వీవెనుడి టెక్కునిక్కులు

జులై 28, 2006

Lekhini.Org

ప్రచురించిన వర్గము Telugu, తెలుగు, లేఖిని — Tags: — వీవెన్ @ 6:42 am

ఇప్పుడు లేఖినిని చేరడం మరింత సులభం. http://lekhini.org/  (మీరు www టైపుచేయనవసరం లేదు.)

జులై 20, 2006

లేఖినికి మరిన్ని మెరుగులు

ప్రచురించిన వర్గము Telugu, lekhini, తెలుగు, లేఖిని — Tags: — వీవెన్ @ 2:37 am

లేఖినికి మరిన్ని మెరుగులు: 

  1. మీ అక్షరపట్టిక సెటింగ్‌ని లేఖిని ఇప్పుడు గుర్తుంచుకుంటుంది. మీరు ప్రతిసారీ దాన్ని తొలగించుకోనవసరం లేదు.
  2. అత్యంత అవసరమైన సహాయము పేజీ ఇప్పుడు మీకు సహాయపడగలదు. (ఇంకా ఏం కావాలి? మార్పులు, చేర్పులు సూచించండి.)
  3. auto-scroll కి మొదటి ప్రయత్నం. (ఒపెరా లో పనిచెయ్యదు. ఫైర్‌ఫాక్స్ లో పనిచేస్తుంది. కాని మెరుగుపరచాలి.IE లో ఓకే.) పరీక్షించి మీ ఇబ్బందులు తెలియజేయండి.
  4. పట్టిక తొలగింపు బటన్ ఇప్పుడు మరింత discoverable.
  5. ఇప్పుడు, కల్హార (kal&haara), బిల్హనుడు (bil&hanuDu) లాంటి పదాలు (ల్హ లో వచ్చేవి) టైపు చెయ్యవచ్చు. ఇంతకు ముందు output లో వచ్చే & ని తొలగించుకోవలసి వచ్చేది.

ఆనంద లేఖనం!

జులై 18, 2006

I protest, too

ప్రచురించిన వర్గము అవర్గీకృతం — Tags: , — వీవెన్ @ 2:55 pm

జులై 16, 2006

లేఖినికి కొత్త (చిన్ని చిన్ని) హంగులు

ప్రచురించిన వర్గము Telugu, lekhini, తెలుగు, లేఖిని — వీవెన్ @ 3:31 am

లేఖిని ఇప్పుడు మరింత సౌకర్యవంతం.సరికొత్త హంగులివే:

  1. అక్షర పట్టికని తొలగించుకోవచ్చు, తిరిగి తెప్పించుకోవచ్చు. ఒక్క మూషికపు నొక్కుతో! (పట్టిక కుడివైపు పైన X)
  2. Input మరియు output పెట్టెల పొడవుని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. (input box కుడివైపు క్రింద చూడండి.)
  3. చిన్న కంప్యూటర్ తెర ఉన్నవారు ఎక్కువ స్థలంకోసం గులాబీ రంగు శీర్షికని కూడా తొలగించుకోవచ్చు. (దాని మీద ఒక క్లిక్కివ్వండి చాలు.) ఆ గులాబీ రంగుని ఎక్కువసేపు చూడలేనివారికి కూడా ఉపయోగమే!
  4. ప్రశ్నార్థకం (?) మరియు ఆశ్చర్యార్థకం (!) ఇప్పుడు on-the-jump మీటల జాబితాలోకి చేరాయి.
  5. మీ బ్లాగు లేదా వెబ్‌సైట్ నుండి లేఖినికి లంకె వెయ్యడానికో రెండు చిన్న బటన్లు.
  6. ఇకనుంచి, veeven.com/lekhini కూడా పనిచేస్తుంది.

 ఇంకెందుకాలస్యం, ఇప్పుడే వెళ్ళి చూడండి.

జులై 2, 2006

కూడలికో చిహ్నం

ప్రచురించిన వర్గము Telugu, తెలుగు, తెలుగు బ్లాగులు — Tags: — వీవెన్ @ 5:27 am

కూడలిని వాడటానికి మరో సాకు: ఇప్పుదు కూడలి సరికొత్త చిహ్నంతో వస్తుందిగా!

Koodali Logo

చదువరీ, మీరిచ్చిన C-DAC వారి తెలుగు CDని వాడే అవకాశం ఇప్పటికి వచ్చింది. :-) సుధాకర్, ఈ CDలో నూటాయాభై వరకు ఫాంట్లు ఉన్నా, బాపు రాత మాత్రం లేదు :-( ఉన్నవన్నీ కూడా చాలామట్టుకు తోబుట్టువులే (variations of the same font).

మీ బ్లాగు లేదా వెబ్‌సైట్ నుంచి కూడలికి లంకె వెయ్యడానికి ఈ చిన్న బటన్ ని వాదండి. Koodali Button

నమూనా కోడ్:

<a href="http://veeven.com/koodali/" title="కూడలి">
    <img src="http://veeven.com/koodali/button88x31.png"
        alt="కూడలి: తాజా తెలుగు బ్లాగులు"
        style="border:0;width:88px;height:31px;" />
</a>

కూడలి కోసం నేను ప్రయత్నించిన ఇతర వైవిధ్యాలు (బొమ్మలన్నీ నన్ను మెప్పించిన జారా తో.):
Koodali Discarded Logo Ideas

జులై 1, 2006

తెవికీ ప్రగతి నివేదిక - జూన్ 2006

ప్రచురించిన వర్గము తెలుగు — Tags: — వీవెన్ @ 5:56 am

తెలుగు వికీపీడియా ప్రగతి నివేదిక - జూన్ 2006

జూన్ 30, 2006 న—

  • వ్యాసాలు: 3,338
  • సభ్యులు: 470

జూన్ నెలలో విశేషాలు: 

జూలై నెల ప్రాధామ్యాలు:

మీ నిరంతర తోడ్పాటుతోనే ప్రగతి సాధ్యం.

WordPress.com లో Blog పెట్టుము.