వీవెనుడి టెక్కునిక్కులు

ఫిబ్రవరి 19, 2007

ఫైర్‌ఫాక్స్‌లో (unjustified) తెలుగు

ప్రచురించిన వర్గము Telugu, చిట్కాలు, తెలుగు, తెలుగు బ్లాగులు, ఫైర్‌ఫాక్స్ — Tags: — వీవెన్ @ 8:00 am

మామూలుగా ఫైర్‌ఫాక్స్ తెలుగుని బానే చూపిస్తుంది (సరే, మీరు XPలో Support for Complex Script Languages ని చేతనం చేసిన తర్వాతే). కానీ జస్టిఫై చేసిన తెలుగు వచనాన్ని సరిగా చూపించలేదు. ఈ సమస్యని రెండు విధాలుగా అధిగమించవచ్చు. ఒకటి, తాత్కాలికంగా IE లేదా IE Tab వాడడం. రెండు, జస్టిఫై చేసిన వచనాన్ని వాడవద్దని ఆ సైటు నిర్వాహకునికి విన్నవించుకోవడం.

మొదటి పరిష్కారంలో IE వాడడం స్వల్ప అసౌకర్యం. IE Tab పర్లేదు, ఫైర్‌ఫాక్స్‌లోనే ఆ పేజీని IEతో చూపిస్తుంది. రెండవ పరిష్కారం కొన్నిసార్లు దైవాదీనం కావచ్చు. ఈ రెండూ కాకుండా, ఫైర్‌ఫాక్స్‌తోనే ఆ జస్టిఫై వచనాన్ని సరిచేసుకోగలిగితే బాగుంటుంది కదా.

అందుకే నేనో పిల్ల బుక్‌మార్కుని తయారుచేసా. దాని పేరు… ఆ unjustify. దీన్ని మీ బుక్‌మార్కు బారులో పెట్టుకొని, జస్టిఫై వచనమున్న తెలుగుపేజీ ఎదురైనప్పుడు దీనిమీద ఓ నొక్కు నొక్కితే చాలు. ఆ పేజీలోని వచనం మీరు చదివేందుకు వీలుగా మారుతుంది.

ఎలా వాడాలి?

  1. ఈ పేజీలోని unjustify లంకెని బుక్‌మార్కు బారు లో చేర్చుకోండి.unjustify
  2. జస్టిఫై చేసిన వచనమున్న ఒక వెబ్‌సైటుకి వెళ్ళండి.
  3. ఇందాక చేర్చుకున్న బుక్‌మార్కు మీద ఓ నొక్కు నొక్కండి.
  4. జుస్టిఫైడ్ వచనం సరి అవుతుంది.

ఇక మీరు ఫైర్‌ఫాక్స్ సౌఖ్యంతోనే తెలుగు పేజీలని చదవవచ్చు.  ఏమైనా ఇబ్బందులుంటే తెలుగుబ్లాగు సమూహానికి రాయండి. నేను బదులిస్తా.

(అన్నట్టు మీరోటి గమనించారా, కూడలిలో ఈ సమస్య రాకుండా నేను సరిచేసా.)

తాజాకరణ 2007-02-19: ఇప్పుడు WordPress.com బ్లాగులలో కూడా పనిచేస్తుంది. (మీ వర్డుప్రెస్ బ్లాగు థీమ్ justifed text లేదా/మరియు letter-spacing ని వాడుతుంటే ఫైర్‌ఫాక్స్ ని ఉపయోగించే మీ బ్లాగు సందర్శకులకి Unjustify ని వాడమని సూచించండి.)

ఫిబ్రవరి 17, 2007

కూడలిలో బ్లాగుల జాబితాలు సిద్ధం

ప్రచురించిన వర్గము Telugu, కూడలి, తెలుగు బ్లాగులు — Tags: — వీవెన్ @ 3:06 pm

వెంకట రమణ: కూడలిలో “149 తెలుగు బ్లాగులనుండి సంగ్రహం” అని ఉంది కదా, దాన్ని నొక్కగలిగే విధంగా మార్చి, బ్లాగుల జాబితాకి అనుసంధానిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అదే విదంగా వ్యాఖ్యలు వార్తలు మెదలయిన వాటిలో కూడా ఆయా జాబితాలను చూపిస్తే బాగుంటుంది. పూర్తయింది!

మూషికం ఎలా పనిచేస్తుంది?

ప్రచురించిన వర్గము అవర్గీకృతం — Tags: — వీవెన్ @ 5:05 am

మూషికం (Mouse) ఎలా పనిచేస్తుంది?

ఇలా!

WordPress.com లో Blog పెట్టుము.