వీవెనుడి టెక్కునిక్కులు

మే 29, 2006

స్వేఛ్ఛా సాఫ్ట్‌వేర్

ప్రచురించిన వర్గము తెలుగు — Tags: , , — వీవెన్ @ 2:08 pm

ఏదైనా ఓక ప్రోగ్రాం యొక్క వినియోగదారులు ఈ క్రింద చెప్పిన అన్ని స్వాతంత్ర్యాలని కలిగిఉంటే ఆ ప్రోగ్రాంని స్వేఛ్ఛా సాఫ్ట్‌వేర్ అనవచ్చు.

  1. ఆ ప్రోగ్రాంని ఉపయోగించుకొనే స్వేఛ్ఛ
  2. ఆ ప్రోగ్రాం ఎలా పని చేస్తుందో అధ్యయనం చేసి దాన్ని అవసరానికి అనుగుణంగా తీర్చిదిద్దుకొనే స్వేఛ్ఛ.
  3. ఆ ప్రోగ్రాం ని పునఃపంపిణీ చేయగల్గిన స్వేఛ్ఛ (మీ పక్కింటతనికి మీరు సహాయం చెయ్యవచ్చు.)
  4. ఆ ప్రోగ్రాం ని మెరుగుపరిచే, మరియు మీ మెరుగుల్ని జనులందరికీ అందించగల్గే స్వేఛ్ఛ (సమాజం అంతా లబ్ధి పొందుతుంది.)

(2 మరియు 4వ స్వేఛ్ఛలకి ఆ ప్రోగ్రాం యొక్క మూల సంకేతం (source code) వినియోగదారునికి అందుబాటులో ఉండాలి.)

అంటే స్వేఛ్ఛా సాఫ్ట్‌వేర్ ప్రోగ్రాం యొక్క కాపీలని యథాతధంగా గానీ, లేదా మార్పులతో గానీ, ఉచితంగా గానీ, రొక్కమునకు గానీ, ఎవరికైనా, ఎప్పుడైనా మీరు అందిచవచ్చు. ఇవన్నీ చేయగల్గడానికి మీకు ఎవరి అనుమతి అవసరం లేదు, మీరెవరికీ ఏమీ చెల్లించనవసరం లేదు.

మీరు ఒక స్వేఛ్ఛా సాఫ్ట్‌వేర్ ని పైకానికి కొని ఉండవచ్చు, లేదా ఉచితంగానైనా పొంది ఉండవచ్చు. మీరు ఎలా పొందారు అన్నదాంతో సంబంధం లేకుండా, దాన్ని కాపీ చేసుకోవచ్చు, మార్చుకోవచ్చు, కాపీలని అమ్ముకోవచ్చు కూడా.

సుప్రసిద్దమైన వెబ్ విహరిణి ఫైర్‌ఫాక్స్ మరియు ఓపెన్ఆఫీస్ లు స్వేఛ్ఛా సాఫ్ట్‌వేర్లకి ఉదాహరణలు.

గమనిక: గ్నూ వారి స్వేఛ్ఛా సాఫ్ట్‌వేర్ నిర్వచనం నుండి సంగ్రాహ్యం.

మే 27, 2006

తెలివిజన్ నుండి అ(తి)తెలివిజన్ వరకు

ప్రచురించిన వర్గము Telugu, తెలుగు — Tags: — వీవెన్ @ 5:01 am

పరిణామక్రమం

  • మొదటి తరం
    • కార్యక్రమానికి కార్యక్రమానికీ మధ్యలో ప్రకటనలు
    • ఒకే ఛానలు
    • కాశీమజిలీ కథలు లాంటి సీరియళ్ళకోసం ఎంతో ఎదురుచూసేవాళ్ళం
  • రెండవ తరం
    • కార్యక్రమాల మధ్యలో ప్రకటనలు
    • మరిన్ని ఛానల్లు
  • మూడవ మరియు నేటి తరం
    • ప్రకటనల మధ్యలో కార్యక్రమాలు
    • లెక్కకు మిక్కిలి ఛానల్లు

మే 15, 2006

పుస్తకాల పురుగు కుట్టింది!

ప్రచురించిన వర్గము Telugu, తెలుగు — Tags: — వీవెన్ @ 2:48 am

మిమ్మల్నిపుస్తకాల పురుగు కుట్టింది!

ఈ పురుగు కుడితే మీరు వెంటనే చేయవలసిన వైద్యం: మీరు మీ తెలుగు బ్లాగునందు మీరు చదివిన ఏదైనా పుస్తకము పేరు వివరములు తెలుగులో వ్రాయవలెను, లేకున్నచో ఈ పురుగు కాయతొలుచు పురుగు, వేరు తొలుచు పురుగు లా మీ మెదడును ఓ రాత్రివేళ తొలిచివేస్తుంది.

కనుక మీరు వెంటనే ఏదైనా పుస్తకము గురింవి వ్రాసి తగిన జాగ్రత్త వహించవలెను

సరే ఇక నా గురించి , మరీ క్రమం తప్పకుండా కాదుకానీ అప్పుడప్పుడూ వీటిని తిరగేస్తుంటా:

  • యండమూరి గారి మైండ్ పవర్ 
  • రాబర్ట్ కియోసాకి వ్రాసిన రిచ్ డాడ్ పూర్ డాడ్
  • స్టీఫెన్ కొవే యొక్క 7 హాబిట్స్
  • లారెన్ లెస్సిగ్ వ్రాసిన ఫ్రీ కల్చర్

ఈ పురుగు నాకు కిరణ్ చావా నుంచి వచ్చి కుట్టింది.నేను దీన్ని ఇద్దరికి కుట్టించాలి. కనుక త్రివిక్రమ్ మరియు స్వాతి లని ఎంచుకున్నాను. మీరు దీనిచే మరో ఇద్దరికి కుట్టించాలి.

మే 13, 2006

Anonymity in Telugu

ప్రచురించిన వర్గము Telugu, తెలుగు — Tags: — వీవెన్ @ 10:17 am

అనామకత్వాన్ని తెలుగులో ఎన్ని రకాలుగా చెప్పవచ్చు:

  1. ఆకాశరామన్న
  2. అనామకుడు/అనామిక
  3. అపరిచితుడు
  4. గుంపులో గోవిందయ్య
  5. నలుగురిలో నారాయణ
  6. దారిన పోయే దానయ్య
  7. రోడ్డున పోయే రంగన్న
  8. వీధిలో వీరన్న
  9. నగరంలో నర్సయ్య

మీకు ఇంకేమైనా తడితే వ్యాఖ్యలుగా చేర్చండి.

మే 12, 2006

Firefox Tabbed Browsing Tips in Telugu

ప్రచురించిన వర్గము తెలుగు, ఫైర్‌ఫాక్స్ — Tags: , — వీవెన్ @ 5:02 pm

వెబ్‌లో విహరించేటప్పుదు టాబ్‌ల ని వాడటంద్వారా చాలా సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. క్రింది అంశాలు ఫైర్‌ఫాక్స్‌లో టాబ్‌ల వాడకాన్ని విశదీకరిస్తాయి.

  • ఏదైనా వెబ్‌పేజీలో మనకి ఆసక్తికరమైన లింక్ టాబ్‌లో తెరిస్తే, ప్రస్తుత పేజీని మనం చదివే లోపులో అది లోడ్ అయ్యిఉంటుంది.
    • లింక్ మీద Ctrl + ఎడమ క్లిక్, లేదా మధ్య క్లిక్ (మీ మూషిక చక్రాన్ని నొక్కండి.)
  • ఒక టాబ్ నుంచి ఇంకో టాబ్‌కి మారడం చాలా సులువు.
    • తర్వాత టాబ్‌కి: Ctrl + Tab, Ctrl + PageDown
    • వెనుక టాబ్‌కి: Ctrl + Shift + Tab, Ctrl + PageUp
    • మొదటి టాబ్‌కి: Ctrl + 1; రెండవ టాబ్‌కి: Ctrl + 2; అలా తొమ్మిది వరకు
  • టాబ్‌ని మూసెయ్యాలంటే:
    • ఆ టాబ్ మీద మధ్య క్లిక్ (చక్రం)
    • ప్రస్తుత టాబ్ ఐతే: Ctrl + W
  • కొత్త ఖాళీ టాబ్ తెరవాలంటే:
    • Ctrl + T
    • టాబ్ ల ప్రక్కన ఖాళీ స్థలంలో డబల్ క్లిక్

నాలా కీ బోర్డ్ ఎక్కువగా వాడేవారికి ఇవి ఉపయోగపడుతాయనుకుంటున్నాను. ఇంకా ఏమైనా సందేహాలుంటే నాకు వ్రాయండి: veeven ఎట్ gmail డాట్ com లేదా ఇక్కడ వ్యాఖ్యలుగా వ్రాయండి.

WordPress.com లో Blog పెట్టుము.