమూహంలో చర్చించండి.

మొదటిపేజీలో ఇక కనబడని వీటికి పరిహారంగా సేకరణ పేజీలో టపాల సంఖ్య 100కి పెంచా. అంటే టపాలు కూడలిలో ఉండేకాలం ఎక్కువవుతుంది, కాబట్టి ఎక్కువమందికి చేరే అవకాశం ఉంది.

మరోహంగు: ప్రతీ పేజీ చివరన ఇతర పేజీలుకు లింకులు అమర్చా. పేజీల మధ్య విహరించడం సులువౌతుంది. ఒక పేజీ చివరకొచ్చాకా వేరే పేజీకి లింకు అక్కడే ఉంటుంది. మళ్ళీ పేజీలో పైకెళ్ళాల్సిన అవసరంలేదు.

మే 16, 2007

ఆర్కుట్ లేఖిని సమూహంలో 400 సభ్యులు

ప్రచురించిన వర్గము lekhini, లేఖిని — వీవెన్ @ 2:57 pm

శీర్షికే మొత్తం చెప్పేస్తుంది. మీరు ఆర్కుట్ సభ్యులైతే, లేఖిని సమూహంలో చేరండి.

ఆర్కుట్ లేఖిని సమూహాన్ని దాదాపు 9 నెలల క్రితం (సెప్టెంబర్ 2006 లో) , చింతు ప్రారంభించాడు. ఆర్కుట్లో తెలుగు క్రమంగా (మెల్లగానైనా) పెరుగుతూంది. చాలా మంది తమ పేరుని తెలుగులో కూడా రాసుకుంటున్నారు. ఆర్కుట్ నుండి లేఖినికి నెలకు దాదాపు 300 హిట్లు వస్తున్నాయి, ప్రత్యేకించి ఈ సమూహాలనుండి:

మే 13, 2007

బ్లాగు (మితిక)

ప్రచురించిన వర్గము ప్రయోగాలు — Tags: , , — వీవెన్ @ 2:01 am

కంగారుపడకండి మితిక అంటే మినీ కవిత. అదెలా అంటారా, అదంతే!

సుమనుడికి ఈ-టీవీ బ్లాగు
రాజకీయులకు అసెంబ్లీ బ్లాగు
లేనిదెక్కడ జగమున బ్లాగు
పెక్కు రూపముల కలదీ బ్లాగు

మే 2, 2007

స్వచ్ఛమైన నీరు-ఆరోగ్యమైన మీరు

ప్రచురించిన వర్గము వ్యక్తిగతం — Tags: , , — వీవెన్ @ 5:50 pm

పట్టణాల్లో ఉంటున్నమనం త్రాగేనీటిపై తగిన శ్రద్ధ వహించాలికదా. మేము మా ఇంట్లో త్రాగేనీటి కోసం కాచి వడపోసిన నీటిని ఉపయోగిస్తాం. స్వచ్ఛమైన నీటికోసం మరింత సులభమైన పద్ధతులు, సాధనాలు ఉండిఉంటాయి. వాటర్ ఫిల్టర్, ఆక్వాగార్డు, తదితరాలు.

నేను హిందూస్థాన్ లీవర్ వారి ప్యూరిట్‌ని కొందామని అనుకుంటున్నాను. మీలో ఎవరైనా దానిని ఉపయోగించిఉంటే చెప్పండి, మీరు దానితో సంతృప్తికరంగా ఉన్నారా? నేను ప్యూరిట్‌నే ఎంచుకోవాలా? లేదా మరేమైనా ఉత్తమ ఫలితాలు చూపే చౌక సాధనాలు ఉన్నాయా? ఒక రూపాయితో అత్యధిక ప్రయోజనం ప్యూరిట్ అందిస్తుందని హిందూస్థాన్ లీవర్ వారు చెప్తున్నారు. మీ సలహాలు, అభిప్రాయాలు తెలియజేయండి.

WordPress.com లో Blog పెట్టుము.