వీవెనుడి టెక్కునిక్కులు

జనవరి 28, 2007

స్వేచ్ఛ లినక్సు తో ప్రయోగం

ప్రచురించిన వర్గము తెలుగు, ప్రయోగాలు — Tags: , , — వీవెన్ @ 2:42 pm

తొలి తెలుగు కంప్యూటర్ నిర్వాహక వ్యవస్థ స్వేచ్ఛ లినక్సు ని ఈరోజు మొదటిసారి ఉపయోగించా. మీ కోసం ఆ చిత్రావళి.

లైవ్ సి.డి. ఉపయోగించి కంప్యూటర్ని ప్రారంభించగానే, తెలుగా, ఇంగ్లీషా కోరుకోమంటుంది.

Choose Language

తెలుగుని ఎంచుకున్నాకా కొంత అంతర్గత ప్రక్రియ తర్వాత, స్వేచ్ఛ లోడింగ్ తెర కనిపిస్తుంది.

 Loading

ఆ తర్వాత స్వేచ్ఛ డెస్క్‌టాప్ ప్రత్యక్షమవుతుంది.

 Desktop

ఫైర్‌ఫాక్స్ తెరిచి తెలుగెలా కనిపిస్తుందో చూద్దాం. (UI కూడా తెలుగులో)

Firefox showing Telugu

ప్యానల్ కి చేర్పులని జోడించే పేటిక

Add to Panel Dialog

టెక్స్ట్ ఎడిటర్

Text Editor

స్వేచ్ఛ లినక్సు తెలుగుని చదువుతుందంటకూడా. మిథ్యాయంత్రంలో ధ్వని రావడంలేదు. ఓసారి ప్రత్యక్షంగా ప్రయత్నించి చూడాలి. UI అనువాదంలో తెలుగు బ్లాగర్ల తోడ్పాటు అవసరం. కొన్నయితే, అర్థంచేసుకోలేకపోయా.

లైవ్ సి.డి. కాబట్టి ఎటువంటి జంకులేకుండా మీరూ మీ కంప్యూటర్లపై ప్రయత్నించవచ్చు.

జనవరి 26, 2007

మిథ్యాకరణ: XPలో ఉబుంటు

ప్రచురించిన వర్గము Telugu, తెలుగు, ప్రయోగాలు — Tags: , , , — వీవెన్ @ 2:42 am

ప్రవీణ్ యొక్క టపా స్పూర్తితో నా కంప్యూటర్లో విండోస్ XPలో VMWare ద్వారా ఉబుంటు లినక్సుని కూడా నడుపుతున్నాను. ఇన్‌స్టలేషన్ ప్రక్రియ సాఫీగా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తయింది.

వెనుక XP, ముందు కిటికీలో ఉబుంటు (తెలుగు చూపించడానికి ఇబ్బంది పడుతుంది):

Firefox showing TeWiki in Ubuntu on XP

అభినయ్ సూచనలతో తెలుగు కూడా సిద్ధం:

Firefox showing TeWiki correctly in Ubuntu on XP

జనవరి 24, 2007

ఫైర్‌ఫాక్స్ పొడగింత: లొకేషన్ బార్2

ప్రచురించిన వర్గము తెలుగు, ఫైర్‌ఫాక్స్ — Tags: — వీవెన్ @ 6:16 pm

Firefox with Locationbar2 Extension

పైనున్న ఫైర్‌ఫాక్స్ తెరచాప (ప్రత్యేకించి చిరునామా పట్టీ) లో మీరేదైనా తేడా గమనించారా?

  • http:// అన్నది లేదు.
  • డొమైను పేరు బొద్దుగా ఉంది.
  • వెబ్ చిరునామాలో తె లు గు  అక్షరాలు కూడా కనిపిస్తున్నాయి.

ఇదంతా లొకేషన్ బార్2 అనే ఫైర్‌ఫాక్స్ పొడగింత యొక్క మహత్యం. ఈ పొడగింత యొక్క పై మూడు విశేషాలని మరికొంచెం వివరిస్తా.

  1. http:// : http లేదా https అన్నవి సాఫ్ట్‌వేర్ కొరకు ఉద్దేశించిన వెబ్ ప్రొటోకాల్సు. చిరునామా పట్టీలో వాటిని చూపించకపోయినా మనకి మామూలుగా వచ్చే నష్టమేమీలేదు. కానీ కొన్ని ప్రత్యేక అవసరాలకి (ఉ.దా. పేజీ URL ని కాపీ చేసుకునేప్పుడు) ఖచ్చితమైన వెబ్ చిరునామా కావాల్సిరావచ్చు. లొకేషన్ బార్2 పొడగింత http లేదా https ని చూపించదు. కానీ చిరునామా పట్టీ లో కర్సర్ ఉన్నప్పుడు లేదా చిరునామా పట్టీ పైకి మూషికాన్ని తీసుకెళ్ళినా పూర్తి చిరునామాని చూపిస్తుంది. అంటే సరిగ్గా మనకవసరమైనప్పుడే!
  2. బొద్దు డొమైను పేరు: డొమైను పేరుని ఇలా ప్రత్యేకంగా చూపించడం నకిలీ వెబ్ సైట్లని గుర్తించడంలో మనకి తోడ్పడుతుంది. మన లాగిన్ వివరాలు సరైన వెబ్ సైట్లోనే ఇస్తున్నామో లేదో ఓసారి సరిచూసుకోవచ్చు.
  3. వెబ్ చిరునామాలో తెలుగు అక్షరాలు: వెబ్ చిరునామాలో “%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81″ కంటే “తెలుగు” అని చూడడం బాగుంటుందికదా. తెవికీ లేదా తెలుగు బ్లాగుల్లో విహరించేటప్పుడు ఉపయోగపడుతుంది.

ఇంకెందుకాలస్యం, లొకేషన్ బార్2 పొడగింతని తెచ్చుకోండి మరి.

WordPress.com లో Blog పెట్టుము.