నూతన సంవత్సర కానుక: Koodali.Org
తెలుగు బ్లాగరులందరికీ శుభాకాంక్షలతో నూతన సంవత్సర కానుకగా సరికొత్త కూడలి ని సమర్పిస్తున్నాను. కొత్త కూడలిలో విశేషాలు ఇవీ:
- ఆహ్లాదకరమైన సరికొత్త రూపం (నేననుకొంటే సరిపోదుగా. మీరేమంటారు?)
- ఇకనుండి ప్రత్యేక పేజీల్లో బ్లాగులపై వ్యాఖ్యలు, వార్తలు మరియు వెబ్‌జైనులు కూడా.

దీనికి ప్రతిగా మీరేంచేయాలంటే:
- మీ బుక్కుమార్కులని, మీ బ్లాగు నుండి కూడలికి లింకుని http://koodali.org/ కి నవీకరించుకోండి. (veeven.com/koodali ని koodali.org కి మార్చండి)
- కొత్త కూడలిపై మీ అభిప్రాయాలని తెలియజేయండి.











