వీవెనుడి టెక్కునిక్కులు

సెప్టెంబరు 25, 2006

ఓ వర్డ్‌ప్రెస్ చిట్కా

ప్రచురించిన వర్గము చిట్కాలు, తెలుగు బ్లాగులు — వీవెన్ @ 4:10 am

మీ బ్లాగు టపా యొక్క స్థిరలంకె టపా శీర్షికతొ ఉండటంవల్ల, చాలా పొడవుగా ఉంటుంది. ఉదాహరణకి: http://gsnaveen.wordpress.com/2006/09/25/%e0%b0%aa%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%b2-%e0%b0%aa%e0%b0%be%e0%b0%9f%e0%b0%b2%e0%b1%81-%e0%b0%9a%e0%b0%82%e0%b0%a6%e0%b0%ae%e0%b0%be%e0%b0%ae-%e0%b0%b0%e0%b0%be%e0%b0%b5%e0%b1%87/

URL చిన్నగా ఉండడంకోసం టపా శీర్షికని ఇంగ్లీష్‌లో పెడితే తెలుగు బ్లాగు అన్న పదానికి పూర్తి న్యాయంచేసినట్టవదు. సరిగ్గాఇలాంటి ఇబ్బందిని అధిగమించడానికే Post Sulg అనే ఓ ఎంపిక వర్డ్‌ప్రెస్‌లో ఉంది. మీరు టపా రాస్తున్నప్పుడు, కుడిభాగంలో (వర్గం ఎంచుకుంటారుకదా అక్కడ) నాల్గవది.

ఈ Post slug పెట్టెలో రాసింది మీ టపా కి URL లో వస్తుంది. ఈ పెట్టెలో మన టపా యూక్క శీర్షికని ప్రతిబింబించే ఇంగ్లీష్ పదబంధాన్ని ఇస్తే, టపా శీర్షిక తెలుగులో ఉంటుంది, టపా యొక్క URL చిన్నగా ఉంటుంది. ఉదాహరణకి ఈ టపా URL

(అన్నట్టు పైనిచ్చిన నవీన్ గారి బ్లాగు టపానుండి చిన్న పిల్లల తెలుగుపాటల వీడియో లని చూడొచ్చు.)

సెప్టెంబరు 21, 2006

Bad Time?

ప్రచురించిన వర్గము అవర్గీకృతం — Tags: — వీవెన్ @ 3:23 am

Veeven.com Watch

Yeah, that’s the brand new time peice I’ve designed in Xara X. No, I am not planning to start my own watch business. Doing watches in Xara is fun. But that is not it. There is something more for you to figure out. Just guess what the speciality of the dial is. The title of this post would give you some clue. Be careful; there are enough distractions that stop you from reaching to the right end.
Cannot figure it out, yet? If no one finds it, I’ll post the answer tomorrow. See the answer in the comments below.

సెప్టెంబరు 17, 2006

nikhilE — a Telugu-to-English Translitelator

ప్రచురించిన వర్గము lekhini, లేఖిని — Tags: — వీవెన్ @ 6:10 am

As tools to create Telugu on computer are increasing and as Telugu content is growing on the web, you often get messages from your friends in Telugu or come across a Telugu web page. You can understand Telugu. But… the problem is–

  • you cannot read Telugu
  • or, your computer is not configured to display Telugu

The latter problem can be overcome in just 5 minutes by configuring your computer for Telugu.

However, you cannot learn to read Telugu just then. It takes time. But, you want to know right then what is  the Telugu text in the message you have just received. Or, what the Telugu webpage you are viewing is about. But in most cases, you may not get the English version of the message or webpage.

There you are! nikihiLe is for you. It is a tool that converts (precisely, transliterates) Telugu text into English. It is not a translator. It is a transliterator. That is, it just spells the Telugu words in English. For example, the word “English” in Telugu is transliterated as “iMgleesh^”. Not worse than characters that do not make sense, right? Try it now.

To read such English-transliterated text fast, you need to get used to it. :-) This transliteration is based on RTS standard.

nikhilE is in response to the request from Kamesh Chittela. The name is coined by Kiran Chava. Thanks, guys.

If you like nikhilE and would wish to spread it, I have made nice button for you:nikhilE.

  • Image URL: http://lekhini.org/nikhile-button88×31.png
  • nikhilE URL: http://lekhini.org/nikhile.html

(If you use Firefox for your web browsing, you can use Padma extension to transliterate Telugu text. I feel that it is simpler to use Padma extension than everytime coming to nekhilE.)

aanaMda telugu saMbhaashaNaM!

(తెలుగు బ్లాగర్లూ, తెలుగులో చదవలేని మీ సందర్శకులని నిఖిలేకి పంపండి.)

సెప్టెంబరు 13, 2006

కూడలికి చిన్న చిన్న మార్పులు

ప్రచురించిన వర్గము koodali, కూడలి — వీవెన్ @ 3:47 am
  • రూపు కొంచెం మార్చా
  • సూక్ష్మసంగ్రహంగా కొత్త టపా యొక్క శీర్షిక (మంటనక్క 2 బీటా వాడేవారు ప్రయత్నించవచ్చు. మంటనక్క 2 విడుదలయ్యేలోపు దీనిగురించి మరింత వివరంగా రాస్తా. ప్రస్తుతానికి ఈ సహాయపు పేజీ చూడండి.)
  • ఏదేని అంశంపై సందర్శకుల దృష్టిని ఆకర్షించడానికి ఒక గమనిక పెట్టె.

ఈ గమనిక పెట్టెలో కి విషయాన్ని తెలుగుబ్లాగు సమూహపు సభ్యులు సూచించవచ్చు. (విషయము, లంకె, తదితర వివరాలతో నాకు ఓ రెండ్రోజులముందు ఈ-మెయిల్ చెయ్యండి. అత్యవసరమైతే నేను త్వరగా స్పందిస్తా.)

సెప్టెంబరు 2, 2006

వెబ్‌లో తెలుగు ఎదుగుతూంది

ప్రచురించిన వర్గము Telugu, తెలుగు, తెలుగు బ్లాగులు, లేఖిని — Tags: — వీవెన్ @ 3:25 pm

కంప్యూటర్లో తెలుగు రాయడానికి, చూడడానికి చాలా మంది ప్రయత్నిస్తునట్టున్నారు. గత 60 రోజులలో నా బ్లాగుకి (నా వెబ్‌సైట్లు కలపకుండా) ఈ అన్వేషణ పదాలు సందర్శకులని పంపించాయి. (తెలుగుకి సంభందించని పదాలని తీసివేసా.)

ఆర్కుట్‌లో లేఖినికో సమూహం

ప్రచురించిన వర్గము lekhini, తెలుగు, లేఖిని — వీవెన్ @ 4:45 am

ఆశ్చర్యం! లేఖినికి ఇంత సీనుందని నేననుకోలేదు. వెబ్‌లో తెలుగు వెల్లివిరుస్తుందని ఆశిద్దాం!

సెప్టెంబరు 1, 2006

ఫైర్‌ఫాక్స్ 2 లో కొత్త హంగులు

ప్రచురించిన వర్గము తెలుగు, ఫైర్‌ఫాక్స్ — వీవెన్ @ 1:49 am

ఈ అక్టోబర్‌లో ఫైర్‌ఫాక్స్ 2 రానుంది. రెండవ బీటా కూడా నిన్ననే విడుదలయ్యింది. ఈ నేపధ్యంలో, ఫైర్‌ఫాక్స్ 2 లో ఏమేమి కొత్త హంగులు ఉండబోతున్నాయో చూద్దాం. నేనిప్పటికే బీటాని వాడుతున్నా. సంతృప్తికరంగా ఉంది. ఉత్సుకత ఉంటే మీరూ ప్రయత్నించండి. (గమనిక: బీటా సాఫ్ట్‌వేర్ అనేది డెవలపర్లకి, పరీక్షకులకి మాత్రమే ఉద్దేశించింది.)

  • కొత్త రూపు: నవీకరించబడిన రూపు మనకి మరింత ఆహ్లాదకరమైన వెబ్ విహరణ అనుభూతినిస్తుంది.
  • అంతర్నిర్మిత స్పెల్ చెకింగ్: ఇంగ్లీష్ స్పెల్ చెకింగ్ ఫైర్‌ఫాక్స్‌లోనే అంతర్నిర్మితమై వస్తుంది. ఇంగ్లీష్‌లో మీరేం టైపు చెయ్యాల్సివచ్చినా (బ్లాగుల్లో, ఫోరంలలో, ఈ-మెయిల్‌లో) మీ సందేశం అక్షరదోషంలేకుండా చూసుకోవచ్చు. ఇతర భాషలను కూడా extensionsగా చేర్చుకోవచ్చు. తెలుగు భాషకి ఇంకా అందుబాటులో ఉన్నట్టులేదు.
  • సెర్చ్ సలహాలు: మీరు వెతకబోయే విషయాన్ని సెర్చ్ బాక్స్‌లో టైపుచేస్తూఉన్నప్పుడే, అందుకు తగిన పదాలు ఓ drop-down జాబితాలో కనిపిస్తాయి. ఇది ఫైర్‌ఫాక్స్ సెర్చ్‌బార్ నుండి యాహూ!, గూగుల్, మరియు ఆన్సర్స్.కాం లని వెతుకుతున్నపుడు పనిచేస్తుంది.
  • సెర్చ్ ప్లగిన్ నిర్వహణ: ఫైర్‌ఫాక్స్ సెర్చ్‌బార్ నుండి పనిచేసేలా కొత్త సెర్చ్ ఇంజిన్‌లని సులువుగా చేర్చుకోవడం, ఉన్నవాటిని పైకి క్రిందికి మార్చుకోవడం ఇప్పుడు సాధ్యం.
  • సెషన్ రీస్టోర్: ఫైర్‌ఫాక్స్ గనుక పొరపాటున క్రాషైతే, తిరిగి మొదలైనప్పుడు గత స్థితిని గుర్తుపెట్టుకుంటుంది. అంటే మీరు చూస్తున్న వెబ్‌సైట్లు, వెబ్‌లో రాస్తున్న విషయం అన్నీ అలానే ఉంటాయి. అలాగే మీరు పొరపాటున మూసేసిన టాబ్‌లని కూడా తిరిగి తెరుచుకోవచ్చు.
  • ఫిషింగ్ నుండి రక్షణ: ఫిషింగ్ అంటే అసలు సైటును పోలిన నకిలీ సైటుద్వారా మీ వ్యక్తిగత సమాచారాన్ని కాజేయడం. ఇటువంటి అనుమానాస్పద వెబ్‌సైట్లని గనుక మీరు పొరపాటున సందర్శిస్తుంటే, ఫైర్‌ఫాక్స్ మిమ్మల్ని హెచ్చరిస్తుంది.
  • మెరుగైన ఫీడ్ తోడ్పాటు: వెబ్‌సైట్లు అందించే ఫీడ్లని ఫైర్‌ఫాక్స్ 2 మరింత బాగా గుర్తిస్తుంది. ఆ ఫీడ్ యొక్క previewని చూపిస్తుంది. ఆ ఫీడ్లని నేరుగా మీ నా యాహూ!, బ్లాగ్‌లైన్స్, గూగుల్ రీడర్, లేదా మరేదైనా మీకిష్టమైన వెబ్‌సేవకి లో చేర్చుకొనే అవకాశాన్ని కల్పిస్తుంది. లేదా ఈ ఫీడ్లని ఫైర్‌ఫాక్స్‌లోని లైవ్ బుక్‌మార్క్స్‌గా కూడా చేర్చుకోవచ్చు.
  • మెరుగైన ఆడ్-ఆన్ నిర్వహణ: ఎక్స్‌టెన్షన్ మరియు థీమ్ నిర్వహణలు ఇప్పుడు ఒకే విండోలో (వేర్వేరు టాబ్‌ల్లో) ఉంటాయి. ఏదైనా కొత్త ఎక్స్‌టెన్షన్‌ని చేర్చినప్పుడి సులువుగా ఫైర్‌ఫాక్స్‌ని రీస్టార్ట్ చేసుకోవడానికి ఈ ఆడ్-ఆన్ విండోలో ఓ బటన్ కూడా ఉంటుంది.
  • సూక్ష్మ సంగ్రహాలు: ఇప్పటివరకు బుక్‌మార్క్ శీర్షికగా ఆ వెబ్‌పేజీ యొక్క శీర్షికే ఉండేది. కానీ ఈ సూక్ష్మ సంగ్రహాలతో, మీ బుక్‌మార్కుల శీర్షికలు డైనమిక్‌గా మరింత ఉపయోగకరంగా మారనున్నాయి. (ఉదాహరణకి, మీరో వేలం సైట్లో ఒక బిడ్ వేసి దాన్ని బుక్‌మార్క్ చేసుకున్నారునుకోండి, ఆ బుక్‌మార్క్ శీర్షికగా వేలంయొక్క ప్రసుత ధర కనిపిస్తుంది. మీరేదైనా బ్లాగుని బుక్‌మార్క్ చేసుకుంటే, ఆ బ్లాగులోని కొత్త టపా యొక్క శీర్షిక కనిపిస్తుంది.) అయితే, వెబ్‌సైట్లు ఈ సూక్ష్మ సంగ్రహాల్ని అందిస్తే తప్ప సాధారణ వాడకందార్లకి తమకిష్టమైన సంగ్రహాలని పొందడం ప్రస్తుతానికి కొంచెం కష్టం.
  • టాబ్ విహరణకి మెరుగులు: ప్రతి టాబ్ పై దాన్ని మూసేయడానికో బటన్. టాబ్‌బార్ కుడి చివరన, తెరిచిఉన్న టాబ్‌లని జాబితాగా చూపించే ఒక బటన్.
  • చిన్నా చితకా: జావాస్క్రిప్ట్ 1.7కి తోడ్పాటు, మరింత SVG తోడ్పాటు, విండోస్‌కి నల్‌సాప్ట్ ఇన్‌స్టాలర్ కూడా, ఇంకా మరెన్నో బగ్ ఫిక్సులు

WordPress.com లో Blog పెట్టుము.